Nandu's World జంట పై UKలో చీటింగ్ కేసు

సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్ కపుల్ గా పేరు పడ్డ Nandu's World యూట్యూబ్ ఛానెల్ జంట పై UKలో చీటింగ్ ఆరోపణలు వచ్చాయి. COS ( certificate Of Sponsorship) పేరుతో 50 మందిని మోసం చేశారని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను ఈ భార్యా భర్తలు మోసం చేశారనీ, లక్షల్లో వసూలు చేసి ఫేక్ ఆర్డర్ లు ఇచ్చారని వీళ్లపై ఆరోపణలు నమోదయ్యాయి. UK చట్టాలు ప్రకారం కేసు తీవ్రంగానే ఉంటుందని తెలుస్తోంది



