Latest

రెడ్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షీ చౌదరి.. పిక్స్ వైరల్!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరి సరికొత్త ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్రీజీ రెడ్ కలర్ శారీలో దేవకన్యలా మెరిసిపోయింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్, సింపుల్ మేకప్, లూజ్ హెయిర్‌తో ఎర్ర కలువ పువ్వులా వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ట్రెడిషనల్ అండ్ గ్లామరస్ లుక్‌కు నెటిజన్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. 'లక్కీ భాస్కర్', 'ది గోట్' సినిమాలతో మెప్పించిన ఈ క్రేజీ హీరోయిన్, ప్రస్తుతం చేతినిండా స్టార్ హీరోల ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ తాజా పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ట్రంప్ ఒక గ్రీక్ గాడ్- ఫాలోయర్ల ప్రశంసలు !
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చుట్టూ పరిణామాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆయనపై వచ్చిన అనేక కోర్టు కేసులు, లీగల్ ఇబ్బందుల తర్వాత కూడా ఆయన మళ్లీ పుంజుకున్న తీరును చూసి మద్దతుదారులు సర్ ప్రైజ్ అవుతున్నారు.ఈ క్రమం లోనే ఆయన ఫాలోవర్స్ , అంత ర్జాతీయ విశ్లేషకులు "ఈ రోజుల్లో జీసస్ క్రైస్ట్ తర్వాత మళ్లీ అంతటి ప్రజాదరణ దక్కించుకుం టున్న వ్యక్తి ట్రంప్ మాత్రమేనని, ఆయన్ను ఒక గ్రీక్ గాడ్ లా చూస్తున్నారని" సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేసులు , రాజకీయ గండాల న్నింటినీ దాటుకుని ఆయన సక్సెస్ అయ్యారనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ వైరల్వు అతున్నాయి.

సందడి మాటున బంగారు గొడుగు ఎత్తుకెళ్లిన దొంగలు
AP: నంద్యాల జిల్లా ఔకు మండల కేంద్రంలో మౌలాలి స్వామి పీరుకు అలంకరించిన బంగారు గొడుగును దొంగలు అపహరించారు. సుమారు రూ.2 లక్షల విలువైన 13 గ్రాముల బంగారు గొడుగును గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేశారు. నైలాన్ ధారంతో కట్టిన బంగారు గొడుగును బ్లేడుతో కత్తిరించి కొట్టేశారు. మౌలాలి స్వామి పీర్ల చావిడి వద్ద సందడి ముసుగులో హల్‌చల్ చేసిన ఆకతాయిలు, మందుబాబులపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మౌలాలి స్వామి పీర్ల చావిడి ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిరుతపులి వీడియో వైరల్.. గ్రామస్తుల్లో టెన్షన్
TG: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట శివారులోని పామాయిల్ తోటల్లో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనలు గురవుతున్నారు. శివారులో విస్తారంగా పామాయిల్ తోటలు ఉండటంతో నక్కల వర్రే కాల్వ వెంబడి మనుబోతులగడ్డ, పోచారం అటవీ ప్రాంతాల నుంచి పులి వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖానాపూర్ మండల ప్రజల్లో ఆందోళన నెలకొంది.

తాకట్టు బంగారం మాయం.. కస్టమర్లకు షాక్
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం మణప్పురం బ్రాంచ్‌లో కొందరు కస్టమర్లు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. 8 మంది కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. ఆ బంగారం స్థానంలో నకిలీ నగలు పెట్టారు. మొత్తం రూ.20లక్షల విలువైన 151 గ్రాముల బంగారం మాయమైంది. మణప్పురం మాజీ మేనేజర్ నగేశ్ మోసం చేసినట్లు ఆడిట్‌లో తేలింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతడు ఉద్యోగం మానేసి చెన్నై వెళ్లినట్లు గుర్తించారు. నగేష్‌ను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.
నేషనల్ హైవేపై మూడు కార్లు బోల్తా.. ఫుల్ ట్రాఫిక్‌జామ్
TG: హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ఘోర రోడ్ యాక్సిడెంట్ జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద కారు టైర్ పేలి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టిన కారు అంతటితో ఆగకుండా అవతలి రోడ్డుపై ఎగిరిపడి మరో రెండు కార్లపై పడింది. వరుసగా మూడు కార్లు బోల్తా పడడంతో హైవేపై ఫుల్ ట్రాఫిక్‌జామ్ అయింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చౌటుప్పల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు.

గుత్తా ఫొటో మిస్సింగ్.. నల్గొండలో ప్రోటోకాల్ రచ్చ
TG: CM రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన రసాభాసగా మారింది. సీఎం సభ సందర్భంగా R&B శాఖ ఇచ్చిన పత్రికా ప్రకటనలో శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ పాటించలేదని సంబంధిత అధికారులకు గుత్తా సుఖేందర్ రెడ్డి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు సభకు రావొద్దంటూ DCC అధ్యక్షుడు కైలాష్ నేతను మంత్రి కోమటిరెడ్డి వర్గం నాయకులు హెచ్చరించారు. తనకు ఆహ్వానం అందలేదని, అయినా సభకు హాజరవుతానని కైలాష్ సవాల్ చేశారు. దీంతో కైలాష్ నేతను, ఆయన వర్గాన్ని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.

నల్గొండలో CM సభ.. టెన్షన్ టెన్షన్
TG: నల్గొండలో CM రేవంత్ రెడ్డి సభ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ప్లెక్సీల్లో DCC అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఫోటో లేకపోవడం వివాదానికి దారి తీసింది. అసలు CM సభకు తనకు ఆహ్వానమే లేదని కైలాష్ నేత అన్నారు. సభకు హాజరై తీరుతానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కైలాష్ నేత సవాల్ విసిరారు. దీంతో మరోసారి తెరపైకి DCC వర్సెస్ మినిస్టర్ పాలిటిక్స్‌లా మారింది. మరొవైపు సభలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మంత్రి పదవిపై నిలదీస్తారన్న సమాచారంతో రాజ్ గోపాల్ రెడ్డి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

స్నాప్‌చాట్‌లో పరిచయం పెంచుకుని బ్లాక్‌మెయిల్
TG: సోషల్ మీడియా వేదికలైన స్నాప్‌చాట్ తదితర యాప్‌ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను లోబర్చుకుని, వారి అశ్లీల ఫొటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓ హోటల్ గదిలో మహిళను కత్తితో బెదిరించి ఆమె అశ్లీల వీడియోలను రికార్డు చేశారని అన్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ రూ.1.10 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్
AP: శ్రీకాకుళం జిల్లా కవిటి మండల పరిధిలోని జమేదారిపుట్టుగ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే మృతి చెందారు. ఆటోలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

DDపై మహిళా అధికారిణి సంచలన ఆరోపణలు
AP: గుంటూరు వైద్యారోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్(DD) శివశంకర్ తనను తీవ్ర మానసిక, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసే ఓ గెజిటెడ్ అధికారిణి ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు వెళ్లినా, డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రతినెలా ఏదో వంకతో మెమోలు ఇవ్వడం, సెలవులు రద్దుచేయడం, గ్రూపుల నుంచి నంబర్ తీసేయడం వంటి పనులతో వేధిస్తున్నారన్నారు. తన కుటుంబం తెలంగాణలో ఉండగా, ఉద్యోగరీత్యా ఇక్కడ పని చేస్తున్నానన్నారు. శివశంకర్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గుడ్‌బై
జూలై 8వ తేదీ నుంచి విశాఖపట్నం పాత ఎయిర్‌పోర్ట్ నుంచి వాణిజ్య విమాన ప్రయాణాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు భారత నౌకాదళం ఆధీనంలో ఉన్న పాత ఎయిర్‌పోర్టు నుంచి సాగుతున్న ప్రయాణాలన్నీ, ఇకపై 50కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి జరగనున్నాయి. ఈ కొత్త విమానాశ్రయం అత్యాధునిక సౌకర్యాలతో, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌లో రూపొందించారు. విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్న పాత విమానాశ్రయం ఇకపై కేవలం ఇండియన్ నేవీ కార్యకలాపాలకే పరిమితం కానుంది.

MP కేశినేని చిన్నిపై CM రేవంత్ రెడ్డికి నాని ఫిర్యాదు
విజయవాడ MP కేశినేని శివనాథ్ (చిన్ని) భూకబ్జాను అడ్డుకోవాలని కోరుతూ మాజీ MP కేశినేని నాని CM రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కూకట్‌పల్లి మండలం ప్రగతినగర్ సమీపంలోని షంషిగూడలో TGIIC IT పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వభూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కేశినేని నాని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించిన వ్యవహారంలో ED విధించిన యాక్టివ్ ఫ్రీజ్ ఆదేశాలు, NCLT ఇన్‌సాల్వెన్సీ పరిమితులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాకుండా, ప్రైవేట్ రాజీ పిటిషన్ల ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.

వైరల్‌గా మారిన అధికారి వసూళ్ల డైరీ
TG: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన నిజామాబాద్ ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నెలవారి మామూళ్ల చిట్టాను చూసి ACB అధికారులు షాక్ అయ్యారు. నిజామాబాద్ కల్లు దుకాణం రూ.15వేల మామూలును 20వేలకు పెంచారని, బోర్గం కల్లు దుకాణం మామూలు రూ.5వేల నుంచి రూ.12వేలకు పెంచారని ఇలా అనేక కల్లుడిపోల నుంచి నెలవారీ మామూళ్లను ఆయన సేకరించారని పేర్కొన్నారు. కల్లు డిపోలు, వైన్స్ షాపుల నుంచి నెలకు రూ. 2లక్షల వరకు అక్రమ వసూళ్లు అంటూ డైరీలో లెక్కలు రాసి పెట్టాడు. డైరీలో రాసిన వసూళ్ల చిట్టా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కోడూరు బీచ్‌లో ముగ్గురు చిన్నారుల గల్లంతు
AP: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బీచ్‌లో స్నానం చేస్తుండగా ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బాలుడు మహమ్మద్ సుఫియాన్ మృతి చెందాడు. ఓ బాలికను జాలర్లు కాపాడగా, మరో బాలిక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఆ బాలిక కోసం గాలిస్తున్నారు. సముద్ర స్నానానికి వచ్చి ప్రమాదంలో చిక్కుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
LBనగర్ ఆరంజ్ హాస్పిటల్‌లో మహిళ వీరంగం
TG: హైదరాబాద్ LBనగర్‌లో ఉన్న శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్‌కు లలిత కరీర అనే మహిళ కడుపునొప్పి ఉందంటూ అర్ధరాత్రి అత్యవసర విభాగానికి వచ్చింది. విధుల్లో ఉన్న డాక్టర్స్ ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి పరీక్షలు నిర్వహించగా, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని నిర్ధారించారు. అనంతరం మహిళ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై వైద్యులు, నర్సులను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకుంది. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న రోగులు, వారి బంధువులు టెన్షన్ పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

గృహప్రవేశ వేడుకలో బీభత్సం.. కర్రలు, రాళ్లతో దాడి
TG: మేడ్చల్ జిల్లా మేడిపల్లి PS పరిధిలోని బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో నూతనంగా గృహప్రవేశం చేసిన కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. సుమారు 40 నుంచి 50 మంది వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులని చూడకుండా కర్రలు, రాళ్లతో విచక్షణరహితంగా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గుంపు మేస్త్రీ అయితే ఓకే.. ముంపు మేస్త్రీ కావొద్దు
TG : CM రేవంత్ రెడ్డి.. గుంపు మేస్త్రీ అయితే తనకు అభ్యంతరం లేదని.. కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రీ కావొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కర్ణాటకలో జరిగిన తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల సీఎంలు సమావేశమై ఒప్పందం చేసుకున్నారని, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కలిసి తెలంగాణను ముంచుతుంటే.. ఆయా రాష్ట్రాల CMలతో కలిసి రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ముగ్గురు CMల సమక్షంలో జరిగిన చీకటి ఒప్పందం ఏంటో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జులై 15 నుంచి కొత్త స్కీమ్
TG : రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) జులై 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ మొదటి సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని CS తెలిపారు. గతంలో చికిత్సలకు గరిష్ఠంగా రూ.2 లక్షలు చెల్లించేవారని, దాన్ని ఒకేసారి చికిత్సకు కనీసం రూ.5 లక్షలిచ్చేలా మార్చాలని TS PRTU రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి కోరారు.

ఆన్‌లైన్ ఫ్రాడ్ బాధితుల కోసం ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు!
డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడుతున్న ఖాతాదారులకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రతిపాదనలు చేసింది. సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు నష్టపోయిన బాధితులకు బ్యాంకుల నుంచి వేగంగా పరిహారం (Compensation) అందేలా కొత్త నిబంధనలను తీసుకురానుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం కస్టమర్ల తప్పు లేకపోయినా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు ఎక్కువ సమయం పడుతోంది. అయితే, ఇకపై మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే బాధితులకు తగిన ఉపశమనం కలిగించేలా, బ్యాంకుల జవాబుదారీతనాన్ని పెంచేలా ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్‌బీఐ సిద్ధం చేస్తోంది.

సముద్ర గర్భంలో వింత లోకం.. రెండు వారాల్లో 31 కొత్త జీవుల గుర్తింపు!
సముద్రపు అగాధాలలో దాగున్న రహస్యాలను ఛేదించే క్రమంలో శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన మైలురాయిని సాధించారు. కేవలం రెండు వారాల పాటు సాగిన ఒక ప్రత్యేక సముద్ర పరిశోధన యాత్రలో ఏకంగా 31 కొత్త రకాల వింత సముద్ర జీవులను కనుగొన్నారు. ఇప్పటివరకు మానవ ప్రపంచానికి తెలియని సరికొత్త రకాల చేపలు, జెల్లీఫిష్‌లు, మరియు ప్రత్యేకమైన అండర్ వాటర్ జీవులు ఈ జాబితాలో ఉన్నాయి. అత్యాధునిక డీప్-సీ టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భంలో వేల అడుగుల లోతుకు వెళ్లి ఈ పరిశోధనలు చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఆవిష్కరణ సముద్ర జీవవైవిధ్యంపై మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు.