← Back to news

హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఆరుగురు దొరికేశారు!

By sahani· 11 Jun 2026· Andhrajyothy· Hyderabad
హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఆరుగురు దొరికేశారు!

హైదరాబాద్‌లో క్యూనెట్ పేరుతో జరిగిన ఒక పెద్ద మోసాన్ని CCS పోలీసులు పట్టుకుని, ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ మెయిన్‌గా జాబ్స్ లేని వాళ్లని, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌ని టార్గెట్ చేసింది. కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే కోట్లు సంపాదించవచ్చని నమ్మించి, ఒక్కొక్కరి దగ్గర ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు వసూలు చేశారు. వాళ్ల దగ్గర ఉన్న ల్యాప్‌టాప్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌ని పోలీసులు సీజ్ చేశారు. ఈ స్కామ్ ఫుల్ డీటెయిల్స్‌ని బంజారాహిల్స్ ICCC ఆఫీస్‌లో జరిగే ప్రెస్‌మీట్‌లో, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి చెప్పబోతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.