← Back to news

లాకర్లలో బంగారాలను వాడుకలోకి తెస్తేనే బెటర్ !!

By DS· 2 Jun 2026· Ndtv· Delhi
లాకర్లలో బంగారాలను వాడుకలోకి తెస్తేనే బెటర్ !!

దేశంలో ఇళ్లు, ఆలయట్రస్టుల దగ్గర ఇతరత్రా కలిపితే 30,000నుంచి 32,000 టన్నుల బంగారం లాకర్లలో నిరుపయోగంగా పడి ఉందని అంచనా..(సుమారు $3.8 ట్రిలియన్లు) . 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లోనే దేశీయ అవసరాల కోసం భారత్ సుమారు $72.4 బిలియన్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది దేశ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది.నిపుణుల అంచనా ప్రకారం, దేశంలో ఉన్న మొత్తం బంగారంలో కేవలం 1% బంగారాన్ని ఏటా రీసైకిల్ చేసినా, మన దేశ బంగారం దిగుమతులు 25 నుంచి 30 శాతం తగ్గుతాయి.ఖజానాలు, లాకర్లలో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేసి వాడుకలోకి తీసుకు రావాలని ప్రధాని మోడీ గతంలో పిలుపునిచ్చారు.

More in Politics