← Back to news

తాకట్టు బంగారం మాయం.. కస్టమర్లకు షాక్

By DK· 28 Jun 2026· కోనసీమ జిల్లా
తాకట్టు బంగారం మాయం.. కస్టమర్లకు షాక్

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం మణప్పురం బ్రాంచ్‌లో కొందరు కస్టమర్లు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. 8 మంది కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. ఆ బంగారం స్థానంలో నకిలీ నగలు పెట్టారు. మొత్తం రూ.20లక్షల విలువైన 151 గ్రాముల బంగారం మాయమైంది. మణప్పురం మాజీ మేనేజర్ నగేశ్ మోసం చేసినట్లు ఆడిట్‌లో తేలింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతడు ఉద్యోగం మానేసి చెన్నై వెళ్లినట్లు గుర్తించారు. నగేష్‌ను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.