ప్యునిక్యులార్ రైల్వే అంటే మీకు తెలుసా?
ఫ్యునిక్యులర్ రైల్వే అంటే మీకు తెలుసా? కొండలు లేదా నిటారుగా ఉండే ఎత్తైన ప్రాంతాలపైకి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన రైలు వ్యవస్థ.దీనికి ఇంజన్ ఉండదు. ఒక బలమైన స్టీల్ కేబుల్ సాయంతో ఈ రైలు కదులుతుంది.ఇందులో రెండు బోగీలు ఒకే కేబుల్‌కు రెండు చివరలా లింక్ అయి ఉంటాయి.ఒకటి కొండ పైనుంచి కిందకు దిగుతుంటే,దాని బరువు సహాయంతో మరొక పెట్టె కిందనుంచి పైకి వెళ్తుంది..నిటారైన కొండ ప్రాంతాలలో ఇవి చాలా ఈజీగా ప్రయాణించగలవు.ప్రయాణికులు నిటారుగా కూర్చోనేలా సీట్లు మెట్లు ఆకారంలో డిజైన్ చేయబడి ఉంటాయి. మహారాష్ట్రలోని కల్యాణ్ సమీపంలో ఒక కొండ ప్రాంతంలో ఈ రూట్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు.



