Latest

తెలంగాణ పోలీస్‌లకు పవన్ కళ్యాణ్ ట్వీట్.. 'లెట్స్ సీ'!
Politics· 2 Jun 2026

తెలంగాణ పోలీస్‌లకు పవన్ కళ్యాణ్ ట్వీట్.. 'లెట్స్ సీ'!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. ఈరోజు సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో జనసేన లీడర్స్‌తో కలిసి ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అయితే, కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ ఇస్తుందని ఆశిస్తున్నా అంటూ. "లెట్స్ సీ" అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది.

చంద్రబాబుకు చదువు లేదు.. తెలుగు రాదు!▶
Politics· 2 Jun 2026

చంద్రబాబుకు చదువు లేదు.. తెలుగు రాదు!

సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి CM చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు అస్సలు చదువు లేదని, తెలుగు కూడా కరెక్ట్‌గా మాట్లాడడం రాదని అన్నారు. ఆయనకు ఇంగ్లీషు రాదని, హిందీ మాట్లాడి ఇదే గ్రీక్ లాంగ్వేజ్ అన్నా నమ్ముతడని సెటైర్లు వేశారు. బాబు వెనుక ఉన్న మీడియా అంతా ఒక పెద్ద మాఫియా అని, దొంగ భూములు అమ్ముకున్న డబ్బుతోనే ఫేక్ మీడియా, ఫేక్ న్యూస్ పేపర్లు రన్ చేస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రోడ్ యాక్సిడెంట్‌లో ఇద్దరు మృతి
Local· 2 Jun 2026

రోడ్ యాక్సిడెంట్‌లో ఇద్దరు మృతి

TG: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద భారీ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఇద్దరు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని డెడ్‌బాడీలను పరిశీలించారు. లారీ కింద కారు ఇరుక్కుపోవడంతో అతికష్టం మీద వారిని బయటకు తీశారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, క్షతగాత్రులు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మణుగూరుకు చెందిన వారిగా గుర్తించారు.

విగ్రహాలు కూలగొడితే సీఎం అవుతారా : విష్ణువర్థన్ రెడ్డి
Politics· 2 Jun 2026

విగ్రహాలు కూలగొడితే సీఎం అవుతారా : విష్ణువర్థన్ రెడ్డి

AP: తెలంగాణ రక్షణ సేన పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీడర్లపై చేసిన కామెంట్లపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. విగ్రహాలు కూలగొట్టాలని మాట్లాడితే సీఎం అవుతారా కవిత గారు?, ఇంకెన్నాళ్లు మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తారని ఆయన నిలదీశారు. గతంలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన కామెంట్లపై కేసులు పెట్టి జైలుకు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న ఆంధ్రా నేతల విగ్రహాలు ధ్వంసం చేసి ఆంధ్రాకు పార్సిల్ పంపిస్తామని కవిత సన్సెషనల్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్
TG· 2 Jun 2026

ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్

TG: ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే సందర్భంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 92మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. చాలాకాలంగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీల ప్రవర్తన, వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, జైలులో వారి ప్రవర్తనా తీరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖైదీలను విడుదల చేయనున్నారు. 86మంది పురుషులు, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి 12ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మానవతా దృక్పథంతో స్టేట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డిసిషన్‌ పట్ల ఖైదీల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.

అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్..!
World· 2 Jun 2026

అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్..!

అమెరికాలో అక్రమంగా ఉంటూ ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయులను అధికారులు అరెస్ట్ చేశారు. అరిజోనా స్టేట్ లో చేపట్టిన ఆపరేషన్ చెక్‌మేట్ లో మొత్తం 52 మంది పట్టుబడగా, వారిలో 36 మంది హెవీ ట్రక్కులు నడుపుతున్నట్లు గుర్తించారు. వీరిలో 30 మంది భారతీయులే. కొందరి వద్ద గడువు ముగిసిన వర్క్ పర్మిట్లు ఉండగా, మరికొందరి వద్ద సరైన లైసెన్సులు కూడా లేవని అధికారులు తెలిపారు. అరెస్టైన వారందరినీ డిపోర్టేషన్ ప్రక్రియకు పంపనున్నట్లు వెల్లడించారు.

ఫైర్ యాక్సిడెంట్‌లో ఇద్దరు సజీవదహనం
AP· 2 Jun 2026

ఫైర్ యాక్సిడెంట్‌లో ఇద్దరు సజీవదహనం

TG: ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు నిద్రలోనే సజీవదహనమయ్యారు. వలగాని సావిత్రి (60), పూలమ్మ (65) నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇద్దరూ మృతి చెందారు. మంటల ధాటికి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. పెద్దఎత్తున ఎగిసిపడడంతో పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా కాలిబూడిదైంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన పూలమ్మ తన చెల్లిని చూసేందుకు ఏలూరు వచ్చినట్లు సమాచారం.

తెలంగాణ ఫార్మెషన్ డే వేడుకల్లో షాకింగ్ ఇన్సిడెంట్
Local· 2 Jun 2026

తెలంగాణ ఫార్మెషన్ డే వేడుకల్లో షాకింగ్ ఇన్సిడెంట్

TG: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫార్మెషన్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిద్దిపేట టౌన్‌లో నిర్వహించిన సెలబ్రేషన్స్ మాత్రం షాకింగ్‌కు గురిచేసింది. సిద్దిపేట విద్యుత్ సహాయ డివిజనల్ ఇంజనీరింగ్ ఆఫీస్‌లో అధికారులు జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ పురస్కరించుకొని పాత తెలంగాణ తల్లి ఫొటో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి రెండేళ్లు దాటినా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన విషయం విద్యుత్ అధికారులకు తెలియకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

రుతు పవనాలు మళ్లీ వాయిదా
General· 2 Jun 2026

రుతు పవనాలు మళ్లీ వాయిదా

దేశంలో ఎండలు మండిపోతూ ఉండడంతో అందరూ నైరుతి ఎప్పుడెప్పుడు వస్తుందాని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ వీటి రాక ఇంకా ఆలస్యం కానుంది. జూన్ మొదటి వారంలో వస్తాయో లేదోనన్న సందేహాలున్నాయి. కేరళలో నైరుతి బలంగా నిలబడాలంటే దానికి అవసరమైన గాలులు జూన్ 6 తర్వాతే వస్తాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు IMD ఈ ఏడాది వర్షపాతం అంచనాను 92% నుంచి 90%కి తగ్గించింది. ఎల్‌నినో ప్రభావం కూడా ఈ సారి ఆందోళన పుట్టిస్తోంది.

నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ ▶
TG· 2 Jun 2026

నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ నెలలో TGPSC ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, విద్యాశాఖలలో పోస్టుల భర్తీకి నోటీఫికేషన్లు జారీ చేస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ నిరంతం కొనసాగుతుందని సీఎం చెప్పారు.

జై తెలంగాణ జైజై తెలంగాణ ▶
TG· 2 Jun 2026

జై తెలంగాణ జైజై తెలంగాణ

ఇవాళ తెలంగాణ ఆవిర్భావదినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలు, అభివృద్ధి అన్నీ కలిపి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో మీరూ చూసేయండి

నేను లేకపోతే నీకు జైలే గతి : నెతన్యాహూపై ట్రంప్ బూతులు
World· 2 Jun 2026

నేను లేకపోతే నీకు జైలే గతి : నెతన్యాహూపై ట్రంప్ బూతులు

అమెరికా అధ్యక్షుడు Donald Trump, ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahuపై బూతుపురాణంలంకిచినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. లెబనాన్ దాడుల విషయంలో నెతన్యాహూ వైఖరిని తప్పుపట్టిన ట్రంప్ ఫోన్ కాల్ లోనే "నువ్వు F***ing Crazy.. నేను లేకపోతే ఎప్పుడో జైల్లో ఉండేవాడివి" అంటూ విరుచుకుపడ్డారు. ఇరాన్ తో శాంతి చర్చలకి లెబనాన్ పై దాడులు అడ్డంకిగా మారడంతో ట్రంప్ సహనం కోల్పోయారు. అసభ్య పదజాలంతో దూషించారని Axios రిపోర్ట్ వెల్లడించింది. ఈ కాల్ తర్వాత బీరూట్‌పై దాడులను ఇజ్రాయెల్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.

5 ఏళ్లలో ప్లంబర్ దొరకడం కష్టమే..!
India· 2 Jun 2026

5 ఏళ్లలో ప్లంబర్ దొరకడం కష్టమే..!

ఇండియాలో రాబోయే రోజుల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు దొరకడం కష్టమైపోతుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఐటీ రంగం, డెలివరీ యాప్స్ (గిగ్ ఎకానమీ) క్రేజ్‌తో యంగ్ జనరేషన్ అంతా అటువైపే వెళ్తుండటంతో ట్రెడిషనల్ బ్లూ కాలర్ స్కిల్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడనుంది. నిర్మాణ రంగానికే దాదాపు 20 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల కొరత ఉందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ తెలిపింది. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు అత్యధిక డిమాండ్‌లో ఉన్న వృత్తులుగా మారాయి. మరోవైపు దేశంలో కేవలం 4.1% వర్క్‌ఫోర్స్‌కే ఫార్మల్ స్కిల్ ట్రైనింగ్ అందుబాటులో ఉంది.

అందరికీ జాబ్స్ ఇవ్వడం అసాధ్యం: TGPSC ఛైర్మన్
TG· 1 Jun 2026

అందరికీ జాబ్స్ ఇవ్వడం అసాధ్యం: TGPSC ఛైర్మన్

TG: ఎంత ప్రయత్నించినా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల రిలీజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు 19వేల అప్లికేషన్స్ వచ్చాయని, అంటే కేవలం 0.1% మందికే జాబ్స్ ఇవ్వగలమని, మిగతా 99.9% మందికి ఇవ్వలేమన్నారు. అసంతృప్తి సహజమని, అకారణంగా మాట్లాడేవారిని మీడియా, సొసైటీ కంట్రోల్ చేయాలని సూచించారు. TGPSCపై అసత్యాలు ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారన్నారు.

చిన్నారి మృతితో హాస్పిటల్ వద్ద టెన్షన్ టెన్షన్
Local· 1 Jun 2026

చిన్నారి మృతితో హాస్పిటల్ వద్ద టెన్షన్ టెన్షన్

TG: డాక్టర్ల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి చెందింది. 5నెలల చిన్నారికి జ్వరం రావడంతో వికారాబాద్ జిల్లాలోని మహవీర్ హాస్పిటల్‌లో చేర్చారు. సెల్‌ఫోన్ ద్వారా వైద్యుల సూచనలతో చికిత్స చేయడంతోనే పాప చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. జ్వరం ఉందని తీసుకొస్తే హాస్పిటల్‌లో చేర్చుకోవడంలో, ట్రీట్‌మెంట్ చేయడంలో నెగ్లెన్స్ చేశారని, అందుకే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

APలో చట్టాలు, బెయిల్స్ ఉండవా?▶
Politics· 1 Jun 2026

APలో చట్టాలు, బెయిల్స్ ఉండవా?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే నాగేశ్వరరావును అరెస్టు చేయలేద? అని తెలంగాణ కాంగ్రెస్ MLA అనిరుద్ ఫుల్ ఫైర్ అయ్యారు. అంటే APలో చట్టాలు, బెయిల్స్ లాంటివి ఏమీ ఉండవా? పవన్ కళ్యాణ్ ఏది చెప్తే పోలీసులు అదే చేస్తారా? అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా అనిరుద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

CM విజయ్: నేను CMని కాను.. మీ ఫస్ట్ సర్వెంట్‌ని!▶
Politics· 1 Jun 2026

CM విజయ్: నేను CMని కాను.. మీ ఫస్ట్ సర్వెంట్‌ని!

తమిళనాడులో విజయ్ CM అయిన తర్వత ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "నేను సీఎంని కాను.. మీ ఫస్ట్ సర్వెంట్‌ని" అంటూ విజయ్ చేసిన కామెంట్స్ కి పబ్లిక్‌ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. విజయ్ తన పవర్‌ఫుల్ స్పీచ్‌తో అందరిలో ఫుల్ జోష్ నింపారు, తమిళనాడులో న్యూ జనరేషన్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

 తన సూట్ కలర్ పై సీఎం విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !!
Politics· 1 Jun 2026

తన సూట్ కలర్ పై సీఎం విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !!

నేను ఏదైనా బ్లాక్ అండ్ వైట్ లోనే చూస్తా.. మంచి లేదా చెడు.. అంతే నా రూలింగ్ లో గ్రే ఏరియా అంటూ ఉండదు అన్నారు తమిళనాడు సీఎం విజయ్. తనను గెలిపించినందుకు తొలిసారి తిరుచిరాపల్లి వచ్చి ఒక భారీ రోడ్ షోలో పాల్గొని ఓటర్లకు థాంక్స్ చెప్పారు. తనఫస్ట్ టైమ్ ఎలక్షన్స్ లోనే ఈ రేంజ్ లో విజయం సాధించడం విశేషమన్నారు. ఇక తన సూట్ కలర్ గురించి మాట్లాడుతూ.. తాను అన్నింటినీ కేవలం 'బ్లాక్ అండ్ వైట్' (మంచి లేదా చెడు) లాగే చూస్తానని, తన పాలనలో మధ్యేమార్గాలు ఉండవని స్పష్టం చేశారు.2025లో తాను ఫస్ట్ టైమ్ కాంపెయిన్ స్టార్ట్ చేసిన ప్రదేశంలోనే మళ్లీ అంతే క్రౌడ్ ను అడ్రస్ చేస్తూ థాంక్స్ చెప్పారు.

రేపు పవన్ కళ్యాణ్ మీటింగ్‌ని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా?▶
Politics· 1 Jun 2026

రేపు పవన్ కళ్యాణ్ మీటింగ్‌ని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా?

"తెలంగాణ ఎవరి సొంత ఆస్తి కాదు" అంటూ జనసేన లీడర్ సాగర్ ఫుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో రేపు పవన్ కళ్యాణ్ పెట్టబోయే మీటింగ్‌ని ఆపే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ సభకు పర్మిషన్ ఇవ్వకపోతే తాము అస్సలు ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఈ మీటింగ్‌ని అడ్డుకోవాలని చూస్తే. నెక్స్ట్ వచ్చే లాస్ వాళ్లకే అంటూ జనసేన లీడర్ సాగర్ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

వర్షాకాలం వస్తోంది అధికారులకు CM ఆర్డర్స్!
Politics· 1 Jun 2026

వర్షాకాలం వస్తోంది అధికారులకు CM ఆర్డర్స్!

వర్షాకాలం వస్తోంది కాబట్టి ఆఫీసర్స్ అలర్ట్‌గా ఉండాలని CM రేవంత్ రెడ్డి ఆర్డర్స్ వేశారు. డ్యామ్‌ల గేట్ల రిపేర్లు అర్జంట్‌గా పూర్తి చేయాలని, ఎక్కడైనా తేడా వస్తే యాక్షన్ సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. వేరే స్టేట్స్ నుండి తెలంగాణకు రావాల్సిన వాటా నీళ్లు పక్కాగా తెచ్చుకోవాలన్నారు. అలాగే హైదరాబాద్‌లో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలని, వర్షాలు పడితే ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే వెంటనే రిపేర్ చేసి పవర్ సప్లై రీస్టార్ట్ చేయాలని అధికారులకు క్లియర్ టాస్క్ ఇచ్చారు.

Nandu's World జంట పై UKలో చీటింగ్ కేసు
Crime· 1 Jun 2026

Nandu's World జంట పై UKలో చీటింగ్ కేసు

సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్ కపుల్ గా పేరు పడ్డ Nandu's World యూట్యూబ్ ఛానెల్ జంట పై UKలో చీటింగ్ ఆరోపణలు వచ్చాయి. COS ( certificate Of Sponsorship) పేరుతో 50 మందిని మోసం చేశారని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను ఈ భార్యా భర్తలు మోసం చేశారనీ, లక్షల్లో వసూలు చేసి ఫేక్ ఆర్డర్ లు ఇచ్చారని వీళ్లపై ఆరోపణలు నమోదయ్యాయి. UK చట్టాలు ప్రకారం కేసు తీవ్రంగానే ఉంటుందని తెలుస్తోంది