← Back to news

గౌరవంగా వెళ్లిపోతాః బీజేపీ చీఫ్ కి అన్నామలై క్లారిటీ !!

By DS· 2 Jun 2026· Ndtv· Delhi
 గౌరవంగా వెళ్లిపోతాః   బీజేపీ చీఫ్ కి అన్నామలై క్లారిటీ !!

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వస్తున్న ఊహాగానాల మధ్య మంగళవారం ఢిల్లీలో హైకమాండ్‌తో భేటీ అయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, హోంమంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్‌లతో ఆయన చర్చలు జరిపారు. తాను గౌరవప్రదంగా పార్టీ వీడాలనుకుంటున్నట్లు, సొంతంగా కొత్త పంథాలో పయనించాలని నిర్ణయించుకున్నట్లు అన్నామలై అధిష్టానానికి స్పష్టం చేశారు. అయితే, ఆయన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరిన బీజేపీ నేతలు కొంత సమయం అడిగారు. అన్నామలై ఇంకా అధికారికంగా రాజీనామా చేయలేదు.

More in Politics