Latest

‘టాక్సిక్’కు రెండో రోజే షాక్!
యశ్ నటించిన ‘టాక్సిక్’ మొదటి రోజే భారీ ఓపెనింగ్‌తో దుమ్మురేపినా.. రెండో రోజుకు వచ్చేసరికి కలెక్షన్స్ గట్టిగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు ₹20.1 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతుండగా, రెండో రోజు మాత్రం సుమారు ₹3 కోట్ల నెట్‌కే పరిమితమైనట్లు అంచనాలు ఉన్నాయి. అంటే ఓపెనింగ్‌తో పోలిస్తే భారీ డ్రాప్ కనిపించింది. మిక్స్‌డ్ టాక్, ఆక్యుపెన్సీ తగ్గడం కూడా దీనికి కారణాలుగా చెబుతున్నారు. మరి వీకెండ్‌లో టాక్సిక్ మళ్లీ పుంజుకుంటుందా? ఇదే ఇప్పుడు అసలు టెన్షన్.

పిల్లలకు ఖరీదైన గిఫ్ట్స్ కంటే.. మీతో మాట్లాడటమే కావాలా?
పిల్లలకు ఏది కావాలంటే అది కొనిస్తే వాళ్లు హ్యాపీగా ఉంటారని అనుకుంటాం. కానీ పిల్లలతో మనం గడిపే సమయం కూడా వాళ్ల ఎదుగుదలలో చాలా ముఖ్యమట. వాళ్లు ఏదైనా చెప్పినప్పుడు కాసేపు శ్రద్ధగా వినడం, వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం, రోజులో జరిగిన విషయాలు వాళ్లతో మాట్లాడటం.. ఇవన్నీ పిల్లల ఆలోచనలు, మాట్లాడే విధానం, ఇతరులతో కలిసిపోయే తీరు మెరుగుపడటానికి ఉపయోగపడతాయని రీసెర్చ్ చెబుతోంది. భోజనం చేసేటప్పుడు, బయటికి వెళ్లేటప్పుడు, పడుకునే ముందు కాసేపు మాట్లాడినా.. ఆ సమయం పిల్లలకు చాలా ఉపయోగపడొచ్చు.

దోమల్లో కూడా వెరైటీలు ఉన్నాయ్.. జాగ్రత్త! 🦟⚠️
ప్రతి రోజూ మనం చూసే దోమలన్నీ ఒకేలా ఉండవు, ఒకే రకమైన రోగాలను స్ప్రెడ్ చేయవు. కొన్ని దోమలు డెంగ్యూ, చికున్‌గున్యా తెస్తే.. మరికొన్ని మలేరియా, జపనీస్ ఎన్‌సెఫలైటిస్ ని స్ప్రెడ్ చేస్తాయి. ప్రపంచంలో 3,500కి పైగా దోమల జాతులున్నా, మన దేశంలో ఏడిస్, అనోఫిలిస్, క్యూలెక్స్ అనే 3 రకాలే డేంజర్. 1897లో బ్రిటీష్ డాక్టర్ దోమల వల్లే మలేరియా వస్తుందని కనిపెట్టారు. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 20న 'World Mosquito Day' జరుపుకుంటారు.

ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి సెప్టెంబర్ 13న శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్‌లోని ఐదు ఎకరాల స్థలంలో నిర్మించనున్న భవన నిర్మాణానికి సెప్టెంబర్ 13న శంకుస్థాపన నిర్వహించనున్నారు. శంకుస్థాపనకు రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు కలిశారు. సీఎం అందుకు అంగీకరించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, ఉప్పల్ భగాయత్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు పాల్గొన్నారు.

పద్మశాలి సంఘంలో ఘనంగా వేడుకలు
షాద్‌నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు వర్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘభవనంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శివ మారుతి, రవి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మార్కండేయస్వామి పూజ, గాయత్రీ మంత్రోచ్చారణల మధ్య గాయత్రీధారణ నిర్వహించారు. అనంతరం 108 మంది దంపతులతో ప్రత్యేక హోమాలను నిర్వహించారు.

మహిళా నాయకుల ఆత్మీయతకు ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలు
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవికి మహిళా నాయకులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ మల్లు రవి మహిళలతో సోదరభావంతో మమేకమై ఆప్యాయంగా మాట్లాడారు. మహిళల గౌరవం, భద్రత, సాధికారతకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, బాధ్యతలకు ప్రతీక అని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు పీహెచ్‌డీ పరిశోధనలు అవసరం
AP: పర్యావరణ సమస్యలకు శాశ్వత పరిష్కారాల అన్వే షణలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలు కీలకమని నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.ఆర్.థోరట్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన జాతీయ హరిత సదస్సు–2026లో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై పీహెచ్‌డీ పరిశోధనలు మరింత పెరగాలని సూచించారు. పర్యావరణ సమస్యలపై శాస్త్రీయ అధ్యయనాలు చేసి, వాటి ఫలితాలను విధానాల రూపకల్పనకు అనుసంధానించాలని పేర్కొన్నారు. పరిశ్రమలు కూడా పర్యావరణహిత విధా నాలను పాటించాలని APIIC డైరెక్టర్ మండలి రాజేష్ అన్నారు.

ఎల్లమ్మ తండాలో వీరాంజనేయస్వామి ప్రతిష్ఠాపన ఉత్సవాలు
మంచాల మండలంలోని ఎల్లమ్మ తండాలో మందాపురం వీరాంజనేయస్వామి ప్రతిష్ఠాపన ఉత్సవాలు రెండు రోజులుగా ఘనంగా సాగుతున్నాయి. ఆలయంలో అగ్నిగుండం పూజలు నిర్వహించారు. పూజలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేపు ఆలయంలో వీరాంజనేయస్వామి, గణపతి, నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిద్దాం
నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసులు పిలుపునిచ్చారు. విద్యుత్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో విద్యు త్ పోరాట అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2000 ఆగస్టు 28న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో విద్యుత్ ప్రైవేటీకరణ, విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి అమరులయ్యారని గుర్తు చేశారు.

ముస్లిం యువకుల ఆధ్వర్యంలో అన్నదానం
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ ముస్లిం యువకుల ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహించారు. వక్ఫ్ కాంప్లెక్స్ ముందు ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మాజీ వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్ ఉర్ రహ్మాన్, కౌన్సిలర్ మహమ్మద్ నిజాం, సీనియర్ జర్నలిస్ట్ అహ్మదుల్లా ఖాన్ ప్రారంభించారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

KGBV విద్యార్థుల రాఖీ వేడుకలు
రాఖీ పండుగ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ని జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ రమేష్ కుమార్ సందర్శించారు. కేజీబీవీ విద్యార్థినిలు ఆయనకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినుల ఆప్యాయతకు ఆయన అభినందనలు చెప్పారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మంత్రులు
రక్షాబంధన్ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొండా సురేఖ మాట్లాడుతూ “నేను అందరికీ సోదరినే. పండుగ వాతావరణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయను. ముఖ్యమంత్రికి మహిళల అండ ఎప్పుడూ ఉంటుంది. మా ఆడపడుచులందరిపైనా ఆయన ఆశీర్వాదం ఉండాలి” అని అన్నారు.

చైతు, గోపీచంద్ మిస్ చేసుకున్న హిట్ మూవీ?
హీరో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ స్టోరీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఈ స్టోరీని డైరెక్టర్ మొదట నాగచైతన్యకు, ఆ తర్వాత గోపీచంద్‌కి నరేట్ చేశారట. అప్పట్లో వేరే ప్రాజెక్ట్ బిజీ వల్ల వాళ్ళు ఓకే చేయలేకపోవడంతో ఈ ఆఫర్ రవితేజ దగ్గరకు వెళ్లినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ రవితేజకి మంచి కంబ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది.

భీమవరంలో కొత్త పంచాయతీ భవనం ప్రారంభం
వెంసూరు మండలంలోని భీమవరం గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ప్రారంభించారు. గ్రామానికి కొత్త భవనం అందుబాటులోకి రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పంచాయతీ భవనం ద్వారా గ్రామస్థులకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

డ్రగ్స్ నిర్మూలన పౌరులందరి సామాజిక బాధ్యత
AP: గంజాయి, డ్రగ్స్ నిర్మూలన ప్రభుత్వ బాధ్యతతోపాటు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. మంగళగిరిలో ఏపీ ఈగల్–ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మధ్య డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అవగాహన, నిఘా, పునరావాసం, ప్రజల భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం కుదిరింది. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాచారం ఉంటే ఈగల్ టోల్‌ఫ్రీ 1972కు తెలియ జేయాలని సూచించారు.

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలి
సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) చేసింది. పలమనేరు ఆర్టీసీ డిపో నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. 2010కి ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్‌టీఈ చట్టంలోని 23(1) సెక్షన్‌ను సవరించాలని కోరారు. అర్హత మార్కులను తగ్గించడంతో పాటు బోధనా సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలన్నారు.

అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలి
జీరో పావర్టీ మిషన్‌లో భాగంగా అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించాలని పలమనేరు నియోజకవర్గ పి-4 ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీదేవి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన జీరో పావర్టీ మిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం పలమనేరు మండలం టి.వడ్డూరు గ్రామంలో గ్రామ సమాఖ్యల ద్వారా గుర్తించిన అత్యంత నిరుపేద కుటుంబాలను పరిశీలించారు.

29, 30వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచారం
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ఈ నెల 29, 30 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి లోకేష్ వర్మ తెలిపారు. ఈ రెండు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

తీరనున్న ఆదివాసీల దశాబ్దాల కల
అనంతగిరిలో ఆదివాసీల దశాబ్దాల కల నెరవేరబోతుంది. నాలుగు గ్రామాల గిరిజన గ్రామాల గ్రామాల రవాణా కష్టాలకు తెరపడనుంది. కివర్ల పంచాయతీ పరిధి బుడ్డి గురువు నుండి చిడిగురువు వరకు 2 కిలోమీటర్లు రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు పనులపై బుడ్డిగురువు, బంద గురువు, చిదిగరువు, రాళ్లగరువు గ్రామాల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గురుకుల పాఠశాల కోసం రోడ్డెక్కిన మారికవలస గిరిజనులు
AP: మారికవలస బాయ్స్ గిరిజన గురుకుల పాఠశాలను పూర్తిగా ఎత్తివేసి, ఆ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబుతో కలిసి వారంతా నిరసన తెలియజేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఇప్పటికే వందలాది మంది గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తున్న మారికవలస గురుకులాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదని నినాదాలు చేశారు.

మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్ధరించాలి
AP: తల్లిదండ్రుల అనుమతి లేకుండా గిరిజన విద్యార్థులను వేరే ప్రాంతాలకు తరలించడం అత్యంత బాధ్యతారాహిత్యమని సిపిఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. విశాఖపట్నం మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. విద్యార్థులను బస్సుల్లో బలవంతంగా తరలించడం, పోలీసులతో భయానికి గురిచేయడం, వారి సామాన్లను బయటకు పడేయడం బాధ్యతారాహిత్యమని రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు.