Latest
అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన CM విజయ్! వీడియో వైరల్!
తమిళనాడు అసెంబ్లీ సెషన్స్‌లో CM విజయ్‌కి సంబంధించిన ఒక క్రేజీ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. CM విజయ్ తన స్పీచ్ క్లోస్ చేసేటప్పుడు. మాజీ CM, DMK అధినేత స్టాలిన్ గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో చేసిన చేతి సైగ ను సేమ్ టు సేమ్ ఇమిటేట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి!

మోదీ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రి రిజైన్! రీజన్ ఏంటంటే?
మోదీ క్యాబినెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి (Union Minister of State) జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడం, రీసెంట్ ఎలక్షన్స్‌లో BJP ఆయనకు మళ్లీ సీటు ఇవ్వకపోవడమే దీనికి కారణం. ప్రధాని మోదీ సలహాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రాజీనామాను వెంటనే ఆమోదించారు. క్యాబినెట్‌లో ఏకైక క్రిస్టియన్ ఫేస్ అయిన కురియన్ మినిస్టర్ పదవితో పాటు ఫిషరీస్ (చేపల పెంపకం) డిపార్ట్‌మెంట్‌ని కూడా చూసుకునేవారు.
పెద్దాయన కల నెరవేర్చిన సీఎం
AP: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం కామదేను లంక గ్రామానికి చెందిన వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ(96)కు CM చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు సిద్ధాంతం సభలో స్వయంగా సత్యనారాయణను కలిసి నీకు ఏం కావాలని అడగగా తనకు ఇల్లు, గ్రామంలో డ్రైనేజీ సమస్యతో పాటు రహదారులు సరిగా లేవని తెలిపాడు. దీంతో సత్యానారాయణకు ఇల్లుతోపాటు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
TG: మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలంలో వేలాది మంది రైతులు ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు వేముల ప్రశాంత్ రెడ్డి బయల్దేరగా.. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ను పోలీసులు ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేశారు.
4th Day ప్రొటెస్ట్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే?
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు సక్సెస్‌ఫుల్‌గా 4వ రోజుకు చేరాయి. అయితే జూన్ 23 అర్ధరాత్రి 1 గంటకు ప్రొటెస్ట్ ఏరియాను తగ్గించేందుకు ఢిల్లీ పోలీసులు బారికేడ్లను జరపాలని చూశారు. ఒక ట్రక్కును కూడా లోపలికి తెచ్చేందుకు ట్రై చేశారు. కానీ అలర్ట్ అయిన కాక్రోచెస్ వెంటనే పోలీసుల ప్లాన్‌ను అడ్డుకున్నారు. అర్ధరాత్రి అయినా సరే తగ్గకుండా వాళ్లు సిస్టమ్‌తో ఫైట్ చేస్తున్నారు.

బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ
TG: నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతీ ఆలయ పైఅంతస్తులో కొలువై ఉన్న మహంకాళి గుడిలో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. దొంగలు ఆలయ తాళాలు పగులగొట్టి గర్భగుడిలోని అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్, CCTV ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలయ ప్రాంగణంలో గట్టి నిఘా ఉన్నప్పటికీ చోరీ జరగడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చోరీకి ముందు ఆలయంలోని CC కెమెరాలకు వస్త్రాలు కప్పినట్లు పోలీసులు గుర్తించారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు!
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్! ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,45,910 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,750 గా ఉంది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, కాబట్టి షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి!

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: పవన్
AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌పై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ స్పందించారు. ఇద్దరు కార్మికులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని అధికారులకు ఆయన సూచించారు. విశాఖపట్నం పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లోని అన్ని సంస్థల్లో తక్షణమే భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుదని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఒక్క స్కూల్‌కు రెండు పేర్లు
TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో ఏకశిల స్కూల్ వ్యవహారంలో MEO శ్రీనివాస్ స్పందన విమర్శలకు దారితీస్తోంది. పాఠశాల పేరు మార్పు, అనుమతులు, అడ్మిషన్లపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ యాజమాన్యం పేరు మార్పు కోసం దరఖాస్తు చేయగా ఫైల్ RJD వద్ద పెండింగ్‌లో ఉంది. అనుమతి వస్తుందని MEO చెప్పడం, మరోవైపు స్కూల్ కార్యకలాపాలు 'ఏకశిల అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ స్కూల్' పేరుతో సాగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్కూల్ బోర్డులు, యూనిఫాంలు, బస్సులు అన్నీ ఏకశిల పేరుతో ఉండగా, అధికారికంగా మాత్రం సెయింట్ జోసెఫ్ పేరుతోనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో CC ఫుటేజ్ మాయం
AP: సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు కీలకమైన విషయాన్ని గుర్తించారు. కేసులో CCTV ఫుటేజ్ మాయమైనట్లు అధికారులు నిర్ధారించారు. సాయికృష్ణ మిస్సింగ్ ఉదంతంలో నిజానిజాలు రాబట్టేందుకు CCTV విజువల్స్ ఎంతో కీలకంగా మారాయి. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు (నెల రోజుల పాటు) ఉన్న పూర్తి సీసీ ఫుటేజ్ సిస్టమ్ నుంచి మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది. నెలరోజులకు సంబంధించిన రికార్డింగ్స్ ఉండాల్సిన చోట, కేవలం రెండురోజుల ఫుటేజ్ మాత్రమే ఉంచి, మిగతాదంతా డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

బొలెరో టైర్ పేలి ముగ్గురు స్పాట్‌డెడ్
AP: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరు గ్రామం నుంచి గుంటూరు జిల్లాకు రెడీమేడ్ ప్రహరీ గోడలు తీసుకొని వెళ్లుతున్న బొలెరో వాహనం టైర్ పేలింది. రంగంపేట మండలం వడిశలేరు ADB రోడ్డు వద్ద బొలెరో వెనక టైర్ పేలడంతో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. మరో 8 మందికి గాయాలు కాగా పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు మురమళ్ళ రాజు, తాతపూడి రాజేష్, మసకపల్లి బాలుగా గుర్తించారు.

చంద్రబాబుకు BP డౌన్ కాగానే, పవన్‌కు BP పెరుగుతోంది
AP: పవన్ కళ్యాణ్ డిప్యూటీ CM హోదాలో ఉండి YSRCP నేతలను గూండాలతో పోల్చటం సిగ్గుచేటు అని వైఎస్సాఆర్ సీపీ నేత TJR సుధాకర్ ఫైరయ్యారు. YSRCP ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మమ్మల్ని తొక్కి నార తీస్తా అనటం ఏంటి?. ప్లేస్, టైం చెబితే మేమే వస్తాం.. నార తీయండి చూస్తామని సవాల్ విసిరారు. CM చంద్రబాబుకు బీపీ డౌన్ కాగానే, పవన్ కళ్యాణ్‌కు BP పెరుగుతోందన్నారు. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేశారని అతని తల్లి చేసిన రోదనలు వినపడలేదా పవన్ అంటూ TJR నిలదీశారు. ఆ తల్లికి మద్దతుగా YS జగన్ నిలబడ్డారన్నారు.

ఆటోలో క్యాంపస్‌కు.. పట్టుదలకు సెల్యూట్ !
AP: తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన తుపాకుల మణికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు వచ్చింది. ధ్రువపత్రాల పరిశీలనకు YSR కడప జిల్లా ఇడుపులపాయలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు వెళ్తుండగా దారిలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మణి కాళ్లకు గాయాలయ్యాయి. హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కదల్లేని స్థితిలో ఉన్నా ప్రవేశపత్రం పొందాలని ఆటోలోనే క్యాంపస్‌కు చేరుకుంది. క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాశ్ స్వయంగా ఆటో వద్దకు వచ్చి ఆమెకు ప్రవేశపత్రం అందించారు.

నగరంలో అర్ధరాత్రి కుండపోత వర్షం
హైదరాబాద్ నగరంలో సోమవారం అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ కుండపోత వానకు నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్పురా, BHEL, పటాన్చెరు, మియాపూర్‌లో వాన కురిసింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మా డబ్బుతోనే అంత్యక్రియలు చేయండి
AP: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేటకోటూరుకు చెందిన దామోదరం(35), నిర్మల(28)లకు దిలీప్(12), శ్రీవిద్య(10) సంతానం. నిర్మల బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతుంది. అప్పటికే అప్పులు పెరిగిపోయాయి. CMRF నుంచి రూ. లక్ష వచ్చినా సరిపోలేదు. ఇటీవల చెన్నైలోని ఓ హాస్పిటల్‌కు వెళ్లగా రూ.7లక్షలు ఖర్చవుతుందని, అయినా కోలుకుంటారనే నమ్మకంలేదని డాక్టర్స్ చెప్పారు. దీంతో భార్యాభర్తలు కుంగిపోయారు. ఇద్దరు చిన్నారులకు నిర్మల విషం తాగించి తర్వాత తానూ తాగింది. దామోదరం ఉరేసుకున్నాడు. అంత్యక్రియలకు తమ డబ్బులే వినియోగించాలని కాగితంపై రాసి పెట్టారు.
పరవాడ ఫార్మాసిటీలో ఫైర్ యాక్సిడెంట్.. ఇద్దరు సజీవదహనం
AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫార్మాసిటీలోని సౌత్ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు చిక్కుకున్నట్లు సమాచారం. మృతులిద్దరూ అచ్యుతాపురం వాసులుగా గుర్తించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులూ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

తండ్రి లేని ఆడపిల్లలకు అండగా నిలిచిన కలెక్టర్
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే.జగన్నాథపురం విలేజ్‌కు చెందిన పిచ్చిక సత్యనారాయణ ఇటీవల పక్షవాతంతో బాధపడుతూ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భార్య పూర్తిగా మానసిక దివ్యాంగురాలు. వారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. తండ్రి మరణంతో ఆడ బిడ్డల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తల్లికి దివ్యాంగ పెన్షన్ రూ.15వేలు ఇప్పించాలని, ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం చేయాలని వారు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌ను కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇన్వెస్టర్లు రాడానికి మూడు S లే కారణం - నారా లోకేష్
పారిశ్రామికవేత్తలు ఏపీవైపు మొగ్గు చూపడానికి మూడు “ఎస్” లు ప్రధాన కారణం. స్పీడ్ (వేగం), స్టెబిలిటీ (స్థిరత్వం), సర్వీస్ (సేవ)...ఈ మూడే మా విజయ రహస్యాలు అంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. అమరావతి, ఏఐ, క్వాంటమ్ వాలీ ఈ ఆలోచనలన్నీ చంద్రబాబువేనని తాను కేవలం ఎగ్జిక్యూషన్ మాత్రమే చేస్తున్నానని అన్నారు. తమది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావంతోనే పనిచేస్తున్నామని లోకేష్ అన్నారు. దేశచరిత్రలోనే అతిపెద్ద ఎఫ్ డీఐ గూగుల్ డేటా సెంటర్ కేవలం 13నెలల్లో పనులు ప్రారంభించగలగడం తమ గొప్పతనమేనన్నారు, రిపబ్లిక్ టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడిం

చీకటి GOలతో కార్మికుల పొట్టకొట్టొద్దు
AP: మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా, వీధిదీపాలు, పార్కులు, రోడ్లు, వాహనాలు వంటి 14రకాల సేవలను ప్రైవేట్‌పరం చేసేందుకు AP ప్రభుత్వం రెడీ అవడంపై కార్మికులు ఫైరవుతున్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల నుంచి తరలివచ్చిన కార్మికులంతా విజయవాడ ధర్నాచౌక్ వద్ద నిరసన తెలిపారు. AP మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కుతూ చీకటి GOలతో మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టేందుకు సిద్ధమైందన్నారు.

విజయవాడకు బుడమేరు తరహా ముప్పు.. స్థానికుల్లో ఆందోళన
విజయవాడ రూరల్ మండలంలోని కొత్తూరు, తాడేపల్లి పరిసరాల్లో అక్రమ మట్టితవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కాల్వగట్లు బలహీనపడి వరదముప్పు పొంచి ఉందనే టెన్షన్ మొదలైంది. బెజవాడను బుడమేరు ముంచెత్తిన రీతిలో కాల్వగట్లు తెగితే విజయవాడ రూరల్, జి.కొండూరు, ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారినపడే ప్రమాదముంది. APIIC అవసరాల కోసం పోలవరం కాల్వ 167.040 KM వద్ద 4,908 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేందుకు అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం తవ్వకాలు పరిమితంగా పగటిపూట చేపట్టాలి. రేయింబవళ్లు వేలాది లారీల్లో మట్టిని తరలిస్తున్నారు.

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు.. 12మంది భారతీయులు మృతి
ఖతార్‌లోని ప్రముఖ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో 13మంది మృతి చెందారు. వారిలో 12 మంది భారతీయులేనని నిర్ధారణ అయింది. పేలుడు తీవ్రతకు 66మంది గాయపడ్డారు. వారిలో ఖతార్, భారత్, పాక్ సహా పలు దేశాలవారు ఉన్నారు. గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని దోహాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ఈ గ్యాస్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ఖతార్ ఆపేసింది. తాజాగా కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నించగా గ్యాస్ సరఫరా ప్లాంట్లో భారీ పేలుడు చోటుచేసుకుంది.