Latest

ఇంటర్​ పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్​జీ
Politics· 12 Jun 2026

ఇంటర్​ పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్​జీ

TG: ఇటీవల లాసెట్​ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో సత్తాచాటిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్ ​జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తాజాగా ఇంటర్‌​లో ఉత్తీర్ణత సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిరుపతి 1980-82లో కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదివారు. అప్పట్లో RSU (రాడికల్ స్టూడెంట్ యూనియన్)లో చేరారు. ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్ష రాయలేకపోయారు. అది మినహా మిగిలిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష రాసి 72 మార్కులు సాధించారు. మొత్తం 614 మార్కులతో ఇంటర్ ఉతీర్ణులయ్యారు.

స్టూడెంట్స్ తో టిఫిన్ షేర్ చేసుకున్న బండి సంజయ్!▶
Politics· 12 Jun 2026

స్టూడెంట్స్ తో టిఫిన్ షేర్ చేసుకున్న బండి సంజయ్!

సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ రేకొండ స్కూల్లో పిల్లలు, టీచర్స్‌తో కలిసి టిఫిన్ తింటూ సందడి చేశారు. 'మన బడి మన బాధ్యత' ప్రోగ్రామ్‌లో భాగంగా జరిగిన ‘టిఫిన్ బైఠక్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్లో క్లాస్ రూమ్స్, డైనింగ్ ఫెసిలిటీస్ కావాలని టీచర్స్ కోరగా. 'కరీంనగర్ సేవలో' ద్వారా హెల్ప్ చేస్తానని సంజయ్ మాట ఇచ్చారు. మోదీ గారి 12 ఏళ్ల పాలన సందర్భంగా పిల్లలకు సేవ చేయడమే దేశానికి పెద్ద సేవ అంటూ ఆయన మాట్లాడారు.

హద్దులు దాటుతున్న స్టాండప్ కామెడీ-స్టేజ్ షోలపై నెటిజన్ల ఫైర్!
Entertainment· 12 Jun 2026

హద్దులు దాటుతున్న స్టాండప్ కామెడీ-స్టేజ్ షోలపై నెటిజన్ల ఫైర్!

స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే షోకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. హాస్యం పేరిట నైతిక విలువలను వదిలేసిన ఈ కంటెంట్‌పై నెటిజన్లు మండిపడు తున్నారు. ముఖ్యంగా మెడికల్ ఎథిక్స్ (వైద్య నైతికత) ఉల్లంఘన, శవాలపై జోకులు వేయడం వంటి అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. కేవలం క్లిక్స్, వ్యూస్ కోసం పబ్లిక్ షోలలో ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఫ్యామిలీ ప్లానింగ్ భారమంతా ఆడవారిదేనా?
Health· 12 Jun 2026

ఫ్యామిలీ ప్లానింగ్ భారమంతా ఆడవారిదేనా?

ఫ్యామిలీ ప్లానింగ్ భారం మొత్తం మహిళలపైనే పడుతోందని NFHS-6 నివేదిక లో తేలింది.36.5 శాతం మంది మహిళలు ట్యూబెక్టమీ చేయించుకుంటుంటే కేవలం 0.5 శాతంమగవారు మాత్రమే వాసెక్టమీ చేయించుకుంటున్నారు. మోడ్రన్ గర్భ నిరోధక సాధనాలు వాడకం గత కొన్నేళ్లుగా మన దేశంలో తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో మహిళల్లో ఒబేసిటీ, ఓవర్ వెయిట్ సమస్యలు 24.0% నుంచి 30.0% కి పెరిగాయి. గర్భనిరోధకాల ఎంపిక తగ్గడం, శారీరక శ్రమ లేకపోవడం, హార్మోన్ల ఇంబాలెన్స్ వంటి కారణాల వల్ల మహిళల్లో ఒబేసిటీ, ఓవర్ వెయిట్ పెద్ద సవాలుగా మారుతోందని నివేదిక తెలియచేస్తోంది.

ఈరోజు బంగారం ధరలు ఇవే.. లేటెస్ట్ రేట్స్ చూసేయండి!
Business· 12 Jun 2026

ఈరోజు బంగారం ధరలు ఇవే.. లేటెస్ట్ రేట్స్ చూసేయండి!

USA, ఇరాన్ గొడవల వల్ల మార్కెట్లో బంగారం, వెండి ధరలు గత రెండు రోజులుగా గట్టిగా పడిపోయాయి. ఈరోజు (జూన్ 12) హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,45,630 ఉండగా, 22 క్యారెట్ల రేట్ రూ.1,33,490గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,59,900 దగ్గర కొనసాగుతోంది. అయితే ఇరాన్‌తో డీల్ కుదిరిందని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేయడంతో.. గోల్డ్ రేట్లు మళ్లీ పెరగొచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కాబట్టి కొనేముందు రేట్స్ చెక్ చేసుకోండి.

మ్యాంగో అండ్ కర్డ్ రైస్- వాట్ ఏ కాంబినేషన్!
Health· 12 Jun 2026

మ్యాంగో అండ్ కర్డ్ రైస్- వాట్ ఏ కాంబినేషన్!

మనలో చాలా మందికి మామిడి పండు, పెరుగన్నం బెస్ట్ సమ్మర్ ఫుడ్.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఇళ్లలో ఇది ఒక ఎమోషన్!ఎండ దంచుతుంటే చల్లటి పెరుగన్నంలో మామిడి ముక్కలు వేసుకుని, లేదా రసం పిండుకుని ఆ రైస్ తినడం బాగా అలవాటు. తీపి, పులుపుల కలయిక అయిన ఆ టేస్ట్ ని మనం బానే ఎంజాయ్ చేస్తాం.ఎండ తీవ్రతకు శరీరం వేడెక్కినప్పుడు, పెరుగన్నం చలవ చేస్తుంది. అలాగే మామిడిపండు తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే మితిమీరి కాకుండా లిమిట్‌గా తింటే ఇది సమ్మర్‌లో బెస్ట్ రిఫ్రెషింగ్ ఫుడ్.

ఫ్యామిలీ ప్లానింగ్  ఆపరేషన్స్ కు మగవారే దూరం !
Health· 12 Jun 2026

ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కు మగవారే దూరం !

మగవారిలో అవగాహనాలోపమే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లకు అడ్డుపడుతోందని నిపుణులు చెబుతున్నారు. మగవారికి ఉద్దేశించిన వాసెక్టమీ ఆపరేషన్స్ అందుకే పూర్తి స్థాయిలో జరగడం లేదని అంటున్నారు. ఆపరేషన్ చేయించుకుంటే లైంగిక కోర్కెలు తగ్గుతాయని, బలహీన పడతారని అనవసరంగా భయపడుతుంటారు. ఇవన్నీ అపోహలేనని పురుషులు భేషుగ్గా ఈ ఆపరేషన్ చేయించుకుని,కుటుంబ నియంత్రణ బాధ్యతను షేర్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

హిస్టరీ క్రియేట్ చేసిన ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్▶
Motivational· 12 Jun 2026

హిస్టరీ క్రియేట్ చేసిన ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్

ఇండియన్ Sand Artist సుదర్శన్ పట్నాయక్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. రష్యాలో జరిగిన ‘సెకండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ శాండ్ స్కల్ప్చర్’లో ఆయన ప్రతిష్టాత్మక "రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026" గెలుచుకున్నారు. ఈ అవార్డు అందుకున్న ఫస్ట్ ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్‌గా ఆయన హిస్టరీ సృష్టించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుదర్శన్ పట్నాయక్‌కు సోషల్ మీడియాలో కాంగ్రాట్స్ చెప్తూ ఈ అప్‌డేట్‌ని విపరీతంగా షేర్ చేస్తున్నారు.

కాంగ్రెస్‌లోకి తృణమూల్, NCP? ‘అఖండ కాంగ్రెస్’ దిశగా అడుగులు!
Politics· 12 Jun 2026

కాంగ్రెస్‌లోకి తృణమూల్, NCP? ‘అఖండ కాంగ్రెస్’ దిశగా అడుగులు!

టీఎంసీ, ఎన్సీపీ నేతలు మమతా బెనర్జీ, శరద్ పవార్ చూపులు ఇప్పుడు కాంగ్రెస్ పై ఉన్నాయా?పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తృణమూల్ కాంగ్రెస్, NCP (SP) పార్టీలు త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం కాబోతున్నాయనే ఊహాగానాలు జోరందు కున్నాయి. ఈ వార్తలను కాంగ్రెస్ అధిష్టానం కొట్టిపారేసినప్పటికీ, మహారాష్ట్ర సీనియర్ నేత నానా పటోలే మాత్రం క్లారిటీ ఇచ్చారు. "మమత, శరద్ పవార్ కాంగ్రెస్‌తో కలిసి పోతారని ,పవార్ ఇప్పటికే ప్రతిపాదన కూడా పంపారని" ఆయన అనడం సెన్సేషనల్ గా మారింది.

ప్రాణాలు దక్కాయి..  ఏడాది గడిచినా ఆరోగ్యం నిల్ !
News· 12 Jun 2026

ప్రాణాలు దక్కాయి.. ఏడాది గడిచినా ఆరోగ్యం నిల్ !

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2025 జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా (Flight 171) యాక్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ ఇప్సుడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇన్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. ఈ ప్రమాదంలో తన సోదరుడు అజయ్‌ను కోల్పోయిన రమేష్, ఏడాది గడిచినా మానసిక ఆందోళన, నిద్రలేమి, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో నరకం అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రిహాబిలిటేషన్ , నష్టపరిహారం కోసం బ్రిటన్ న్యాయవాదుల ద్వారా ఎయిర్ ఇండియాతో చర్చిస్తున్నారు.ఆ ప్రమాదంలో మొత్తం 260 మంది చనిపోయారు.

మోడలింగ్ నుంచి డ్రగ్ స్మగ్లింగ్ వైపు!
Crime· 12 Jun 2026

మోడలింగ్ నుంచి డ్రగ్ స్మగ్లింగ్ వైపు!

బ్యాంకాక్ నుంచి ముంబైకి రూ.11.82 కోట్ల విలువైన ‘హైడ్రోపోనిక్ గంజాయి’ స్మగ్లింగ్ చేస్తూ మాజీ 'మిసెస్ కేరళ' రన్నరప్ హర్ష సన్నీ(28) ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. ఆమె ట్రావెల్ బ్యాగును చెక్ చేయగా 12 ప్లాస్టిక్ ప్యాకెట్లలో 11.82 కిలోల హై-క్వాలిటీ గంజాయి బయటపడింది. ల్యాబ్‌లలో తయారు చేసే ఈ గంజాయికి మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంది. దీంతో అధికారులు ఆమెపై NDPS యాక్ట్ కింద కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారు.

తెలంగాణలో క్రమంగా విస్తరిస్తున్న రుతుపవనాలు
TG· 12 Jun 2026

తెలంగాణలో క్రమంగా విస్తరిస్తున్న రుతుపవనాలు

తెలంగాణలో క్రమంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. అయితే రాష్ట్రమంతా వ్యాపించకపోవడంతో ఎండల ప్రభావం కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణలో ఎండలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హనుమకొండలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రుతుపవనాలు పూర్తిగా విస్తరించేందుకు మరో 2-3 రోజుల సమయం పడుతుందని వాతావరణ అధికారులు అంటున్నారు.

పశ్చిమ బెంగాల్: వేలల్లో EVMలు దగ్ధం!▶
News· 12 Jun 2026

పశ్చిమ బెంగాల్: వేలల్లో EVMలు దగ్ధం!

పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలోని అలీపూర్ ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రీసెంట్ ఎలక్షన్స్ లో వాడిన సుమారు 4000 ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లోనే ఈ మంటలు చెలరేగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డెమోక్రసీలోనే ఇది పెద్ద షాక్ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే కేవలం యాక్సిడెంట్‌గా కాకుండా, దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే యాంగిల్‌లో పోలీసులు ఆల్రెడీ క్రిమినల్ కేసు బుక్ చేసి సీరియస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా గుండెపోటుతో మృతి
Sports· 12 Jun 2026

షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా గుండెపోటుతో మృతి

భారత షూటింగ్ దిగ్గజం, ద్రోణాచార్య అవార్డీ జస్పాల్ రాణా (49) గుండెపోటుతో కన్నుమూశారు. పిస్టల్ షూటింగ్‌లో దేశానికి ఎన్నో పతకాలు అందించిన ఆయన, కోచ్‌గానూ తిరుగులేని ముద్ర వేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్‌కు చారిత్రక కాంస్య పతకాలు అందించిన ఘనత రాణాదే. 2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన ఈ లెజెండ్ మృతి భారత క్రీడా రంగానికి తీరని లోటు.ఆయన ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ (టెహ్రీ గర్వాల్) ప్రాంతంలో జన్మించారు.

అమెరికా డబుల్ స్టాండర్డ్స్ పై  జయశంకర్ ఫైర్ !▶
World· 12 Jun 2026

అమెరికా డబుల్ స్టాండర్డ్స్ పై జయశంకర్ ఫైర్ !

రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా డబుల్ స్టాండర్డ్స్ పై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఫిన్లాండ్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో ప్రపంచ చమురు మార్కెట్ ను స్టెబిలైజ్ చేయడానికి, చమురు ధరలు పెరగకుండా కంట్రోల్ చేయడానికి చమురును కొనాల్సిందిగా స్వయంగా అమెరికాయే ఇండియాని కోరిందని జైశంకర్ ఈ సందర్భంగా ఓ టాప్ స్టేట్ మెంట్ ను బయటపెట్టారు.

ప్యునిక్యులార్ రైల్వే అంటే మీకు తెలుసా?▶
General· 12 Jun 2026

ప్యునిక్యులార్ రైల్వే అంటే మీకు తెలుసా?

ఫ్యునిక్యులర్ రైల్వే అంటే మీకు తెలుసా? కొండలు లేదా నిటారుగా ఉండే ఎత్తైన ప్రాంతాలపైకి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన రైలు వ్యవస్థ.దీనికి ఇంజన్ ఉండదు. ఒక బలమైన స్టీల్ కేబుల్ సాయంతో ఈ రైలు కదులుతుంది.ఇందులో రెండు బోగీలు ఒకే కేబుల్‌కు రెండు చివరలా లింక్ అయి ఉంటాయి.ఒకటి కొండ పైనుంచి కిందకు దిగుతుంటే,దాని బరువు సహాయంతో మరొక పెట్టె కిందనుంచి పైకి వెళ్తుంది..నిటారైన కొండ ప్రాంతాలలో ఇవి చాలా ఈజీగా ప్రయాణించగలవు.ప్రయాణికులు నిటారుగా కూర్చోనేలా సీట్లు మెట్లు ఆకారంలో డిజైన్ చేయబడి ఉంటాయి. మహారాష్ట్రలోని కల్యాణ్ సమీపంలో ఒక కొండ ప్రాంతంలో ఈ రూట్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ప్రైవేట్ జెట్‌లో క్రికెట్ ఆడిన సచిన్!▶
Sports· 12 Jun 2026

ప్రైవేట్ జెట్‌లో క్రికెట్ ఆడిన సచిన్!

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రైవేట్ జెట్‌లో ఫ్యామిలీతో కలిసి క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఫ్లైట్‌లో కోడలు సానియా చందోక్ బౌలింగ్ చేయగా.. సచిన్ బ్యాటింగ్ చేశారు. కూతురు సారా ఫీల్డింగ్ చేస్తూ సచిన్‌ను సూపర్ క్యాచ్‌తో ఔట్ చేసింది. "ఎంత ఎత్తులో ఉన్నా నా ఆటిట్యూడ్ మారదు" అంటూ సచిన్ పెట్టిన క్యాప్షన్ క్రేజీగా ఉంది. రిటైర్ అయినా క్రికెట్‌పై ఆయనకున్న లవ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Press ను ఫేస్ చేసిన PMలు వీళ్లే!
Politics· 12 Jun 2026

Press ను ఫేస్ చేసిన PMలు వీళ్లే!

ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ ఎంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారనే దానిపై ఒక ఇంట్రెస్టింగ్ చార్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం. మన్మోహన్ సింగ్ హయాంలో హయ్యెస్ట్‌గా 114 ప్రెస్ మీట్స్ పెట్టారు. ఆ తర్వాత నెహ్రూ 75, రాజీవ్ గాంధీ 62, శాస్త్రి 56, వాజపేయి 55 సార్లు ప్రెస్‌ను ఫేస్ చేశారు. అయితే నరేంద్ర మోదీ, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ లాంటి వాళ్లు అసలు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదని ఈ డేటా చూపిస్తోంది.

పవన్ కళ్యాణ్: 21 సీట్లతో ఎందుకు సెటిల్ అయ్యామంటే?▶
Politics· 12 Jun 2026

పవన్ కళ్యాణ్: 21 సీట్లతో ఎందుకు సెటిల్ అయ్యామంటే?

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కూటమి సక్సెస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాము కేవలం 21 సీట్లకే సెటిల్ అవ్వలేదని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాగుండాలనే ఉద్దేశంతోనే ఎన్నో త్యాగాలు చేశామని చెప్పారు. అందుకే జనాలు తమకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి గెలిపించారని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

హెల్త్ కోసం డైట్ మార్చేస్తున్న GenZ!
Health· 12 Jun 2026

హెల్త్ కోసం డైట్ మార్చేస్తున్న GenZ!

ఇండియాలో ఫుడ్ ట్రెండ్స్ పూర్తిగా మారిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో 35% ఫుడ్ ఖర్చులను GenZ మాత్రమే డిసైడ్ చేస్తోంది. వీళ్లు ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ కొనే ముందు బ్రాండ్‌ని కాకుండా, బాటిల్ వెనకాల ఉండే లేబుల్స్, ఇంగ్రీడియెంట్స్ పక్కాగా చెక్ చేస్తున్నారు. దాదాపు 79% GenZ తమ డైట్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తుండగా, 83% హెల్త్ కోసం లైఫ్‌స్టైల్ మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు. దీంతో పెద్ద పెద్ద ఫుడ్ కంపెనీలు కూడా GenZ టేస్ట్‌కి తగ్గట్టుగా తమ ప్రొడక్ట్స్ మారుస్తున్నాయి.

ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అప్‌డేట్!
Education· 12 Jun 2026

ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అప్‌డేట్!

ప్రతి ఏటా జూన్ 12న "వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్" జరుపుకుంటారు. ఈ క్రమంలో వైజాగ్ సీతమ్మధారలోని లయన్స్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ చైల్డ్ లేబర్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా వాయిస్ రేజ్ చేసింది. పేదరికం వల్ల పిల్లలు బడులకు దూరమై హోటళ్లు, ఫ్యాక్టరీలలో పని చేయడం దారుణమని పేర్కొంది. పిల్లల చేతికి పని ముట్లు కాకుండా పెన్ను, పుస్తకం ఇచ్చి వారి కలలకు సపోర్ట్ ఇవ్వాలని, బాలకార్మిక రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయాలని లయన్స్ క్లబ్ పిలుపునిచ్చింది.