Latest

కార్లు, ఆటోలు ఉన్నవారికి షాక్.. పెరిగిన CNG ధర
National· 29 Aug 2026

కార్లు, ఆటోలు ఉన్నవారికి షాక్.. పెరిగిన CNG ధర

CNG వెహికల్స్ వాడే వారికి బ్యాడ్ న్యూస్. ఈరోజు నుంచి దిల్లీ-NCRతో పాటు కొన్ని ప్రాంతాల్లో CNG ధరలు పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) కిలోకు రూ.3.89 పెంచింది. దీంతో దిల్లీలో CNG ధర రూ.86.98/kgకు చేరింది. ఇంపోర్ట్ చేసుకునే LNG ఖర్చులు భారీగా పెరగడంతో ఈ రేట్లు పెంచినట్లు IGL తెలిపింది. CNG రేట్లు పెరగడంతో ఆటోలు, క్యాబ్స్, వంటి CNG వెహికల్స్ జర్నీ కాస్ట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది.

BRAOUలో AI బేస్డ్ ఎడ్యుకేషన్‌కు బిగ్ బూస్ట్
TG· 29 Aug 2026

BRAOUలో AI బేస్డ్ ఎడ్యుకేషన్‌కు బిగ్ బూస్ట్

TG: నిన్న హైదరాబాద్‌లో <a href="https://opvarsity-news.blogspot.com/2026/08/ai-based-education-is-more-learner.html#more">BRAOU</a> 45th ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ ఇకపై డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కే పరిమితం కాకుండా డిజిటల్, ఆన్‌లైన్ యూనివర్సిటీగా మారనుందని VC ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు. AI బేస్డ్ ఎడ్యుకేషన్‌తో స్టూడెంట్స్ తమకు నచ్చిన టైమ్, స్పీడ్, లాంగ్వేజ్‌లో నేర్చుకోవచ్చని CEMCA డైరెక్టర్ డా. బి. శద్రాచ్ అన్నారు. త్వరలో BRAOUలో ఫారిన్ లాంగ్వేజెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు ‘AI for Teachers’ కోర్సుతో Govt. టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు.

వీడియో వివాదం.. మస్లీస్ పార్టీ MLCపై యాక్షన్!
TG· 29 Aug 2026

వీడియో వివాదం.. మస్లీస్ పార్టీ MLCపై యాక్షన్!

TG: మస్లీస్ పార్టీ MLC మిర్జా రహ్మత్ బేగ్‌పై పార్టీ యాక్షన్ తీసుకుంది. వైరల్ వీడియో కాంట్రవర్సీపై ఆయనను పార్టీ నుంచి వెంటనే పార్టీ నుంచి ఔట్ చేసింది. అలాగే MLC పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. మరోవైపు తనను కొందరు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ MLC బేగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో అసలు ఏముందనే వివరాలను పోలీసులు, AIMIM క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

విశాఖలో దారుణం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి
AP· 29 Aug 2026

విశాఖలో దారుణం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి

AP: విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు చనిపోయారు. మల్లా వినోద్‌కుమార్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఈ ఘటనలో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల ఇన్ఫర్మేషన్‌తో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఇద్దరిపిల్లలకు విషం ఇచ్చి, తరువాత భార్యాభర్తలు ఉరివేసున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక తెలిసే అవకాశం ఉంది.

తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: కలెక్టర్
Local· 29 Aug 2026

తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: కలెక్టర్

TG: ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. చెన్నూర్ పట్టణంలో అమృత్ పథకం కింద చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ట్యాంక్ నిర్మాణంతోపాటు పైపులైన్ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

స్వల్పంగా పెరిగిన బంగారం రేట్లు.. ధరలు ఇలా ఉన్నాయి!
Infotainment· 29 Aug 2026

స్వల్పంగా పెరిగిన బంగారం రేట్లు.. ధరలు ఇలా ఉన్నాయి!

వరుసగా 3–4 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈరోజు ఉ. 6 గం. సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,61,140గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రా. ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,47,710గా నమోదైంది. ఇక వెండి ధర హైదరాబాద్, విజయవాడలో ప్రస్తుతం కిలో వెండి రూ.2,64,900గా ఉంది. గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లు తగ్గడంతో కొనేవారికి కాస్త రిలీఫ్ వచ్చింది.. అయితే బంగారం కొనేవారు ఎప్పటికప్పుడు రేట్లను చెక్ చేసుకోవడం మంచిది.

బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ
Local· 29 Aug 2026

బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

TG: వికారాబాద్‌లో బహుజన్ ముక్తి పార్టీ 6వ తెలంగాణ రాష్ట్ర మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న వికారాబాద్‌లోని KNR ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాసభలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, ఆర్థిక హక్కులు తదితర కీలక అంశాలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్
Local· 29 Aug 2026

పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

TG: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తాండూర్ నియోజకవర్గ యువతకు BMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్‌, రైల్వే తదితర పోటీ పరీక్షలకు హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో 90రోజులపాటు శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

చెరువులే లేకపోతే వరదలు తప్పవు: రంగనాథ్
TG· 29 Aug 2026

చెరువులే లేకపోతే వరదలు తప్పవు: రంగనాథ్

TG: చెరువులు కనుమరుగవడం, ఆక్రమణలకు గురికావడమే నగరాల్లో వరదలకు ప్రధాన కారణమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్‌లో కేవలం 3, 4 సెంటీమీటర్ల వర్షానికే రహదారులపైకి నీరు చేరుతున్న పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. చెరువుల ఆక్రమణలతోపాటు ఇన్‌లెట్లు సక్రమంగా లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోందన్నారు. హైడ్రాను అడ్డుకునేందుకు ల్యాండ్ మాఫియా ప్రయత్నాలు చేస్తున్నా ప్రజాప్రయోజనాల కోసం ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

ప్యాకేజీ ఇచ్చాకే గ్రామాలు ఖాళీ  చేయించాలి: MPJ
Local· 29 Aug 2026

ప్యాకేజీ ఇచ్చాకే గ్రామాలు ఖాళీ చేయించాలి: MPJ

AP: వెలుగొండ నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ పూర్తిగా చెల్లించిన తర్వాతే గ్రామాలను ఖాళీ చేయించాలని ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలను మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్యాకేజీ చెల్లింపుల అనంతరం గ్రామాల నుంచి తరలించేందుకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని రజాక్ కోరారు.

లక్కీ డ్రాతో పేదలకు ఇళ్ల కేటాయింపు: పొంగులేటి
TG· 29 Aug 2026

లక్కీ డ్రాతో పేదలకు ఇళ్ల కేటాయింపు: పొంగులేటి

TG: ఇందిరమ్మ టవర్స్‌ ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ నియోజకవర్గం లక్ష్మీగూడలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ లక్కీ డ్రాను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 4.50 లక్షలు, రెండోదశలో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో పట్టణ పేదల కోసం లక్ష ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. లబ్ధిదారుల కుటుంబంలోని మహిళ పేరుతో ఇళ్లను రిజిస్ట్రేషన్‌, ఇతర ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

నేరాల వెనక అసలు కారణాలు తేల్చితేనే కట్టడి: DGP
TG· 29 Aug 2026

నేరాల వెనక అసలు కారణాలు తేల్చితేనే కట్టడి: DGP

TG: నేరాల నియంత్రణకు వాటి మూల కారణాలను గుర్తించి పరిష్కరించడమే కీలకమని DGP CV ఆనంద్ అన్నారు. హైదరాబాద్‌లోని DGP కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నేర సమీక్షలు కేవలం గణాంకాల పరిశీలనకే పరిమితం కాకుండా ప్రతి నేరం వెనుక ఉన్న కారణాలు, నేరస్థుల విధానం, దర్యాప్తు తీరును లోతుగా విశ్లేషించాలని సూచించారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో నేరాల సంఖ్య పెరిగినప్పటికీ తీవ్ర నేరాలు, సైబర్‌, ఆర్థిక నేరాల్లో తగ్గుదల నమోదైందని తెలిపారు.

ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్: CM చంద్రబాబు
AP· 29 Aug 2026

ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్: CM చంద్రబాబు

AP: నియోజకవర్గాల అభివృద్ధికి రూపొందించిన విజన్ యాక్షన్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపాలని CM చంద్రబాబు ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించి అమలు చేయడం దేశంలోనే తొలిసారిగా APలో జరుగుతోందని, దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని సూచించారు.

రైతుల ఖాతాల్లోకి రాయితీ డబ్బులు: మంత్రి తుమ్మల
TG· 29 Aug 2026

రైతుల ఖాతాల్లోకి రాయితీ డబ్బులు: మంత్రి తుమ్మల

TG: రైతుల సాగు కష్టాలను తగ్గించడంతో పాటు వ్యవసాయ ఖర్చులు తగ్గించేందుకు యాంత్రీకరణకు పెద్దపీట వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌ సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలపై నిర్వహించిన సమీక్షలో మంత్రి పలు నిర్ణయాలు తీసుకున్నారు. యాంత్రీకరణ పథకం కింద నాణ్యమైన వ్యవసాయ పరికరాలను తక్కువ ధరలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, రాయితీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు తగినంతగా అందుబాటులో ఉన్నాయన్నారు.

రద్దయిన NLSIU కాన్వగేషన్ వేడుక
National· 28 Aug 2026

రద్దయిన NLSIU కాన్వగేషన్ వేడుక

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ(NLSIU) సెప్టెంబర్ 12న జరగాల్సిన 34వ కాన్వగేషన్ వేడుకను రద్దు చేసింది. CJI సూర్య కాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) చైర్మన్‌ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడాన్ని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. యాజమాన్యం, విద్యార్థి సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రిజిస్ట్రార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను కొరియర్ ద్వారా లేదా నేరుగా క్యాంపస్ లో ‘ఇన్ అబ్సెంటియా’ (In-absentia) పద్ధతిలో అందజేయనున్నారు.

విద్యుత్ అమరవీరులకు ఘన నివాళి
Local· 28 Aug 2026

విద్యుత్ అమరవీరులకు ఘన నివాళి

AP: విద్యుత్ అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజాసమస్యలపై ఐక్యంగా పోరాడాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని ఏఎస్‌ఆర్‌ నగర్‌లో విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సంస్మరణ సభ నిర్వహించారు. 2000 ఆగస్టు 28న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో మృతిచెందిన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసిందని నాయకులు పేర్కొన్నారు.

‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ వచ్చేసింది! 🎬🍿
Entertainment· 28 Aug 2026

‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ వచ్చేసింది! 🎬🍿

హీరో సుమంత్, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ రిలీజైంది. మహేంద్రగిరి విలేజ్‌లో వారాహి అమ్మవారి శాపం ఏంటి? అక్కడ జరిగే సీక్రెట్ డెత్స్ వెనుక ఉన్న రియల్ స్టోరీ ఏంటి? అనే Suspense కాన్సెప్ట్‌తో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ క్యామియో రోల్ చేస్తుండడం బిగ్గెస్ట్ హైలైట్. సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రాబోతుంది.

ఆదివాసీ విద్యార్థులు, తల్లిదండ్రుల అరెస్టు ఖండన
AP· 28 Aug 2026

ఆదివాసీ విద్యార్థులు, తల్లిదండ్రుల అరెస్టు ఖండన

AP: విశాఖ జిల్లా పాడేరులో గిరిజన గురుకుల పాఠశాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఈ చర్యను సిపిఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి అల్లూరి సీతారామరాజు ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికి ఇలా చేసిందని అభిప్రాయపడింది. అక్రమ అరెస్టులను వెంటనే ఎత్తివేసి, ఆదివాసీ పిల్లలకు న్యాయం చేయాలని, పాఠశాలను మళ్లీ తెరిచి పిల్లలు చదువుకునేలా చూడాలని డిమాండ్ చేసింది.

వెండి ధర తగ్గింది.. కిలోపై ₹5,000 డౌన్!
National· 28 Aug 2026

వెండి ధర తగ్గింది.. కిలోపై ₹5,000 డౌన్!

మూడు రోజులుగా పెద్దగా మార్పుల్లేకుండా ఉన్న వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా 10 గ్రాముల వెండి ధర సుమారు ₹2,550కి చేరింది. అంటే కిలో వెండిపై దాదాపు ₹5,000 వరకు తగ్గుదల కనిపించింది. వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న తర్వాత వచ్చిన ఈ తగ్గుదలతో వెండి కొనాలనుకునేవాళ్లకు కొంత ఊరట లభించింది. అయితే నగరాన్ని బట్టి రిటైల్ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ పెరుగుతాయా, తగ్గుతాయా అన్నది ఆసక్తిగా మారింది.

‘ఇరుముడి’.. వారం రోజుల్లోనే ₹125 కోట్ల వసూళ్లు
Entertainment· 28 Aug 2026

‘ఇరుముడి’.. వారం రోజుల్లోనే ₹125 కోట్ల వసూళ్లు

ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ‘ఇరుముడి’ మొదటి వారం పూర్తయ్యే సమయానికి ప్రపంచవ్యాప్తంగా ₹124.85 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు బాక్సాఫీస్ ట్రాకింగ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో ఇండియాలో నెట్ కలెక్షన్స్ ₹92.15 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు ₹17.90 కోట్లు వచ్చాయి. తెలుగు వెర్షన్‌నే ఈ వసూళ్లకు ప్రధానంగా బలంగా నిలిచిందట. ఏడో రోజు కలెక్షన్స్ మాత్రం కొంత తగ్గి ₹6.90 కోట్లకు చేరాయి. మరోవైపు యశ్ నటించిన ‘టాక్సిక్’ విడుదలతో కొన్ని థియేటర్లలో ‘ఇరుముడి’ షోలు తగ్గడం సినిమాకు కొంత ఇబ్బందిగా మారింది.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు
Local· 28 Aug 2026

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఇంట్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన మహిళా అధ్యక్షురాళ్లు, పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమణి, పిట్ట రజిత, అనసూయ, బాలమణి తదితరులు పాల్గొని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టిన మహిళలకు కానుకగా రూ.50 వేల నగదుతో పాటు పట్టువస్త్రాలను అందించారు.