Latest

కలెక్టర్‌కు జర్నలిస్టుల పిటిషన్..
Local· 27 Aug 2026

కలెక్టర్‌కు జర్నలిస్టుల పిటిషన్..

నాగర్‌కర్నూల్‌లో జర్నలిస్టులు తమ సమస్యలతో కలెక్టర్ ముందుకు వెళ్లారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు.

అది మిస్ కావొద్దు... MLA
Local· 27 Aug 2026

అది మిస్ కావొద్దు... MLA

‘‘SIR తో లక్షల ఓట్లు గల్లంతై పోతున్నాయ్.. మన దగ్గర అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దు’’ అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. భువనగిరిలో SIR (ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ) కార్యక్రమంపై BLA, BLOలతో MLA రివ్యూ మీటింగు జరిపారు. ప్రతి బూత్‌కు సంబంధించిన ఓటర్ల జాబితా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో తప్పకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, BLA, BLOలు పాల్గొన్నారు.

బ్యాంకుల్లో డబ్బు భారీగా పెరిగిందా?
National· 27 Aug 2026

బ్యాంకుల్లో డబ్బు భారీగా పెరిగిందా?

బ్యాంకుల్లో డబ్బు ఒక్కసారిగా ఎక్కువైపోయింది.. ఇప్పుడు ఈ అదనపు డబ్బును ఏం చేయాలన్నదే RBI ముందున్న ప్రశ్న. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు ₹3.4 లక్షల కోట్ల అదనపు డబ్బు ఉందని అంచనా. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరగొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో ఉన్న భారతీయులు బ్యాంకుల్లో పెట్టిన డాలర్ డిపాజిట్ల ప్రభావం కూడా దీనికి ఒక కారణం. అందుకే RBI ఈ అదనపు డబ్బును క్రమంగా వెనక్కి తీసుకునే మార్గాలపై ఫోకస్ పెట్టొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఆ ఎరువులపై రైతులకు అవగాహన.. కలెక్టర్ ఆదేశం
Local· 27 Aug 2026

ఆ ఎరువులపై రైతులకు అవగాహన.. కలెక్టర్ ఆదేశం

నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు – ‘‘నానో యూరియా, నానో డీఏపీ.. ఇవి రైతుల కోసం కొత్త టెక్ ఎరువులు. వీటిని వాడాలి. రైతులకు చెప్పాలి.’’ అని అధికారులను ఆదేశించారు.<br>గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ, కోరమాండల్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ఆఫీసర్లందరూ ఫీల్డులోకి వెళ్లిపోయి ఈ విషయాన్ని రైతులకు చెప్పాలన్నారు. రైతు బీమా, ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎఫ్ఎఫ్ఎస్ యాప్ పై కూడా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న Child Protestor ఆదిత్య
Current Affairs· 27 Aug 2026

ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న Child Protestor ఆదిత్య

బిహార్‌లో BPSC పరీక్షలపై విద్యార్థులు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న 6 ఏళ్ల ఆదిత్య కుమార్‌ను పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లిన వీడియో SMలో వైరల్ అయింది. సీఎం రాజీనామా డిమాండ్ చేస్తూ, పోలీసు చర్యలపై ప్రశ్నిస్తూ మాట్లాడిన ఆదిత్యను పోలీసులు దూరంగా తీసుకువెళ్లారు. అతణ్ని అరెస్ట్ చేయలేదని, పక్కకు తీసుకెళ్లామని వాళ్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆదిత్య Child Protestorగా మారాడు. ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న అతని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న AP ప్రజలు
Current Affairs· 27 Aug 2026

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న AP ప్రజలు

నేపాల్‌ వరదల్లో AP నుంచి వెళ్లిన కొంతమంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఏపీ ప్రభుత్వ అధికారులు వీరి వివరాలు భారత రాయబార కార్యాలయానికి అందజేశారు. గల్లంతైన లేదా చివరిసారిగా కనిపించినవారు..చొప్పరపు రమేశ్‌బాబు, అన్నందేవర వెంకట్రామ్, అన్నందేవర ఆనాఘ, బాలసుబ్రహ్మణ్యం, శశికుమార్ అట్లూరి, రాజ్యలక్ష్మి నిమ్మగడ్డ. వీళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. చిక్కుకున్నవారిలో భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు, అపర్ణ కాకాని సురక్షితంగా ఉన్నారు.

గుంతకల్లులో సైన్స్ టీచర్‌పై కత్తితో దాడి
Crime· 27 Aug 2026

గుంతకల్లులో సైన్స్ టీచర్‌పై కత్తితో దాడి

AP: అనంతపురం జిల్లా గుంతకల్లు టౌన్‌లోని చైతన్య ప్రైవేట్ స్కూల్ సైన్స్ టీచర్ ఈవూరి అరుణ(44)పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆమె స్కూల్‌కు వెళ్తున్న టైంలో ఈ దాడి జరిగింది. ఆమె మెడకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనతో స్కూల్ పరిసరాల్లో భయాందోళన నెలకొంది. గతంలో బ్లాక్‌మెయిల్ వివాదం ఉన్నందున ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నేపాల్‌లో వరదలు..తమిళనాడు, కేరళ, బెంగాల్ నుంచి ఎక్కువమంది
Current Affairs· 27 Aug 2026

నేపాల్‌లో వరదలు..తమిళనాడు, కేరళ, బెంగాల్ నుంచి ఎక్కువమంది

నేపాల్-టిబెట్ సరిహద్దులో వచ్చిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్‌లో 288 మంది భారతీయుల జాడ ఇంకా తెలియడం లేదు. వీళ్లలో కైలాస్ మానసరోవర్ యాత్రికులు, ట్రిషూలి-1 పవర్ ప్రాజెక్ట్ కార్మికులున్నారు. ఇందులో 73 మంది ఏ రాష్ట్రం వారనే వివరాలు అందుబాటులో లేవు. తమిళనాడు నుంచి 86 మంది, బెంగాల్ నుంచి 32 మంది, కేరళ నుంచి 33 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 61 మంది ఉన్నారు.

రైలు ప్రయాణికులకు Important Alert
National· 27 Aug 2026

రైలు ప్రయాణికులకు Important Alert

రైలు ప్రయాణికులకు Important Alert. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైలు బోగీల్లో చెత్త వేస్తే ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. చెత్త వేయడం, ఉమ్మివేయడం, రైల్వే ఆస్తులను పాడు చేయడం చేస్తే విధించే జరిమానాను రూ.500 నుంచి రూ.1,000కి పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 24న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వచ్చాయి. రైలు బోగీలు, రైల్వే స్టేషన్లలను పరిశుభ్రతను పెంచే లక్ష్యంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

నేపాల్‌లో 644 మంది గల్లంతు..ఈ దేశాల వాళ్లే!
Current Affairs· 27 Aug 2026

నేపాల్‌లో 644 మంది గల్లంతు..ఈ దేశాల వాళ్లే!

నేపాల్‌ వరదల్లో 33 దేశాలకు చెందిన 644 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ జాతీయ పర్యాటక బోర్డు చెప్పింది. వీళ్లలో 178 మంది భారతీయులున్నారు. మరో 127 మంది నేపాలీయులు, 517 మంది విదేశీయులు. వాళ్లు అమెరికా – 65, ఉక్రెయిన్ – 53, మలేషియా – 51, ఆస్ట్రేలియా – 35, యూకే – 33, కెనడా – 25. మరికొన్ని దేశాల నుంచి కూడా కొంతమంది గల్లంతయ్యారు.

3 వేల మంది విద్యార్థులతో చెకుముకి సైన్స్ పరీక్ష!
Local· 27 Aug 2026

3 వేల మంది విద్యార్థులతో చెకుముకి సైన్స్ పరీక్ష!

3000 మంది విద్యార్థులు.. ఒకేరోజు సైన్స్ టాలెంట్ టెస్ట్ రాశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, తడ దొరవారిసత్రం మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు రామ్మూర్తి, రాజేష్ బాబు, మస్తాన్ ఈ వివరాలు తెలిపారు. పాఠశాల స్థాయిలో గెలుపొందిన వారు సెప్టెంబర్ 11న జరిగే మండల స్థాయి పరీక్షలో పాల్గొనబోతున్నారు.

AI కోసం హైదరాబాద్‌లో పెద్ద ప్లాన్!
International· 27 Aug 2026

AI కోసం హైదరాబాద్‌లో పెద్ద ప్లాన్!

హైదరాబాద్‌లో ఏకంగా 9,000 NVIDIA రూబిన్ చిప్స్‌తో భారీ AI కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. గ్రీన్‌కో సంస్థ ప్రమోటర్లు ఏర్పాటు చేసిన AM Intelligence ఈ చిప్స్ కోసం ఆర్డర్ పెట్టింది. ఇవి వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో హైదరాబాద్‌కు రానున్నాయి. ఈ కేంద్రం కోసం 30 మెగావాట్ల సామర్థ్యాన్ని ఉపయోగించనున్నారు. మొత్తం AI మౌలిక వసతుల కోసం సంస్థ $8 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. ఇంత భారీ కంప్యూటింగ్ శక్తితో అత్యంత పెద్ద AI మోడళ్లను నడపడంతో పాటు, కొత్త తరం AI సేవలను కూడా అందించాలన్నది సంస్థ ప్లాన్.

ఒక్క నెలలో..60 మంది నవజాత శిశువులు మృతి
National· 27 Aug 2026

ఒక్క నెలలో..60 మంది నవజాత శిశువులు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆగస్టులో 60 నవజాత శిశువులు చనిపోయారు. ఇందులో 10 మంది ఆగస్టు రెండో వారంలోనే చనిపోయారు. 60 మందిలో 44 మంది ఇతర హాస్పిటల్స్ లేదా నర్సింగ్ హోమ్‌ల నుంచి క్రిటికల్ కండీషన్లలో ఇక్కడికి తీసుకొచ్చారు. మిగిలిన 16 మంది ఈ హాస్పిటల్లోనే పుట్టారు. వాళ్లు ఇక్కడికి రావడానికి ముందే అనారోగ్యంతో ఉన్నారని, అందుకే మరణించారని హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. జిల్లా అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి.

డిండి ప్రాజెక్టు అంశంపై అత్యవసర మీటింగ్
Local· 27 Aug 2026

డిండి ప్రాజెక్టు అంశంపై అత్యవసర మీటింగ్

TG: డిండి ప్రాజెక్టు అంశంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో సచివాలయంలో అత్యవసర మీటింగ్ నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రాజెక్టు ప్రాంతాలకు సాగునీటి సరఫరా, భూసేకరణ, దేవరకొండ, నల్గొండ ప్రాంతాలకు నీటి పంపిణీ అంశాలపై చర్చించారు. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఉల్లి ధరకు రెక్కలు... కారణాలు ఏంటంటే..
Local· 27 Aug 2026

ఉల్లి ధరకు రెక్కలు... కారణాలు ఏంటంటే..

శ్రీకాకుళం జిల్లాలో ఉల్లి ధరలు సామాన్యులతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం KG ఉల్లి రూ.55 నుంచి రూ.60కు చేరింది. జూన్‌లో రూ.25గా ఉన్న ధర 2 నెలల్లోనే డబలైంది. కర్నూలులో వానల్లేక పంట దెబ్బతినడం, దిగుబడి తగ్గడంతో గ్రామాలకు సరఫరా పడిపోయింది. దీంతో మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు sugar రేటు కూడా రూ.70కు చేరింది. దీంతో గృహిణులు, చిరు వ్యాపారులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర ధరలను నియంత్రించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చమురు దేశానికే పెట్రోల్ కష్టాలా?
International· 27 Aug 2026

చమురు దేశానికే పెట్రోల్ కష్టాలా?

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా.. ఇప్పుడు ఇండియా నుంచి పెట్రోల్ తెప్పించుకుంటోంది. కారణం యుక్రెయిన్ డ్రోన్ దాడులు. రష్యాలోని పలు ఆయిల్ రిఫైనరీలపై దాడులు జరగడంతో పెట్రోల్ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో కొరత, బంకుల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. జూన్, జూలైలో ఇండియా నుంచి రష్యాకు 10 లక్షల బ్యారెళ్లకు పైగా పెట్రోల్ వెళ్లినట్టు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. ఇండియా నుంచి రష్యా పెట్రోల్ దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి అని రిపోర్టులు చెబుతున్నాయి.

CPI సీనియర్ నాయకురాలు ప్రమీల మృతి.. నేతల నివాళి
Local· 27 Aug 2026

CPI సీనియర్ నాయకురాలు ప్రమీల మృతి.. నేతల నివాళి

గోదావరిఖనిలో CPI, AITUC సీనియర్ నాయకురాలు ప్రమీల అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు. ఆమె సీనియర్ నాయకుడు కోండ్ర సత్యనారాయణ భార్య. CPI, AITUC నాయకులు, కార్యకర్తలు ప్రమీల పార్థీవ దేహంపై అరుణ పతాకం కప్పి, పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. నివాళులర్పించినవారిలో CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గౌతం గోవర్ధన్, AITUC కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్.ప్రకాశ్, కేంద్ర కార్యదర్శి కందుకూరి రాజారత్నం, నగర కార్యదర్శి కనకరాజ్, ప్రజానాట్య మండలి నాయకులు తదితరులు ఉన్నారు.

అదుపుతప్పి బావిలో పడ్డ కారు... మహిళ మృతి
Local· 27 Aug 2026

అదుపుతప్పి బావిలో పడ్డ కారు... మహిళ మృతి

కారు అదుపుతప్పి నీరు లేని వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.. వివరాల మేరకు సైదాపూర్ మండలం, బొమ్మకల్ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి, కిరణ్, ఏలూరి రాధ, వీరారెడ్డి కలిసి పోతారంలోని శుభం గార్డెన్లో పెళ్లికి వెళ్లి వస్తుండగా, మంగళపల్లి శివారులోని తోట దగ్గర రోడ్ పక్కన ఉన్న బావిలో కారు అదుపుతప్పి పడింది.. రాధ అక్కడే మృతి చెందగా, మిగతా వారికి గాయాలయ్యాయి... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మణుగూరులో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
Local· 27 Aug 2026

మణుగూరులో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణం చోటుచేసుకుంది. సుమారు 30-40 మంది యువకులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు యువకులపై సుమారు 30 మంది దాడి చేయగా, శివ (25) అనే యువకుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆటో డ్రైవర్ చేసిన సాయం!
Motivational· 27 Aug 2026

ఆటో డ్రైవర్ చేసిన సాయం!

బెంగళూరులో ఓ మహిళ స్కూటీ మధ్యలోనే ఆగిపోయింది.. ఏం చేయాలో తెలియక రోడ్డుపై ఇబ్బంది పడుతుండగా, పక్కనే వెళ్తున్న ఆటో డ్రైవర్ తంజీమ్ ఆమెకు సాయం చేయడానికి ఆగాడు. తన ఆటోతో పాటు స్కూటీని నెమ్మదిగా ముందుకు నెట్టుకుంటూ దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఆమెకు తోడుగా వెళ్లాడు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. డబ్బులు తీసుకోకుండా ఓ అపరిచితురాలికి ఇలా సాయం చేసిన తంజీమ్‌ను చూసి నెటిజన్లు.. “ఇంకా మనుషుల్లో మంచితనం ఉంది” అంటూ ప్రశంసిస్తున్నారు.

డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో లక్కీ డ్రా పేరిట కొత్త ట్విస్ట్
Local· 27 Aug 2026

డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో లక్కీ డ్రా పేరిట కొత్త ట్విస్ట్

మందమర్రిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అలకేషన్లో రోజుకో ట్విస్ట్. అర్హుల జాబితాలో అక్రమాలు బయట పడగానే అధికారులు కొత్త డ్రామాకు తెరతీశారట. ఇదుగో అర్హుల జాబితా అంటూ ఒక లిస్ట్ చూపెట్టారు. లక్కీ డ్రా ద్వారా ఇస్తామన్నారు. ట్విస్ట్ ఏంటంటే 2daysలోనే అర్హుల జాబితా 447 నుంచి 491కి పెరిగింది. ఇంకా షాకింగ్ విషయం – ఈ లక్కీ డ్రాలో బీసీలను జనరల్ లిస్టులో చేర్చారు. పెళ్లి కాని వారు, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులు, రేషన్ కార్డు కూడా లేని వారికి ఇళ్లు కేటాయిస్తున్నారు. పారదర్శకత కావాలన్నది ప్రజల డిమాండ్..