అప్పట్లో ఎంజీఆర్ వర్సెస్ కరుణానిధి.. ఇప్పుడు విజయ్ వర్సెస్ అన్నామలై !!

తమిళనాడు పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. బీజేపీని వీడుతున్నఅన్నామలై తమిళ జాతీయ వాదం, పాలన అన్న రెండు అంశాలపైన ఒక పొలిటికల్ ప్లాట్ ఫామ్ ను ముందు స్టార్ట్ చేస్తారని సమాచారం. ఆ తర్వాత దానిని పొలిటికల్ పార్టీగా మార్చే అవకాశముంది.అన్నామలై ఎంట్రీతో తమిళనాడు ఓల్డ్ పొలిటికల్ రైవలరీని గుర్తు చేస్తోంది. ఎంజీ ఆర్, వర్సెస్ కరుణానిధి లాగా, అటు అన్నామలై, ఇటు సీఎం విజయ్ .. తొలిసారిగా ఇద్దరు నాన్ ద్రవిడియన్ లీడర్స్ తమిళ రాజకీయాలను ఏ టర్న్ తిప్పుతారో మరి.


