ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్రా అధికారుల పాలన: జగదీశ్‌రెడ్డి

TG: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ విద్యుత్ సంస్థలో ఆంధ్రా అధికారుల పాలన నడుస్తుందని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సన్సెషనల్ కామెంట్ చేశారు. మంగళవారం తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే సందర్భంగా సూర్యాపేటలోని తన క్యాంప్ ఆఫీస్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ పదం అంటేనే భయపడే రోజులు ఉండేవని ఆంధ్రా కుట్రదారులు, ఆంధ్రా దళారులు ఎన్నో పన్నాగాలు పన్నీ తెలంగాణను అడ్డుకున్నారన్నారు.


