Latest

గౌరవంగా వెళ్లిపోతాః బీజేపీ చీఫ్ కి అన్నామలై క్లారిటీ !!
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వస్తున్న ఊహాగానాల మధ్య మంగళవారం ఢిల్లీలో హైకమాండ్‌తో భేటీ అయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, హోంమంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్‌లతో ఆయన చర్చలు జరిపారు. తాను గౌరవప్రదంగా పార్టీ వీడాలనుకుంటున్నట్లు, సొంతంగా కొత్త పంథాలో పయనించాలని నిర్ణయించుకున్నట్లు అన్నామలై అధిష్టానానికి స్పష్టం చేశారు. అయితే, ఆయన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరిన బీజేపీ నేతలు కొంత సమయం అడిగారు. అన్నామలై ఇంకా అధికారికంగా రాజీనామా చేయలేదు.

పసికందుని ఘోరంగా హింసించి చంపిన శాడిస్ట్ !!
కేరళలోని నెడుమంగడ్‌లో ఏడాదిన్నర బాబు అర్షిద్‌ను తల్లి తో ఉన్న ప్రియుడు అష్కర్ కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. బాబు ఒంటిపై 51 గాయాలు, సిగరెట్ కాలిన గుర్తులను పోలీసులు గుర్తించారు. తన జీవితానికి అడ్డంగా ఉన్నాడనే కారణంతో మూడు నెలల ముందే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితుడు అష్కర్ ఒప్పుకున్నాడు. బాబును క్రూరంగా హింసిస్తున్నా తల్లి అఖిల మౌనంగానే ఉండిపోయింది. విచారణలో అష్కర్‌కు తన మొదటి భార్యను కూడా ఘోరంగా హింసించిన పాత నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం నిందితులిద్దరూ జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

CBSE కేసులో పార్లమెంటరీ ప్యానెల్ ముందుకు 17 ఏళ్ల స్టూడెంట్!
CBSE క్లాస్ 12 ఎగ్జామినేషన్స్ 'ఆన్-స్క్రీన్ మార్కింగ్' (OSM) పోర్టల్ వివాదంపై 17 ఏళ్ల స్టూడెంట్ సార్థక్ సిద్ధాంత్ మంగళవారం Parliamentary Panel ముందుకు హాజరయ్యాడు. ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీకి సార్థక్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఈ OSM సిస్టమ్‌లోని లోపాలు, టెండర్లలో జరిగిన ఇర్రెగ్యులారిటీస్‌పై తన బ్లాగ్‌లో ఎక్స్‌పోజ్ చేసి సార్థక్ సంచలనం సృష్టించాడు. దీనిపై CBSE రెస్పాన్స్ కోసం కమిటీ వెయిట్ చేస్తోంది.

తెలంగాణ '12వ ఫార్మేషన్ డే' CM స్పీచ్ హైలైట్స్!
తెలంగాణ 12వ స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా CM రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హార్టీ విషెస్ చెప్పారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌లకు థాంక్స్ చెప్పారు. మాది ఓన్లీ రూల్ చేసే గవర్నమెంట్ కాదు. ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం, అని CM అన్నారు. 'తెలంగాణ రైజింగ్-2047' విజన్ డాక్యుమెంట్‌తో రాష్ట్రాన్ని 'క్యూర్-ప్యూర్-రేర్' మోడల్స్‌గా డెవలప్ చేస్తామని, వందేళ్ల మాస్టర్ ప్లాన్‌తో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మారుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మిగితా స్పీచ్ హైలైట్స్ ఇక్కడ లింకు లో ఉంది క్లిక్ చేసి చదవండి.

కోల్‌కతాలో మమతా బెనర్జీ మెగా ధర్నా!
కోల్‌కతాలో మమతా బెనర్జీ మెగా ధర్నా! పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, TMC చీఫ్ Mamata Banerjee కోల్‌కతాలోని రాణి రష్మోని రోడ్‌లో భారీ ప్రొటెస్ట్ మార్చ్ చేపట్టారు. ఎలక్షన్ల తర్వాత తమ పార్టీ లీడర్లు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీలపై జరిగిన దాడులకు నిరసనగా ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. రైల్వే హాకర్ల ఎవిక్షన్ డ్రైవ్‌ను కూడా ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసు పర్మిషన్ నిరాకరించినప్పటికీ ప్రొటెస్ట్ కొనసాగిస్తామని, అవసరమైతే అరెస్ట్ అవ్వడానికైనా రెడీ అని మమతా ప్రకటించారు. ఈ డెమోన్‌స్ట్రేషన్‌ను BJP నేత రాహుల్ సిన్హా తీవ్రంగా విమర్శించారు.

వచ్చే వారం వర్షాలు దంచుడే దంచుడు !!
వచ్చేవారం దక్షణాది రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు ఎల్లుండి, జూన్ 4న కేరళలో ప్రవేశిస్తున్నాయని ఆ ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. నైరుతి ఎఫెక్ట్ కేరళపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏడునుంచి 20 సెం.మీ వర్షం ఒకే సారి కురిసి కుంభవృష్టిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని వెదర్ రిపోర్ట్ అంచనా.
పవన్ కళ్యాణ్‌ను యాక్టర్‌లాగే చూస్తాం!
"పవన్ కళ్యాణ్‌ను మేము ఓన్లీ ఒక సినిమా యాక్టర్‌లాగే చూస్తాం" అంటూ కాంగ్రెస్ లీడర్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రా మూలాలున్న వ్యక్తి తెలంగాణలో పార్టీ పెడితే ఇక్కడి ప్రజలకు న్యాయం చేయలేరని ఆయన అన్నారు. ఆంధ్రా ప్రాంత లీడర్‌కు ఆంధ్రాపైనే ప్రేమ ఉంటుంది, కానీ తెలంగాణ మీద ప్రేమ ఉండదు కదా అని క్వశ్చన్ చేశాడు. పవన్ కళ్యాణ్ పై మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

తమిళనాడు పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్!
తమిళనాడులో BJP కోసం పాదయాత్రలు చేసి, కొరడా దెబ్బలు తిని, పార్టీకి అండగా నిలిచిన ఫేమస్ లీడర్ అన్నామలై ఇప్పుడు BJPకి దూరం జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో ఇక BJP పుంజుకోలేదని ఆయన ఫిక్స్ అయ్యారా? లేక రాజ్యసభ సీటు కోసం ఇదంతా చేస్తున్నారా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. గత వారం రోజులుగా అన్నామలై BJPని వొదిలి own పార్టీ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి.
బృందావనంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ!
టాలెంటెడ్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బృందావనంలో సందడి చేశారు. అక్కడి ప్రెమానంద్ జీ మహారాజ్ బాబాను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

'జులై 2న మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూపోరాటం'
TG: మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూపోరాటం చేస్తామని తెలంగాణ రక్షణ సేన(TRS) స్టేట్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన తెలంగాణ ఫార్మెషన్ డే సెలబ్రేషన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జాతీయజెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఆమె స్మరించుకున్నారు. జులై 2న ఉప్పల్ భగాయత్‌లో పెద్దఎత్తున భూపోరాటం చేస్తామన్నారు. ఈ పోరాటంలో అన్నివర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రెండేళ్లలో ప్రజలకు చేసింది శూన్యం: మాజీ మంత్రి వేణు
AP: రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని వైసీపీ తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి వేణు విమర్శించారు. వైసీపీ రూపొందించిన 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమ పోస్టర్‌ను జిల్లా వైసీపీ ఆఫీస్‌లో మంగళవారం ఆవిష్కరించారు. బూటకపు హామీలతో నమ్మించి సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని, ఇది వెన్నుపోటుకు రెండేళ్లు అని ఫైర్ అయ్యారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో షాక్!
జనసేన పార్టీకి హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ జనసేన లీడర్స్ హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. ఆల్రెడీ ఈ మీటింగ్‌కు పోలీస్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ రిజెక్ట్ చేయడంతో, జనసేన కోర్టును అప్రోచ్ అయింది. కానీ అక్కడ కూడా లైన్ క్లియర్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఏం జరగబోతుందనేది సస్పెన్స్‌గా మారింది. పవన్ ప్రెస్ మీట్ ట్వీట్ తర్వాత జరిగిన ఈ ఇష్యూతో తెలంగాణ పాలిటిక్స్ లో ఫుల్ డిస్కషన్ నడుస్తుంది
ఆవులా గడ్డి తింటూ షాకిచ్చిన వ్యక్తి!
సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఆవులకు వేసే తవుడు, గడ్డిని తింటూ కనిపించాడు. ఏదో మూఢనమ్మకం లేదా వింత ఆచారం కోసమే ఆ పర్సన్ ఇలా చేస్తున్నాడని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంకొందరు "ఆవులా మారాలని ట్రై చేస్తున్నాడా ఏంటి?" అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
ఎండ దెబ్బకు స్పీచ్ ఆపేసిన CM రేవంత్ రెడ్డి!
తెలంగాణ ఫార్మేషన్ డే ప్రోగ్రామ్‌లో CM రేవంత్ రెడ్డి, ఎండ విపరీతంగా ఉండడంతో ఆయన తన స్పీచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, జనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెపుతున్నారు. CM లెవెల్ లీడర్ ఇలా ఎండ వల్ల స్పీచ్ ఆపేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.
స్ట్రీట్స్ లో ఆటో నడిపిన CM వైఫ్!
మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడణవీస్ వైఫ్ అమృత ఫడణవీస్ ముంబై రోడ్లపై అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.రీసెంట్ గా సైకిల్ తొక్కి న్యూస్ లో వైరల్ అయిన ఆమె, మళ్ళీ ఇప్పుడు ముంబై వీధుల్లో స్వయంగా ఆటో నడిపి అందరినీ షాక్ చేసింది. CM వైఫ్ అయి ఉండి కూడా ఇలా నార్మల్ పీపుల్‌లా ఆటో డ్రైవ్ చేయడంతో అక్కడి జనాలు షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మినిస్టర్ వివేక్
TG: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే సందర్భంగా మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సెలబ్రేషన్స్‌కు మినిస్టర్ అటెండయ్యారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి నేషనల్ ఫ్లాగ్‌ను ఆవిష్కరించారు. రైతుల సంక్షేమం, ఉమెన్ ఎంపవర్‌మెంట్, జాబ్ ఆపర్ట్యూనిటీస్, విద్య, వైద్యం, మౌలికసదుపాయాల అభివృద్ధికి స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్
TG: తెలంగాణ ఫార్మెషన్ డే సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 280 పోస్టులతో మూడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం అనౌన్స్ చేశారు. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఇన్విరాన్‌మెంట్ ఇంజనీర్లు 9, రోడ్డు భవనాల డిపార్ట్‌మెంట్‌లో ఏఈఈ సివిల్ 222, ఎలక్ట్రికల్ 49 పోస్టులు ఉన్నాయన్నారు. గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్‌మెంట్‌కు ఇకపై ప్రతినెలా రెండుమూడు ఉద్యోగ ప్రకటనలు చేస్తామని చెప్పారు. మరోవైపు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నోటిఫికేషన్ వేయకపోతే గవర్నమెంట్‌పై తిరగబడతామని నిరుద్యోగ జేఏసీ, పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణ పోలీస్‌లకు పవన్ కళ్యాణ్ ట్వీట్.. 'లెట్స్ సీ'!
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. ఈరోజు సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో జనసేన లీడర్స్‌తో కలిసి ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అయితే, కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ ఇస్తుందని ఆశిస్తున్నా అంటూ. "లెట్స్ సీ" అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది.
చంద్రబాబుకు చదువు లేదు.. తెలుగు రాదు!
సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి CM చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు అస్సలు చదువు లేదని, తెలుగు కూడా కరెక్ట్‌గా మాట్లాడడం రాదని అన్నారు. ఆయనకు ఇంగ్లీషు రాదని, హిందీ మాట్లాడి ఇదే గ్రీక్ లాంగ్వేజ్ అన్నా నమ్ముతడని సెటైర్లు వేశారు. బాబు వెనుక ఉన్న మీడియా అంతా ఒక పెద్ద మాఫియా అని, దొంగ భూములు అమ్ముకున్న డబ్బుతోనే ఫేక్ మీడియా, ఫేక్ న్యూస్ పేపర్లు రన్ చేస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రోడ్ యాక్సిడెంట్‌లో ఇద్దరు మృతి
TG: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద భారీ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఇద్దరు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని డెడ్‌బాడీలను పరిశీలించారు. లారీ కింద కారు ఇరుక్కుపోవడంతో అతికష్టం మీద వారిని బయటకు తీశారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, క్షతగాత్రులు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మణుగూరుకు చెందిన వారిగా గుర్తించారు.

విగ్రహాలు కూలగొడితే సీఎం అవుతారా : విష్ణువర్థన్ రెడ్డి
AP: తెలంగాణ రక్షణ సేన పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీడర్లపై చేసిన కామెంట్లపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. విగ్రహాలు కూలగొట్టాలని మాట్లాడితే సీఎం అవుతారా కవిత గారు?, ఇంకెన్నాళ్లు మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తారని ఆయన నిలదీశారు. గతంలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన కామెంట్లపై కేసులు పెట్టి జైలుకు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న ఆంధ్రా నేతల విగ్రహాలు ధ్వంసం చేసి ఆంధ్రాకు పార్సిల్ పంపిస్తామని కవిత సన్సెషనల్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.