ఏడాదిలో 10కేజీల వెయిట్ లాస్… రుపీ పతనంతో లండన్ విద్యార్థి పాట్లు

గ్లోబల్ డ్రీమ్స్ ఎవరికైనా ఉండొచ్చు. కానీ గ్రౌండ్ రియాల్టీ ఎలా ఉంటుందో అందరికీ తెలియాలి. లండన్ లో మాస్టర్స్ చేయడానికి వెళ్లిన దివ్యం శర్మ ఫీజులు కట్టడానికి కడుపు మాడ్చుకోవడంతో ఏడాదిలో 10 కేజీల బరువు తగ్గాడు. ఇప్పుడతని స్టోరీ SMలో వైరల్ గా మారింది. మన రుపీ పతనమైపోతూ ఉండడంతో విదేశీ విద్య ఖరీదైపోయింది. 2023లో ఒక పౌండ్ కి ₹100 ఉండగా, ఇప్పుడు ₹128 చేరుకుంది. దీంతో ఆర్థిక భారం పెరిగిపోయి ఖర్చులో తగ్గించుకోవాల్సి వచ్చింది. ఒక పూట భోజనం మానేయడం, పార్ట్ టైమ్ వెయిటర్ గా పని చేయడంతో దివ్యం శర్మ ఏడాదిలో 10 కేజీలు తగ్గాడు.
