Latest

APలో చట్టాలు, బెయిల్స్ ఉండవా?▶
Politics· 1 Jun 2026

APలో చట్టాలు, బెయిల్స్ ఉండవా?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే నాగేశ్వరరావును అరెస్టు చేయలేద? అని తెలంగాణ కాంగ్రెస్ MLA అనిరుద్ ఫుల్ ఫైర్ అయ్యారు. అంటే APలో చట్టాలు, బెయిల్స్ లాంటివి ఏమీ ఉండవా? పవన్ కళ్యాణ్ ఏది చెప్తే పోలీసులు అదే చేస్తారా? అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా అనిరుద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

CM విజయ్: నేను CMని కాను.. మీ ఫస్ట్ సర్వెంట్‌ని!▶
Politics· 1 Jun 2026

CM విజయ్: నేను CMని కాను.. మీ ఫస్ట్ సర్వెంట్‌ని!

తమిళనాడులో విజయ్ CM అయిన తర్వత ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "నేను సీఎంని కాను.. మీ ఫస్ట్ సర్వెంట్‌ని" అంటూ విజయ్ చేసిన కామెంట్స్ కి పబ్లిక్‌ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. విజయ్ తన పవర్‌ఫుల్ స్పీచ్‌తో అందరిలో ఫుల్ జోష్ నింపారు, తమిళనాడులో న్యూ జనరేషన్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

 తన సూట్ కలర్ పై సీఎం విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !!
Politics· 1 Jun 2026

తన సూట్ కలర్ పై సీఎం విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !!

నేను ఏదైనా బ్లాక్ అండ్ వైట్ లోనే చూస్తా.. మంచి లేదా చెడు.. అంతే నా రూలింగ్ లో గ్రే ఏరియా అంటూ ఉండదు అన్నారు తమిళనాడు సీఎం విజయ్. తనను గెలిపించినందుకు తొలిసారి తిరుచిరాపల్లి వచ్చి ఒక భారీ రోడ్ షోలో పాల్గొని ఓటర్లకు థాంక్స్ చెప్పారు. తనఫస్ట్ టైమ్ ఎలక్షన్స్ లోనే ఈ రేంజ్ లో విజయం సాధించడం విశేషమన్నారు. ఇక తన సూట్ కలర్ గురించి మాట్లాడుతూ.. తాను అన్నింటినీ కేవలం 'బ్లాక్ అండ్ వైట్' (మంచి లేదా చెడు) లాగే చూస్తానని, తన పాలనలో మధ్యేమార్గాలు ఉండవని స్పష్టం చేశారు.2025లో తాను ఫస్ట్ టైమ్ కాంపెయిన్ స్టార్ట్ చేసిన ప్రదేశంలోనే మళ్లీ అంతే క్రౌడ్ ను అడ్రస్ చేస్తూ థాంక్స్ చెప్పారు.

రేపు పవన్ కళ్యాణ్ మీటింగ్‌ని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా?▶
Politics· 1 Jun 2026

రేపు పవన్ కళ్యాణ్ మీటింగ్‌ని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా?

"తెలంగాణ ఎవరి సొంత ఆస్తి కాదు" అంటూ జనసేన లీడర్ సాగర్ ఫుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో రేపు పవన్ కళ్యాణ్ పెట్టబోయే మీటింగ్‌ని ఆపే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ సభకు పర్మిషన్ ఇవ్వకపోతే తాము అస్సలు ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఈ మీటింగ్‌ని అడ్డుకోవాలని చూస్తే. నెక్స్ట్ వచ్చే లాస్ వాళ్లకే అంటూ జనసేన లీడర్ సాగర్ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

వర్షాకాలం వస్తోంది అధికారులకు CM ఆర్డర్స్!
Politics· 1 Jun 2026

వర్షాకాలం వస్తోంది అధికారులకు CM ఆర్డర్స్!

వర్షాకాలం వస్తోంది కాబట్టి ఆఫీసర్స్ అలర్ట్‌గా ఉండాలని CM రేవంత్ రెడ్డి ఆర్డర్స్ వేశారు. డ్యామ్‌ల గేట్ల రిపేర్లు అర్జంట్‌గా పూర్తి చేయాలని, ఎక్కడైనా తేడా వస్తే యాక్షన్ సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. వేరే స్టేట్స్ నుండి తెలంగాణకు రావాల్సిన వాటా నీళ్లు పక్కాగా తెచ్చుకోవాలన్నారు. అలాగే హైదరాబాద్‌లో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలని, వర్షాలు పడితే ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే వెంటనే రిపేర్ చేసి పవర్ సప్లై రీస్టార్ట్ చేయాలని అధికారులకు క్లియర్ టాస్క్ ఇచ్చారు.

Nandu's World జంట పై UKలో చీటింగ్ కేసు
Crime· 1 Jun 2026

Nandu's World జంట పై UKలో చీటింగ్ కేసు

సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్ కపుల్ గా పేరు పడ్డ Nandu's World యూట్యూబ్ ఛానెల్ జంట పై UKలో చీటింగ్ ఆరోపణలు వచ్చాయి. COS ( certificate Of Sponsorship) పేరుతో 50 మందిని మోసం చేశారని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను ఈ భార్యా భర్తలు మోసం చేశారనీ, లక్షల్లో వసూలు చేసి ఫేక్ ఆర్డర్ లు ఇచ్చారని వీళ్లపై ఆరోపణలు నమోదయ్యాయి. UK చట్టాలు ప్రకారం కేసు తీవ్రంగానే ఉంటుందని తెలుస్తోంది

ఎలక్షన్ రిజల్ట్స్‌పై CM విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!▶
Politics· 1 Jun 2026

ఎలక్షన్ రిజల్ట్స్‌పై CM విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

లాస్ట్ టైం MGRకి కూడా ఇన్ని ఓట్లు రాలేదు. నేనేం ఆయనతో నన్ను కంపేర్ చేసుకోవడం లేదు, MGR Is MGR అంటూ CM విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పబ్లిక్ నుండి ఇంకొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా బాగుండేది అన్నారు. ఏదేమైనా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాయని, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రజల నుండి కంప్లీట్ సపోర్ట్ పక్కాగా గెలుచుకుంటానని చెప్పారు. విజయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఏడాదిలో 10కేజీల వెయిట్ లాస్… రుపీ పతనంతో లండన్ విద్యార్థి పాట్లు
World· 1 Jun 2026

ఏడాదిలో 10కేజీల వెయిట్ లాస్… రుపీ పతనంతో లండన్ విద్యార్థి పాట్లు

గ్లోబల్ డ్రీమ్స్ ఎవరికైనా ఉండొచ్చు. కానీ గ్రౌండ్ రియాల్టీ ఎలా ఉంటుందో అందరికీ తెలియాలి. లండన్ లో మాస్టర్స్ చేయడానికి వెళ్లిన దివ్యం శర్మ ఫీజులు కట్టడానికి కడుపు మాడ్చుకోవడంతో ఏడాదిలో 10 కేజీల బరువు తగ్గాడు. ఇప్పుడతని స్టోరీ SMలో వైరల్ గా మారింది. మన రుపీ పతనమైపోతూ ఉండడంతో విదేశీ విద్య ఖరీదైపోయింది. 2023లో ఒక పౌండ్ కి ₹100 ఉండగా, ఇప్పుడు ₹128 చేరుకుంది. దీంతో ఆర్థిక భారం పెరిగిపోయి ఖర్చులో తగ్గించుకోవాల్సి వచ్చింది. ఒక పూట భోజనం మానేయడం, పార్ట్ టైమ్ వెయిటర్ గా పని చేయడంతో దివ్యం శర్మ ఏడాదిలో 10 కేజీలు తగ్గాడు.

మమతకు సిగ్నేచర్ స్కాండల్  తలనొప్పి !!  ఆ ఇద్దరూ అవుట్ !!
Politics· 1 Jun 2026

మమతకు సిగ్నేచర్ స్కాండల్ తలనొప్పి !! ఆ ఇద్దరూ అవుట్ !!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో "సిగ్నేచర్ స్కాండల్" (సంతకాల ఫోర్జరీ వివాదం) తీవ్ర సంచలనం రేపుతోంది. శోభన్‌దేబ్ ఛటోపా ధ్యాయకు మద్దతుగా ఇచ్చిన లేఖలో తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని ఇద్దరు తృణమూల్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీఎం సువేందు అధికారి బయటపెట్టడంతో, సదరు ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, శాందీపన్ సాహాలను TMC వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసింది. మొత్తానికి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మమతా బెనర్జీకి ఓ రేంజ్‌లో తలనొప్పులు మొదలయ్యాయి! సంతకాలు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీనుంచి దీదీ బహిష్కరించింది.

కబ్బాళమ్మ టు కామాఖ్య.. DK శివకుమార్ టెంపుల్ రన్
India· 1 Jun 2026

కబ్బాళమ్మ టు కామాఖ్య.. DK శివకుమార్ టెంపుల్ రన్

కర్ణాటక సీఎంగా రేపో మాపో ప్రమాణం చేయనున్న ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ ఆలయాలు సందర్శిస్తున్నారు. అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య టెంపుల్‌తో పాటు కబ్బాళమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రాలయ, ఉజ్జయిని వంటి ఆలయాలకీ వెళ్లారు. స్వతహాగా దైవభక్తి ఎక్కువగా ఉన్న శివకుమార్ ఈ టెంపుల్ రన్ పై సోషల్ మీడియాలో క్రేజీ డిబేట్ జరుగుతోంది. సీఎం పదవి ఖరారు కాకముందు నుంచే ఆయన ఆలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

కర్ణాటక లో RCB ఫ్యాన్స్‌కి అన్యాయం జరిగింది!▶
Politics· 1 Jun 2026

కర్ణాటక లో RCB ఫ్యాన్స్‌కి అన్యాయం జరిగింది!

RCB టీమ్‌కి ఎలాంటి అన్యాయం జరగలేదు కానీ, కర్ణాటక లో RCB ఫ్యాన్స్‌కి మాత్రం అన్యాయం జరిగిందని డీకే శివకుమార్ అన్నారు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా బెంగళూరులో జరగాల్సింది అని చెప్పారు. ఏదేమైనా ప్లేయర్స్ బాగా ఆడి కప్ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు. లాస్ట్ ఇయర్ జరిగిన తొక్కిసలాట ఇన్సిడెంట్‌ని మర్చిపోయి, ఈసారి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశామని క్లారిటీ ఇచ్చారు.

తమిళనాడులో  జెన్ జీ టార్గెట్ గా అన్నామలై కొత్త పార్టీ?
Politics· 1 Jun 2026

తమిళనాడులో జెన్ జీ టార్గెట్ గా అన్నామలై కొత్త పార్టీ?

తమిళనాడు బిజేపి మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త రాజకీయ వేదిక ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన పుట్టిన రోజైన ఈనెల 4న ఆయన ఈ అనౌన్స్ మెంట్ చేసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. బీజేపితో తలెత్తిన విభేదాలు, తనను అధ్యక్ష పదవినుంచి తప్పించడం, అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల విషయంలో కూడా అభిప్రాయ బేధాలు రావడంతో అన్నామలై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జెన్ జీ టార్గెట్ గా అడుగులు వేయనున్నట్లు, ఈ రాజకీయ వేదికనే ఫ్యూచర్ లో పొలిటికల్ పార్టీగా మారుస్తారని టాక్ నడుస్తోంది.

IMD చల్లని కబరు.. ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు
General· 1 Jun 2026

IMD చల్లని కబరు.. ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు

వాతావరణ శాఖ చల్లని కబురు చెబుతోంది. ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, దక్షిణ కోస్తాలో ఈదురు గాలుల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. అలాగే వర్షాల కారణంగా విశాఖ, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది. రెండు రోజులపాటు దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించింది. మరో 48 గంటల లోపు నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి.

 పెళ్లయిన గంటకే హెలికాఫ్టర్ ప్రమాదంలో వరుడు మృతి
World· 1 Jun 2026

పెళ్లయిన గంటకే హెలికాఫ్టర్ ప్రమాదంలో వరుడు మృతి

ఎంతో హ్యాపీగా గడపాల్సిన లైఫ్ కొన్ని గంటల్లోనే ముగిసిపోయింది. అప్పటివరకు పెళ్లి వేడుకల్లో ఆనందంగా గడిపిన ఆ భారతీయ మూలాలున్న కుటుంబం ఇంట తీవ్రవిషాదం నెలకొంది. కేరళ మూలాలున్న 25 ఏళ్ల డెల్టా ఎయిర్‌లైన్స్ పైలట్ డేవ్ ఫిజీ పెళ్లయిన మూడు గంటలకే మరణించాడు. అమెరికాలోని జార్జియా నుంచి అట్లాంటాకు హెలికాఫ్టర్ లో ఆ జంట హానిమూన్ కోసం బయల్దేరారు. ప్రతికూల వాతావరణంతో హెలికాఫ్టర్ కుప్పకూలిపోవడంతో డేవ్, మరో పైలెట్ అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలతో బయటపడిన జెస్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

అడ్డొస్తున్నాడని హత్య చేసి డ్రామా, విచారణలో బిగ్ ట్విస్ట్
Crime· 1 Jun 2026

అడ్డొస్తున్నాడని హత్య చేసి డ్రామా, విచారణలో బిగ్ ట్విస్ట్

AP: ప్రియుడి మోజులో పడి కన్న కొడుకును మర్డర్ చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం జీ.హోసళ్లి విలేజ్‌లో చోటుచేసుకుంది. గంగమ్మ అనే మహిళ దర్గప్పతో ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆమె కుమారుడు నిలదీశాడు. దీంతో లవర్‌తో కలిసి గంగమ్మ కన్నకొడుకు వీరేంద్ర(15)ను కత్తితో పొడిచి చంపి డెడ్‌బాడీని స్మశానవాటికలో పాతిపెట్టింది. తన కుమారుడు కన్పించడంలేదని ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏకంగా దర్యాప్తు లేటు అవుతుందని హైకోర్టును ఆశ్రయించింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది. తీవ్ర అనారోగ్యానికి గురైన నిందితురాలు కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన సొంత పార్టీ లీడర్!▶
Politics· 1 Jun 2026

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన సొంత పార్టీ లీడర్!

"కత్తి చంద్రబాబుది.. పొడిచేది రేవంత్ రెడ్డి" అంటూ కాంగ్రెస్ లీడర్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కత్తి వేరేవాళ్లదైనా పొడిచేది మాత్రం మనవాళ్లే అని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలనే ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో సరిగ్గా అదే జరుగుతోందని మండిపడ్డారు. సొంత పార్టీ CM రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ శ్రీనివాస్ యాదవ్ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై డిపెండ్ అవకుండా ఇండియా- ఒమన్ కొత్త రూట్ !
Business· 1 Jun 2026

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై డిపెండ్ అవకుండా ఇండియా- ఒమన్ కొత్త రూట్ !

భారత్-ఒమన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) నేటి నుండి అమలులోకి వచ్చింది. అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిన వేళ, వ్యూహాత్మకంగా వెలుపల ఉన్న ఒమన్ భారత్‌కు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారింది. ఈ ఒప్పందంతో భారత శ్రమశక్తి ఆధారిత ఎగుమతులకు ఒమన్ సున్నా-సుంకం (Zero-duty) ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఇది పెట్టుబడులను పెంచి, ఉద్యోగాల సృష్టికి హెల్ప్ అవుతుంది.

రాజ్యసభ ఎన్నికలు... బీజేపికి క్రాస్ ఓటింగ్ భయం ...
Politics· 1 Jun 2026

రాజ్యసభ ఎన్నికలు... బీజేపికి క్రాస్ ఓటింగ్ భయం ...

ఈనెల 18న 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 17-18 స్థానాలు గెలిచి, తమ బలాన్ని 150 దాటించాలని వ్యూహాలు రచిస్తోంది. క్రాస్ ఓటింగ్ భయాల మధ్య ప్రధాని మోదీ అధ్యక్షతన వ్యూహాత్మక సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ వంటి ప్రముఖుల పదవీకాలం ముగియనుండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

బిడ్డని డ్రైనేజీలో పడేసిన సైకో ఫాదర్!▶
Viral· 1 Jun 2026

బిడ్డని డ్రైనేజీలో పడేసిన సైకో ఫాదర్!

ఇండియాలో చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్ చాలా ఘోరంగా ఉంది అనడానికి ఈ వీడియోనే ఎగ్జాంపుల్. ఒక ఫాదర్ తన పిల్లాడు అంతలా ఏడుస్తున్నా వినకుండా, జస్ట్ పనిష్మెంట్ ఇవ్వడానికి ఓపెన్ డ్రైనేజీలో పడేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ షాక్‌ చేస్తోంది. ఇండియాలో చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

ప్రిగ్నెంట్ అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్ ను అడ్డగించి...▶
News· 1 Jun 2026

ప్రిగ్నెంట్ అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్ ను అడ్డగించి...

కర్ణాటకలో గర్భవతిగా ఉన్న భార్యను తీసుకువెళ్లేందుకు..గవర్నర్‌ కాన్వాయ్‌ను అడ్డగించి ఓ యువకుడు సంచలనం సృష్టించాడు.. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌ కాన్వాయ్ వెళ్లడం కోసం 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. దాంతో ప్రిగ్నెంట్ అయిన తన భార్యను ఆస్పత్రికి తరలించాలంటూ ఓ వ్యక్తి గవర్నర్ కాన్వాయ్ వెళ్లే రూట్ లో నడిరోడ్డుపై బైఠాయించాడు. తన భార్యకు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి వెడుతుండగా ట్రాఫిక్ లో చిక్కుకు పోయానంటూ అసహనం వ్యక్తం చేశాడు.

 కలెక్టరేట్‌లో గవర్నమెంట్ ఎంప్లాయికి దేహశుద్ది
Local· 1 Jun 2026

కలెక్టరేట్‌లో గవర్నమెంట్ ఎంప్లాయికి దేహశుద్ది

TG: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని గ్రేవెన్స్ డే ప్రొగ్రామ్‌లో ఓ గవర్నమెంట్ ఎంప్లాయికి దేహశుద్ది జరిగింది. పర్వతగిరి విలేజ్‌కు చెందిన ఓ మహిళ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో తన భూమి పోవడంతో నష్టపరిహారం కోసం కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చింది. కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న మురళి నీ పనిచేసి పెడతాను, లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఊరు చివరికి తీసుకెళ్లి మిస్ బిహేవ్ చేయడంతో ప్రతిఘటించిన మహిళ అక్కడి నుంచి తప్పించుకుంది. అనంతరం తన కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్‌కి వచ్చి మురళిని పట్టుకుని చెప్పులతో సామూహికంగా దేహశుద్ది చేశారు.