Latest

3 వేల మంది విద్యార్థులతో చెకుముకి సైన్స్ పరీక్ష!
3000 మంది విద్యార్థులు.. ఒకేరోజు సైన్స్ టాలెంట్ టెస్ట్ రాశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, తడ దొరవారిసత్రం మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు రామ్మూర్తి, రాజేష్ బాబు, మస్తాన్ ఈ వివరాలు తెలిపారు. పాఠశాల స్థాయిలో గెలుపొందిన వారు సెప్టెంబర్ 11న జరిగే మండల స్థాయి పరీక్షలో పాల్గొనబోతున్నారు.

AI కోసం హైదరాబాద్‌లో పెద్ద ప్లాన్!
హైదరాబాద్‌లో ఏకంగా 9,000 NVIDIA రూబిన్ చిప్స్‌తో భారీ AI కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. గ్రీన్‌కో సంస్థ ప్రమోటర్లు ఏర్పాటు చేసిన AM Intelligence ఈ చిప్స్ కోసం ఆర్డర్ పెట్టింది. ఇవి వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో హైదరాబాద్‌కు రానున్నాయి. ఈ కేంద్రం కోసం 30 మెగావాట్ల సామర్థ్యాన్ని ఉపయోగించనున్నారు. మొత్తం AI మౌలిక వసతుల కోసం సంస్థ $8 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. ఇంత భారీ కంప్యూటింగ్ శక్తితో అత్యంత పెద్ద AI మోడళ్లను నడపడంతో పాటు, కొత్త తరం AI సేవలను కూడా అందించాలన్నది సంస్థ ప్లాన్.

ఒక్క నెలలో..60 మంది నవజాత శిశువులు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆగస్టులో 60 నవజాత శిశువులు చనిపోయారు. ఇందులో 10 మంది ఆగస్టు రెండో వారంలోనే చనిపోయారు. 60 మందిలో 44 మంది ఇతర హాస్పిటల్స్ లేదా నర్సింగ్ హోమ్‌ల నుంచి క్రిటికల్ కండీషన్లలో ఇక్కడికి తీసుకొచ్చారు. మిగిలిన 16 మంది ఈ హాస్పిటల్లోనే పుట్టారు. వాళ్లు ఇక్కడికి రావడానికి ముందే అనారోగ్యంతో ఉన్నారని, అందుకే మరణించారని హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. జిల్లా అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి.

డిండి ప్రాజెక్టు అంశంపై అత్యవసర మీటింగ్
TG: డిండి ప్రాజెక్టు అంశంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో సచివాలయంలో అత్యవసర మీటింగ్ నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రాజెక్టు ప్రాంతాలకు సాగునీటి సరఫరా, భూసేకరణ, దేవరకొండ, నల్గొండ ప్రాంతాలకు నీటి పంపిణీ అంశాలపై చర్చించారు. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఉల్లి ధరకు రెక్కలు... కారణాలు ఏంటంటే..
శ్రీకాకుళం జిల్లాలో ఉల్లి ధరలు సామాన్యులతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం KG ఉల్లి రూ.55 నుంచి రూ.60కు చేరింది. జూన్‌లో రూ.25గా ఉన్న ధర 2 నెలల్లోనే డబలైంది. కర్నూలులో వానల్లేక పంట దెబ్బతినడం, దిగుబడి తగ్గడంతో గ్రామాలకు సరఫరా పడిపోయింది. దీంతో మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు sugar రేటు కూడా రూ.70కు చేరింది. దీంతో గృహిణులు, చిరు వ్యాపారులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర ధరలను నియంత్రించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చమురు దేశానికే పెట్రోల్ కష్టాలా?
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా.. ఇప్పుడు ఇండియా నుంచి పెట్రోల్ తెప్పించుకుంటోంది. కారణం యుక్రెయిన్ డ్రోన్ దాడులు. రష్యాలోని పలు ఆయిల్ రిఫైనరీలపై దాడులు జరగడంతో పెట్రోల్ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో కొరత, బంకుల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. జూన్, జూలైలో ఇండియా నుంచి రష్యాకు 10 లక్షల బ్యారెళ్లకు పైగా పెట్రోల్ వెళ్లినట్టు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. ఇండియా నుంచి రష్యా పెట్రోల్ దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి అని రిపోర్టులు చెబుతున్నాయి.

CPI సీనియర్ నాయకురాలు ప్రమీల మృతి.. నేతల నివాళి
గోదావరిఖనిలో CPI, AITUC సీనియర్ నాయకురాలు ప్రమీల అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు. ఆమె సీనియర్ నాయకుడు కోండ్ర సత్యనారాయణ భార్య. CPI, AITUC నాయకులు, కార్యకర్తలు ప్రమీల పార్థీవ దేహంపై అరుణ పతాకం కప్పి, పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. నివాళులర్పించినవారిలో CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గౌతం గోవర్ధన్, AITUC కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్.ప్రకాశ్, కేంద్ర కార్యదర్శి కందుకూరి రాజారత్నం, నగర కార్యదర్శి కనకరాజ్, ప్రజానాట్య మండలి నాయకులు తదితరులు ఉన్నారు.

అదుపుతప్పి బావిలో పడ్డ కారు... మహిళ మృతి
కారు అదుపుతప్పి నీరు లేని వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.. వివరాల మేరకు సైదాపూర్ మండలం, బొమ్మకల్ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి, కిరణ్, ఏలూరి రాధ, వీరారెడ్డి కలిసి పోతారంలోని శుభం గార్డెన్లో పెళ్లికి వెళ్లి వస్తుండగా, మంగళపల్లి శివారులోని తోట దగ్గర రోడ్ పక్కన ఉన్న బావిలో కారు అదుపుతప్పి పడింది.. రాధ అక్కడే మృతి చెందగా, మిగతా వారికి గాయాలయ్యాయి... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మణుగూరులో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణం చోటుచేసుకుంది. సుమారు 30-40 మంది యువకులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు యువకులపై సుమారు 30 మంది దాడి చేయగా, శివ (25) అనే యువకుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆటో డ్రైవర్ చేసిన సాయం!
బెంగళూరులో ఓ మహిళ స్కూటీ మధ్యలోనే ఆగిపోయింది.. ఏం చేయాలో తెలియక రోడ్డుపై ఇబ్బంది పడుతుండగా, పక్కనే వెళ్తున్న ఆటో డ్రైవర్ తంజీమ్ ఆమెకు సాయం చేయడానికి ఆగాడు. తన ఆటోతో పాటు స్కూటీని నెమ్మదిగా ముందుకు నెట్టుకుంటూ దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఆమెకు తోడుగా వెళ్లాడు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. డబ్బులు తీసుకోకుండా ఓ అపరిచితురాలికి ఇలా సాయం చేసిన తంజీమ్‌ను చూసి నెటిజన్లు.. “ఇంకా మనుషుల్లో మంచితనం ఉంది” అంటూ ప్రశంసిస్తున్నారు.

డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో లక్కీ డ్రా పేరిట కొత్త ట్విస్ట్
మందమర్రిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అలకేషన్లో రోజుకో ట్విస్ట్. అర్హుల జాబితాలో అక్రమాలు బయట పడగానే అధికారులు కొత్త డ్రామాకు తెరతీశారట. ఇదుగో అర్హుల జాబితా అంటూ ఒక లిస్ట్ చూపెట్టారు. లక్కీ డ్రా ద్వారా ఇస్తామన్నారు. ట్విస్ట్ ఏంటంటే 2daysలోనే అర్హుల జాబితా 447 నుంచి 491కి పెరిగింది. ఇంకా షాకింగ్ విషయం – ఈ లక్కీ డ్రాలో బీసీలను జనరల్ లిస్టులో చేర్చారు. పెళ్లి కాని వారు, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులు, రేషన్ కార్డు కూడా లేని వారికి ఇళ్లు కేటాయిస్తున్నారు. పారదర్శకత కావాలన్నది ప్రజల డిమాండ్..

PRC నివెంటనే ప్రకటించాలి
PRC నివెంటనే ప్రకటించాలని TGE JAC ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించారు. CPS విధానా న్ని రద్దు చేసి, OPS విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. పెండింగ్‌లో ఉన్న డీఏలతోపాటు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని కెోరారు.

Acting Chief Justiceని మార్చాలని..సుప్రీం జడ్జి లెటర్స్
రాజస్థాన్ హైకోర్టు Acting Chief Justice జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మను బదిలీ చేయాలని CJI సూర్యకాంత్‌కు సుప్రీం కోర్టు జడ్జి సందీప్ మెహతా ఏకంగా మూడు లెటర్స్ రాయడం ప్రస్తుతం చర్చగా మారింది. Acting Chief Justiceలో నాయకత్వ లక్షణాలు లేవని, కేసులు అనవసరంగా తన బెంచ్‌కు మార్చుకుంటున్నారని ఆ లెటర్స్‌లో ఆయన వివరించారు. హైకోర్టు గెస్ట్‌హౌస్ కోసం అవసరం లేకుండా పెద్ద భవనం నిర్మించాలని ప్లాన్ చేసి ప్రజా డబ్బు వేస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ శర్మ గత ఏడాది సెప్టెంబర్ నుంచి యాక్టింగ్ చీఫ్‌గా ఉన్నారు.

మల్కాపూర్ తండాలో SIR ఓటర్ నివేదిక
నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండా పరిధిలో SIR ఓటర్ నివేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ పార్టీల BLAలతోపాటు BRS నాయకులు కేతావత్ గంగారాం నాయక్, బానోత్ గోపాల్ నాయక్, విశ్లావత్ అరవింద్, విశ్లావత్ రమేష్ నాయక్ పాల్గొన్నారు. ఓటరు జాబితాపై చర్చించి, వివరాలను పరిశీలించారు.

ప్రమాద బాధితులను ఆదుకోవాలి: విడదల రజిని
AP: చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం, పలువురు గాయపడటంపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆమె, ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రూ.22,006 కోట్లు అప్పులు..రూ.6.5 కోట్లకు ఫైనల్
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రా Personal Insolvency కేసులో జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్ కీలక ఆర్డర్ ఇచ్చింది. రూ.22,006.57 కోట్ల లోన్లలో సుభాష్ రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తారని చెప్పింది. ఎస్సెల్ గ్రూప్ కంపెనీల కోసం సుభాష్ పర్సనల్ గ్యారంటీ ఇచ్చారు. లోన్స్ తీర్చకపోవడంతో అప్పులిచ్చినవాళ్లు 2024లో పిటిషన్ వేశారు. విచారించిన ట్రిబ్యూనల్ ఈ తీర్పు ఇచ్చింది. ఇది చాలా తక్కువ మొత్తం అని అభ్యంతరపెట్టినా,‘బ్యాంక్‌రప్ట్‌సీలోకి పంపితే ఇంకా తక్కువ రావచ్చు’ అని ట్రిబ్యునల్ ఈ అమౌంట్‌ని ఫైనల్ చేసింది.

శనివారం ప్రత్యేకం..కలెక్టర్ ఆఫీసులో SC, ST దివ్యాంగుల కోసం!
గుంటూరు కలెక్టర్ CM.సాయికాంత్ వర్మ ఒక కొత్త మెసేజీ ఇచ్చారు. ఈ శనివారం (ఉదయం 10 గంటలకు) కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు.
ఎవరికి?
✅ దివ్యాంగులు
✅ ఎస్సీ, ఎస్టీలు
✅ ఉద్యోగులు
జిల్లా అధికారులంతా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, ఉద్యోగులు తమకున్న ప్రత్యేక సమస్యలను నేరుగా అధికారుల ముందుంచే సువర్ణ అవకాశమిది. ఉపయోగించుకోవాలి మరి.

ఫేక్ డాక్టర్లపై పోలీసుల ఫోకస్.. 12 మంది అరెస్ట్!
TG: ఫేక్ డాక్టర్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. అర్హతలు, బేసిక్ హెల్త్ నాలెడ్జ్ లేకుండానే అసలైన డాక్టర్లలా నటిస్తూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తున్న 12 మందిని గుర్తించి యాక్షన్ తీసుకున్నామని తెలిపారు. ఇలాంటి ట్రీట్‌మెంట్ వల్ల ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందన్నారు. ఫేక్ డాక్టర్ల గురించి తెలిస్తే వెంటనే 112కు లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సజ్జనార్ కోరారు.

విశాఖలో సామాజిక శంఖారావం
AP: దళితుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సామాజిక శంఖారావంలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద KVPS, CITU, AIDWA, DYFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దళిత కాలనీలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల రోజులుగా విశాఖ నగరంలోని వివిధ దళిత వాడల్లో ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు సర్వే నిర్వహించి అనేక సమస్యలను గుర్తించారు. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా దళిత కాలనీల్లో కుల వివక్ష కొనసాగుతుండటం దురదృష్టకరమని నాయకులు అన్నారు.

అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలి
మక్తల్ పట్టణానికి చెందిన మహిళపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. మక్తల్ ప్రాంతంలో విచ్చలవిడిగా టీ/కాఫీ దుకాణాలలో నడుస్తున్న బెల్టు షాపుల దందాను, అక్రమ గంజాయి రవాణా వంటి వాటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళపై జరిగిన అత్యాచారానికి పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు
అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బ్రహ్మకుమారీలు కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.