Latest

విడిపోయిన ట్రైన్ బోగీలు.. తప్పిన పెను ప్రమాదం
News· 2 Jun 2026

విడిపోయిన ట్రైన్ బోగీలు.. తప్పిన పెను ప్రమాదం

AP: యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలోని గుత్తి రైల్వేస్టేషన్‌లో జాయింట్ కప్లింగ్ ఊడి ఎస్ 6, ఎస్ 7 బోగీలు ట్రైన్ నుంచి ఒక్కసారిగా విడిపోయాయి. గుత్తి రైల్వేస్టేషన్‌లో 1వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తున్న టైమ్‌లో వెనక బోగీలు విడిపోవడాన్ని గమనించిన లోకోపైలట్ ఆ బోగీలు ఇంజిన్‌ను ఢీకొట్టకుండా స్లోగా బ్రేక్ వేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. దీంతో ఆ వెనుక బోగీలు ఇంజిన్ వైపు భాగాన్ని ఆనుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తే ఊరుకోం: మందుల సామెల్
Politics· 2 Jun 2026

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తే ఊరుకోం: మందుల సామెల్

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎవరైనా బ్రతకొచ్చు, అన్నదమ్ముల్లా కలిసే ఉందాం, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తే ఊరుకునేది లేదని మందుల సామెల్‌ హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 11రోజులు తాను పస్తులు ఉన్నానని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. పవన్ మాటలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకంపై విషం కక్కేలా ఉన్నాయన్నారు. తెలంగాణ స్టేట్ ఏర్పడడం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని హాట్ కామెంట్ చేశారు.

MLA అనిరుధ్ రెడ్డి: పవన్ కంటే నాకే ఎక్కువ అర్హతలు ఉన్నాయి!▶
Politics· 2 Jun 2026

MLA అనిరుధ్ రెడ్డి: పవన్ కంటే నాకే ఎక్కువ అర్హతలు ఉన్నాయి!

పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదని కొందరు అంటున్నారు. కానీ నేను ఫస్ట్ టైమ్ MLAగా పోటీ చేసి గెలిచాను. పవన్ కళ్యాణ్‌లాగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోలేదు, అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ లెక్కన పవన్ కంటే తనకే ఎక్కువ అర్హతలు ఉన్నాయంటూ అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ముంబైలో తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్!
Politics· 2 Jun 2026

ముంబైలో తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్!

ముంబై ఖార్ నాకా దగ్గర తెలంగాణ 12వ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ ప్రోగ్రామ్‌లో ముంబై కురుమ సంఘం ప్రెసిడెంట్ జూకంటి రామచందర్, లీడర్ లక్ష్మణ్ మహరాజ్ మాట్లాడారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ముంబైలో ఉన్న వాళ్ల రోల్ కూడా చాలా ఉందని, అందుకే కేకే కమిటీ ముంబైకర్లను కూడా గుర్తించి సపోర్ట్ చేయాలని కోరారు. ముంబైలో ఉన్న నిజమైన ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచి గుర్తింపు, గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో చాలా మంది తెలంగాణ సంఘాల లీడర్స్ పార్టిసిపేట్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ Vs పొన్నం ప్రభాకర్▶
Politics· 2 Jun 2026

పవన్ కళ్యాణ్ Vs పొన్నం ప్రభాకర్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌పై తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. "yes తెలంగాణ మా అయ్యా జాగీరే, మా తెలంగాణ 4 కోట్ల ప్రజల అయ్య జాగీరే, నీ అయ్య జాగీరు కాదు" ఫస్ట్ ఇధి గుర్తుపెట్టుకో అంటూ సీరియస్ గా పవన్ కి కౌంటర్ ఇచ్చారు. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్: 11 రోజులు అన్నం తినకపోవడానికి అసలు రీజన్ ఇదే!▶
Politics· 2 Jun 2026

పవన్ కళ్యాణ్: 11 రోజులు అన్నం తినకపోవడానికి అసలు రీజన్ ఇదే!

తెలంగాణ విడిపోవడంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ టైంలో తాను 11 రోజులు అన్నం తినకుండా ఉన్న విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను 11 రోజులు ఉపవాసం ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు కాదు. ఆ విభజన చేసిన పద్ధతి నచ్చకే అని పవన్ చెప్పారు. దీన్ని ఎవరు ఎలా అర్థం చేసుకున్నా నాకు అనవసరం, అంటూ పవన్ చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్: రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం!▶
Politics· 2 Jun 2026

పవన్ కళ్యాణ్: రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం!

చెరువు ఆక్రమణ టాపిక్‌పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యారు. "నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. అని చెప్తూనే, ఒకవేళ నేను నిజంగానే చెరువును ఆక్రమించి ఉంటే, దాన్ని నేనే డైరెక్ట్‌గా తెలంగాణ గవర్నమెంట్‌కు రాసి ఇచ్చేస్తా అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్: ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు!▶
Politics· 2 Jun 2026

పవన్ కళ్యాణ్: ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు!

తనపై వస్తున్న కామెంట్స్ కి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. "నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు. ఇక తెలంగాణలో నేను CM అవుతానా?" అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ సెల్ఫ్-సెటైరిక్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్: తెలంగాణలో జనసేన పోటీ! ▶
Politics· 2 Jun 2026

పవన్ కళ్యాణ్: తెలంగాణలో జనసేన పోటీ!

తెలంగాణ పాలిటిక్స్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒక బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. "ఇప్పటివరకు నేను దీనిపై ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు.. కానీ ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఖచ్చితంగా ఉంటుంది" అని ఆయన అనౌన్స్ చేశారు. త్వరలోనే తెలంగాణ అంతా తిరుగుతానని, ఇక్కడ జరిగే ఎలక్షన్స్ లో కూడా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

యూకేలో 'గ్రూమింగ్ గ్యాంగ్స్' కలకలం: ఎంపీ రూపెర్ట్ లోవ్ సంచలన వ్యాఖ్యలు
World· 2 Jun 2026

యూకేలో 'గ్రూమింగ్ గ్యాంగ్స్' కలకలం: ఎంపీ రూపెర్ట్ లోవ్ సంచలన వ్యాఖ్యలు

యూకేలో సంచలనం సృష్టిస్తున్న 'గ్రూమింగ్ గ్యాంగ్స్' (బాలికలపై లైంగిక దోపిడీ ముఠాలు) దారుణాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.బ్రిటన్ పార్లమెంట్‌లో ఎంపీ రూపెర్ట్ లోవ్ చేసిన ప్రసంగం లో వీటి వివరాలు తెలిపారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది పాకిస్తానీ సంతతికి చెందిన టాక్సీ డ్రైవర్లు, మార్కెట్ వ్యాపారులే ఉన్నట్లు ప్రభుత్వ విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. బాధితుల నుంచి సేకరించిన గ్రాఫిక్ సాక్ష్యాలను లోవ్ పార్లమెంట్‌లో చదివి వినిపించారు. చిన్న వయసులోనే అమ్మాయిలను టార్గెట్ చేయడం, బలవంతపు గర్భాలు, బెదిరింపులు, మరియు ఈ ఘోరాలపై స్పందించడంలో పోలీసుల వైఫల్యాలను ఆయన ఎండగట్టారు.

  రోడ్ యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్‌డెడ్
Local· 2 Jun 2026

రోడ్ యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్‌డెడ్

TG: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంట గ్రామ శివారులో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుర్జకుంట విలేజ్‌కు చెందిన ఎర్ర నర్సింహులు (34) బైక్‌పై గ్రామం నుంచి నేషనల్ హైవే వైపు వస్తుండగా ఎదురుగా మరో బైక్ వచ్చి ఢీకొట్టింది. నంగి రాజు, బండారి రమేష్‌ బైక్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో నర్సింహులు స్పాట్‌లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రాజు, రమేష్‌లను చేర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

CBSE పోర్టల్‌పై సైబర్ దాడి: 2 నిమిషాల్లో 1.5 మిలియన్ల హిట్స్‌!
Education· 2 Jun 2026

CBSE పోర్టల్‌పై సైబర్ దాడి: 2 నిమిషాల్లో 1.5 మిలియన్ల హిట్స్‌!

CBSE రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్ ప్రారంభమైన మొదటి రోజే భారీ సైబర్ అటాక్ జరిగింది. సర్వీసులను నిలిపివేయడమే లక్ష్యంగా హ్యాకర్లు కేవలం రెండు నిమిషాల్లో 1.5 మిలియన్ల (15 లక్షలు) రిక్వెస్ట్‌లతో ‘డినైల్ ఆఫ్ సర్వీస్’ (DoS) దాడికి పాల్పడ్డారు. అంతేకాదు, ఫైల్స్‌ను దొంగిలించడానికి లక్షకు పైగా అనధికారిక ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ, భద్రతా వ్యవస్థల వల్ల పోర్టల్ ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పనిచేసిందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని CBSE బోర్డు ‘X’ వేదికగా స్పష్టం చేసింది.

అభివృద్ధి పథంలో తెలంగాణ : సుదర్శన్​రెడ్డి
Politics· 2 Jun 2026

అభివృద్ధి పథంలో తెలంగాణ : సుదర్శన్​రెడ్డి

TG: అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్స్, సాధించిన ప్రగతి గురించి వివరించారు. స్టేట్ ఫార్మెషన్ డే వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.

 ఆమె గోల్డ్ డిగ్గర్ కాదు.. నేనే డైమండ్ డిగ్గర్ నిః లలిత్ మోడీ
Entertainment· 2 Jun 2026

ఆమె గోల్డ్ డిగ్గర్ కాదు.. నేనే డైమండ్ డిగ్గర్ నిః లలిత్ మోడీ

ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ల రిలేషన్‌షిప్ గతంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో సుస్మితా సేన్‌ను ‘గోల్డ్ డిగ్గర్’ (డబ్బు కోసం ప్రేమించే వ్యక్తి) అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. నాలుగేళ్ల తర్వాత ఈ ట్రోల్స్‌పై లలిత్ మోదీ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు. "సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గర్ కాదు, నేనే డైమండ్ డిగ్గర్. ఆమె ఒక అద్భుతమైన డైమండ్" అంటూ లలిత్ మోదీ 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

గాలీ దెబ్బకు జాతర గ్రౌండ్ అంతా ఖాళీ!▶
News· 2 Jun 2026

గాలీ దెబ్బకు జాతర గ్రౌండ్ అంతా ఖాళీ!

అనకాపల్లి జిల్లా మాడుగులలో ఈదురు గాలులు నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయి. అక్కడి ఫేమస్ మోదకొండమ్మ జాతర జరుగుతున్న టైంలో ఒక్కసారిగా గట్టిగా గాలులు రావడంతో సిట్యుయేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. గుడి దగ్గర వేసిన టెంట్లు, ఫ్లెక్సీలు, బోర్డులు అన్నీ కింద పడిపోయాయి. అయితే లక్కీగా ఆ టైంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద యాక్సిడెంట్ మిస్ అయింది. లేదంటే మాత్రం సీన్ చాలా సీరియస్ అయ్యేది. దీంతో జాతర దగ్గర ఉన్న వాళ్లంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

చలిలో గడ్డ కట్టే అలస్కా కప్పల గురించి తెలుసా?
General· 2 Jun 2026

చలిలో గడ్డ కట్టే అలస్కా కప్పల గురించి తెలుసా?

ఈకప్ప గురించి మీకు తెలుసా? వింటర్ లో గడ్డ కట్టుకుపోతుంది.శరీరంపై మంచు పేరుకుపోయి గడ్డ కట్టేస్తుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఊపిరి ఆగిపోతుంది. దాదాపు డెత్ స్టేజ్లోకి వెళ్లిపోతుంది. ఆ సీజన్ అయిపోగానే మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. మంచుకరిగిపోయి గుండె కొట్టుకుంటూ, ఊపిరి తీసుకుంటుంది.అయితే అన్నాళ్లు దాని లివర్ గ్లూకోజ్ ను రిలీజ్ చేస్తూ కప్ప ప్రాణాలను కాపాడుతుందట. ముదురు ఆకుపచ్చ రంగులో 2నుంచి3 అంగుళాల పొడవుండే ఈ కప్ప అడవులు, చెరువులు, మంచుకురిసే ఏరియాల్లో ఉంటుంది. యూఎస్ లోని అలస్కా లోనే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి, దీనిని అలస్కా వుడ్ ఫ్రాగ్ అంటారు.

అప్పట్లో ఎంజీఆర్ వర్సెస్ కరుణానిధి.. ఇప్పుడు విజయ్ వర్సెస్ అన్నామలై !!
Politics· 2 Jun 2026

అప్పట్లో ఎంజీఆర్ వర్సెస్ కరుణానిధి.. ఇప్పుడు విజయ్ వర్సెస్ అన్నామలై !!

తమిళనాడు పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. బీజేపీని వీడుతున్నఅన్నామలై తమిళ జాతీయ వాదం, పాలన అన్న రెండు అంశాలపైన ఒక పొలిటికల్ ప్లాట్ ఫామ్ ను ముందు స్టార్ట్ చేస్తారని సమాచారం. ఆ తర్వాత దానిని పొలిటికల్ పార్టీగా మార్చే అవకాశముంది.అన్నామలై ఎంట్రీతో తమిళనాడు ఓల్డ్ పొలిటికల్ రైవలరీని గుర్తు చేస్తోంది. ఎంజీ ఆర్, వర్సెస్ కరుణానిధి లాగా, అటు అన్నామలై, ఇటు సీఎం విజయ్ .. తొలిసారిగా ఇద్దరు నాన్ ద్రవిడియన్ లీడర్స్ తమిళ రాజకీయాలను ఏ టర్న్ తిప్పుతారో మరి.

లాకర్లలో బంగారాలను వాడుకలోకి తెస్తేనే బెటర్ !!
Politics· 2 Jun 2026

లాకర్లలో బంగారాలను వాడుకలోకి తెస్తేనే బెటర్ !!

దేశంలో ఇళ్లు, ఆలయట్రస్టుల దగ్గర ఇతరత్రా కలిపితే 30,000నుంచి 32,000 టన్నుల బంగారం లాకర్లలో నిరుపయోగంగా పడి ఉందని అంచనా..(సుమారు $3.8 ట్రిలియన్లు) . 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లోనే దేశీయ అవసరాల కోసం భారత్ సుమారు $72.4 బిలియన్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది దేశ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది.నిపుణుల అంచనా ప్రకారం, దేశంలో ఉన్న మొత్తం బంగారంలో కేవలం 1% బంగారాన్ని ఏటా రీసైకిల్ చేసినా, మన దేశ బంగారం దిగుమతులు 25 నుంచి 30 శాతం తగ్గుతాయి.ఖజానాలు, లాకర్లలో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేసి వాడుకలోకి తీసుకు రావాలని ప్రధాని మోడీ గతంలో పిలుపునిచ్చారు.

ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్రా అధికారుల పాలన: జగదీశ్‌రెడ్డి
Politics· 2 Jun 2026

ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్రా అధికారుల పాలన: జగదీశ్‌రెడ్డి

TG: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ విద్యుత్ సంస్థలో ఆంధ్రా అధికారుల పాలన నడుస్తుందని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సన్సెషనల్ కామెంట్ చేశారు. మంగళవారం తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే సందర్భంగా సూర్యాపేటలోని తన క్యాంప్ ఆఫీస్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ పదం అంటేనే భయపడే రోజులు ఉండేవని ఆంధ్రా కుట్రదారులు, ఆంధ్రా దళారులు ఎన్నో పన్నాగాలు పన్నీ తెలంగాణను అడ్డుకున్నారన్నారు.

సుప్రీంకోర్టులోకి ఐదుగురు కొత్త జడ్జీలు!▶
Politics· 2 Jun 2026

సుప్రీంకోర్టులోకి ఐదుగురు కొత్త జడ్జీలు!

ఢిల్లీలో జరిగిన ఒక స్పెషల్ సెర్మనీలో సుప్రీంకోర్టు కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్ పల్లి, సీనియర్ అడ్వకేట్ వి. మోహన లతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించారు. ఈ ఐదుగురు కొత్త జడ్జీల ఎంట్రీతో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జీల నెంబర్ 37కి రీచ్ అయింది.

BJPకి అన్నామలై గుడ్ బై!
Politics· 2 Jun 2026

BJPకి అన్నామలై గుడ్ బై!

తమిళనాడు పాలిటిక్స్ లో ఊహించని బిగ్ ట్విస్ట్! గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ BJP లీడర్ అన్నామలై తన పోస్ట్‌కి రిజైన్ చేసేశారు. BJP ప్రెసిడెంట్ నితిన్ నబిన్‌కు ఏకంగా ఒక 5 పేజీల లెటర్ పంపించి రిజగ్నేషన్ ఇచ్చేశారు. పార్టీ కోసం అంతలా కష్టపడ్డ అన్నామలై ఇలా అఫీషియల్ గా బయటకు వచ్చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే ఆయన త్వరలోనే సొంతంగా ఒక కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది.