Latest

జగన్ పేరులో G అంటే 'జెన్ జీ' కాదు గొడ్డలి: లోకేష్
Politics· 13 Jun 2026

జగన్ పేరులో G అంటే 'జెన్ జీ' కాదు గొడ్డలి: లోకేష్

AP: జగన్ అనే పేరులో ఉన్న G అంటే 'జెన్ జీ' అనుకుంటున్నారు కానీ అది గొడ్డలి అని మంత్రి నారా లోకేష్ ఫైరయ్యారు. తిరుపతి జిల్లా దామినేడులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు గొడ్డలి పార్టీ అరాచక పాలనలో బీసీ బిడ్డ అమరనాథ్, దళిత వైద్యుడు సుధాకర్, నంద్యాలకు చెందిన అబ్దుల్ సలామ్ బలైపోయారన్నారు. YCP నాయకులు TDP జెండా లేకుండా చేస్తామన్నారు. ప్రజలే వారి జెండా పీకేశారు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు YCP కార్యకర్తలు రప్పారప్పా అంటున్నారు. ప్రజలే వారిని రఫ్ఫాడిస్తారు అని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

పొలాల్లో ఎగిసిపడ్డ మంటలు
Local· 13 Jun 2026

పొలాల్లో ఎగిసిపడ్డ మంటలు

TG: కాకినాడ రూరల్ మండలంలోని పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టూ ప్రాంతాలకు పొగ దట్టంగా అలుముకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం చూసిన స్థానికులు టెన్షన్ పడ్డారు. వెంటనే పైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రైతులే ఎండిపోయిన పంటలకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయా, లేదా గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే మంట పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడిపై కొడవళ్లతో దాడి
Crime· 13 Jun 2026

యువకుడిపై కొడవళ్లతో దాడి

AP: అనంతపురం జిల్లాలో బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి సమీపంలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఆచారి మణికంఠ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్ర రక్తస్రావమైన మణికంఠను చికిత్స నిమిత్తం అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ దాడికి పాత కక్షలు కారణమా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆల్ఫా మూవీపై  ఆగని కాపీ దుమారం !
Cinema· 13 Jun 2026

ఆల్ఫా మూవీపై ఆగని కాపీ దుమారం !

శివ్ రావైల్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆల్ఫా’ టీజర్.. 1990 నాటి ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రం ‘లా ఫెమ్మె నికితా’ (La Femme Nikita) ను గుర్తుచేస్తోందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్ సీన్, అందులో నటీనటుల హావభావాలు, డైలాగ్స్ సైతం హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలోనే ఉన్నాయంటూ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ఆరోపణలపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అఫీషియల్ రిప్లయ్ రాలేదు.

నియంత కిమ్‌లా ప్రధాని మోదీ: రేవంత్ రెడ్డి
Politics· 13 Jun 2026

నియంత కిమ్‌లా ప్రధాని మోదీ: రేవంత్ రెడ్డి

TG: కుదిరితే ఓటు చోరీ.. కాకపోతే సీటు చోరీ అన్నట్లు BJP వ్యవహరిస్తోందని CM రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అదే చేశారని ఆరోపించారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో పలు అంశాలపై సీఎం స్పందించారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ పైన ఎలాంటి క్రిమినల్‌ కేసు లేకపోయినా ఉన్నట్లు చూపించి ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం అన్యాయమన్నారు. ప్రధాని మోదీ, ఉత్తరకొరియా నియంత కిమ్‌లా వ్యవహరిస్తున్నారని అన్నారు.

CM విమానం దారి మళ్లింపు
TG· 13 Jun 2026

CM విమానం దారి మళ్లింపు

TG: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో CM రేవంత్‌ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ను బెంగుళూరుకు దారి మళ్లించారు. సీఎం ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ విమానం శుక్రవారం రాత్రి 9.20 గంటలకు శంషాబాద్‌లో ల్యాండ్‌ కావాల్సి ఉంది. ఆ సమయానికి విమానాశ్రయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విమానం ల్యాండ్‌ చేసే అవకాశం లేకపోవడంతో పైలట్‌ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. రేవంత్‌ శనివారం హైదరాబాద్‌ రానున్నారు.

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు 50వేల జరిమానా
Crime· 13 Jun 2026

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు 50వేల జరిమానా

TG: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు రూ.50వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఖైరతాబాద్‌ మండలం యూస్‌ఫగూడ గ్రామపరిధిలోని సర్వే నెంబర్‌ 45లోని రెండుఎకరాల భూమికి ఉన్న ప్రహరీ గోడను హైడ్రా ఏకపక్షంగా కూల్చివేసిందని ఆరోపిస్తూ మహ్మద్‌ షఫహతుల్లా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చినప్పటికీ హైడ్రా కౌంటర్లు దాఖలు చేయకుండా స్టేటస్‌ కో ఉత్తర్వులు ఉల్లంఘించడంపై హైకోర్ట్ జరిమానా విధించింది.

ACBకి చిక్కిన అధికారులు.. బాణసంచా కాల్చి సంబరాలు
Crime· 13 Jun 2026

ACBకి చిక్కిన అధికారులు.. బాణసంచా కాల్చి సంబరాలు

TG: లంచాలకు అలవాటుపడిన ఇద్దరు అధికారులు, వారికి సహకరించిన ఓ అధికారిణి కుమారుడు ACB వలకు చిక్కారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వెంచర్‌ యజమాని నుంచి రూ.45వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండల MPDO పెనుగొండ రాధిక, MPO కిన్నెర యాకయ్యతోపాటు ఎంపీడీవో రాధిక కుమారుడు నాగార్జున ACBకి రెడ్‌ హ్యాండెడ్‌ దొరికారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్‌ ఏసీబీ DSP సాంబయ్య తెలిపారు. అధికారుల అరెస్టుతో నర్సింహులపేట మండల ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు: APPSC
AP· 13 Jun 2026

ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు: APPSC

AP: రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు APPSC నోటిఫికేషన్లు జారీ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై APPSC స్పందించింది. APPSC అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఒకవేళ ఏదైనా సమాచారం ఉంటే కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. APPSC ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విధంగా షెడ్యూల్ ఏదీ జారీ చేయలేదని కమిషన్ తెలిపింది.

RTC బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు
TG· 13 Jun 2026

RTC బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు

TG: రాష్ట్రంలోని అన్నీ RTC బస్సుల్లో ఇకపై ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పెట్టనున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వాహనంలోనూ ప్రథమ చికిత్స కిట్లు ఉండాలనే రూల్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి ప్రయాణికులకు అందుబాటులో లేవు. ఈ లోపాన్ని గుర్తించిన ఆర్టీసీ MD వై.నాగిరెడ్డి బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ప్రతి బస్సులోనూ కచ్చితంగా పనిచేసే ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాల్సిందేనని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎండీ ఆదేశాలతో అలర్ట్ అయిన TGS RTC అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,130 బస్సుల్లో ఈ కిట్లను ఏర్పాటు చేయనున్నారు.

క్రౌడ్  వర్క్ పేరిట పబ్లిక్ షేమింగ్ చేయచ్చా?
Entertainment· 13 Jun 2026

క్రౌడ్ వర్క్ పేరిట పబ్లిక్ షేమింగ్ చేయచ్చా?

స్టాండప్ కామెడీ షోలలో ప్రేక్షకుల వ్యక్తిగత విషయాలను వాడుకుంటూ (Crowd Work) చేసే కామెడీపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.వారితో మాట్లాడి వారిపైనే జోకులు వేయడం వివాదంగా మారుతోంది. నవ్వులు పూయించడం వేరు, ఒక వ్యక్తిని పబ్లిక్ గా షేమ్ చేయడం వేరంటూ నిపుణులు మండిపడుతున్నారు. షోలలో పాల్గొనే ప్రేక్షకుల పర్మిషన్ (Consent) సోషల్ రెస్పాన్సిబిలిటీపై ఈ వివాదం ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. కామెడీ జోనర్లకు కూడా ఒక లక్ష్మణ రేఖ ఉండాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

స్కూల్ యూనిఫామ్‌‌లో DEO.. షాకైన స్టూడెంట్స్
Education· 13 Jun 2026

స్కూల్ యూనిఫామ్‌‌లో DEO.. షాకైన స్టూడెంట్స్

AP: అనకాపల్లి DEO గిడ్డి అప్పారావు నాయుడు చోడవరంలోని కొత్తూరు ZP బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి స్కూల్ యూనిఫామ్‌ ధరించి వచ్చారు. దీంతో అక్కడున్న స్కూల్ పిల్లలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు, ఆపిల్స్ అందించి ఆత్మీయంగా పలకరించి స్వాగతం పలికారు. APలో శుక్రవారం నుంచి స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యాబోధన ఉంటుందని.. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి రెగ్యులర్ CM కాదు: KTR
Politics· 13 Jun 2026

రేవంత్ రెడ్డి రెగ్యులర్ CM కాదు: KTR

TG: కాంగ్రెస్ పార్టీలో పదవులు, డబ్బులకే వస్తున్నాయని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ చెప్పినందుకు అభినందనలు అని మాజీ మంత్రి KTR అన్నారు. షబ్బీర్ అలీ ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారన్నారు. గతంలో TPCC పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనే అని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా డబ్బులకే అమ్ముకుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని ఎద్దేవా చేశారు.

CMకే ఫ్యూచర్ లేదు, ఇంకా ఫ్యూచర్ సిటీ ఏంటి: KTR
Politics· 12 Jun 2026

CMకే ఫ్యూచర్ లేదు, ఇంకా ఫ్యూచర్ సిటీ ఏంటి: KTR

TG: CM రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ఊహల్లో బతుకుతున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో పూర్తయితే ఇంత ట్రాఫిక్ ఉండదు, కానీ ఆ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఆపేశారని ఆరోపించారు. ఉన్న హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ అనడం ఏంటని ఫైరయ్యారు. హైదరాబాద్‌ను మరింతగా అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు. రేవంత్‌ రెడ్డికే ప్యూచర్‌ లేదు ఇంకా ప్యూచర్‌ సిటీ ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో రాష్ట్రం 40 ఏండ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి ఒక్క వర్షానికే నగరం చెరువులను తలపించిందన్నారు.

జనగాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
TG· 12 Jun 2026

జనగాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TG: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నవాబుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాజీపేటకు చెందిన ఎండీ ఇమ్రాన్, ఎండీ సుభాని, హనుమకొండకు చెందిన మాజీద్, సమీర్, ఖమ్మం జిల్లాకు చెందిన ఎండీ నూర్ బంధుమిత్రులు కలిసి కారులో తిరిగి వస్తున్నారు. జనగామ వైపు నుంచి సూర్యాపేట వైపు ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ, కారు నవాబుపేట వద్ద ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. కారు నడుపుతున్న సుభాని(30) స్పాట్‌లోనే మృతి చెందాడు. హాస్పిటల్‌కు తరలిస్తుండగా ఇమ్రాన్(28) మృతి చెందాడు. మాజీద్, నూర్, సమీర్‌లను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కాలేజ్ ప్రిన్సిపల్‌పై కత్తితో దాడి
Crime· 12 Jun 2026

కాలేజ్ ప్రిన్సిపల్‌పై కత్తితో దాడి

AP: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని ఓ ఐటీఐ కళాశాలలో ఘర్షణ జరిగింది. కళాశాల సిబ్బందిపై మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ కుమారుడు జిలానీ కత్తితో దాడి చేశాడు. జిలానీ కత్తితో బలంగా పొడవడంతో కాలేజ్ కమిటీ మెంబర్ హుస్సేన్, ప్రిన్సిపల్ శేషయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కళాశాల సిబ్బంది హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హుస్సేన్ మృతిచెందాడు. గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో సత్తార్, కమిటీ మెంబర్లకు మధ్య వివాదాలు జరుగుతున్నాయి.

‘ఆల్ఫా’ టీజర్‌పై కాపీ ఆరోపణలు.. నెట్టింట దుమారం!
Cinema· 12 Jun 2026

‘ఆల్ఫా’ టీజర్‌పై కాపీ ఆరోపణలు.. నెట్టింట దుమారం!

అలియా భట్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో వైఆర్‌ఎఫ్ (YRF) స్పై యూనివర్స్ నిర్మిస్తున్న ‘ఆల్ఫా’ సినిమా టీజర్ సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఇది ఒక ఫ్రెంచ్ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను కాపీ కొట్టారంటూ నెటిజన్లు (ప్లగియారిజం) ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీజర్‌లోని కొన్ని కీలక షాట్లు ఒరిజినల్ చిత్రానికి జిరాక్స్ కాపీలా ఉన్నాయని నెట్టింట చర్చ నడుస్తోంది.

మీనాక్షి నటరాజన్‌ అంశంలోనూ సిట్ వేయాలి: KTR
Politics· 12 Jun 2026

మీనాక్షి నటరాజన్‌ అంశంలోనూ సిట్ వేయాలి: KTR

TG: మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకున్న అంశంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదానికి సిట్ వేస్తుంది కదా.. ఆ పార్టీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ అంశంపై కూడా సిట్ వేయాలని అన్నారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్లే కేసు గురించి ఎన్నికల కమిషన్‌కు చెప్పి ఉంటారన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్టీ ద్రోహులు ఎవరో కనుక్కోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు, అలాంటి కాంగ్రెస్ కంపులో ద్రోహుల పార్టీ అంశంలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారని ఫైరయ్యారు.

రజనీకాంత్ 'జైలర్ 2'లో హృతిక్ రోషన్ క్యామియో!
Cinema· 12 Jun 2026

రజనీకాంత్ 'జైలర్ 2'లో హృతిక్ రోషన్ క్యామియో!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఒక కీలకమైన క్యామియో (అతిథి పాత్ర)లోయాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ స్నేహితుడి పాత్రలో హృతిక్ రోషన్ కనిపిస్తారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ పాత్ర కోసం మొదట బాలీవుడ్ బాద్‌షా షాహ్రుఖ్ ఖాన్ ను అనుకున్నారు. అయితే ఆయన 'కింగ్' సినిమా కమిట్‌మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేకపోయారు.

కర్ణాటక లో CM విజయ్!▶
Politics· 12 Jun 2026

కర్ణాటక లో CM విజయ్!

విజయ్ CM అయ్యాక ఫస్ట్ టైమ్ కర్ణాటకలో అడుగుపెట్టారు. ఉడుపి డిస్ట్రిక్ట్‌లోని ఫేమస్ కొల్లూరు మూకాంబిక టెంపుల్‌ని ఆయన విజిట్ చేశారు. అక్కడ అమ్మవారికి స్పెషల్ పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. CM హోదాలో విజయ్ కర్ణాటకకు రావడం ఇదే ఫస్ట్ టైమ్ కావడంతో. ఈ టెంపుల్ విజిట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

KG మామిడి పండ్లు రూ.2.50 లక్షలు
Local· 12 Jun 2026

KG మామిడి పండ్లు రూ.2.50 లక్షలు

TG: ఆదిలాబాద్ జిల్లా ఎచ్చోడ మండలం ముఖరా (కే) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి నాలుగేళ్ల క్రితం 5 మియాజాకి మొక్కలు నాటారు. కేరళ నుంచి తెప్పించిన ఈ మియాజాకి మామిడి పండ్లను కోసినట్లు గాడ్గే మీనాక్షి తెలిపారు. 2022లో KTR బర్త్‌డే సందర్భంగా తమ గ్రామంలోని ఖాళీ స్థలంలో 500 మామిడి మొక్కలతో పాటు 5 మియాజాకి మామిడి మొక్కలను కూడా నాటినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ మొక్కలు పెరిగి పండ్లను ఇచ్చాయని.. వాటిని కోయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మియాజాకి మామిడికి అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు రూ.2.50 లక్షల వరకు ధర ఉంటుందని తెలిపారు.