Latest

స్కూళ్లలో జంక్ ఫుడ్ బ్యాన్ చేయాలి
AP : పిల్లల హెల్త్, కాన్సంట్రేషన్ కాపాడేందుకు స్కూళ్లలో జంక్ ఫుడ్‌ను బ్యాన్ చేయాలని ‘ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రభుత్వాన్ని కోరింది. స్కూల్ క్యాంటీన్లలో అన్‌హెల్దీ ఫుడ్‌ను బ్యాన్ చేసి, న్యూట్రిషన్ వివరాలు ఉండే లేబుల్స్ పెట్టాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలని, విలేజ్ స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంతో పాటు డిజిటల్ ప్రెజర్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

మంగళగిరిలో మోడల్ రైతు బజార్
AP : మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఒక సూపర్ మోడల్ రైతు బజార్ రాబోతోంది. ఇందులో రైతులు తమ కూరగాయలు, పండ్లను డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు. ఈ మార్కెట్‌లో 102 కూరగాయల స్టాళ్లు, 54 పండ్లు-పూల స్టాళ్లతో పాటు హోల్‌సేల్ షాపులు, కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మంచి ఇన్కమ్, నిల్వ చేసుకునే ఛాన్స్ దక్కుతాయి. ఆగష్టు 27న ఈ మోడల్ మార్కెట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.

AIKMS చిత్తూరు జిల్లా కొత్త కమిటీ ఎంపిక
AP : పలమనేరులో AIKMS ఏపీ రైతు కూలీ సంఘం చిత్తూరు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉమాపతి నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజ కల్లూరు, ప్రధాన కార్యదర్శిగా వెంకటరమణారెడ్డిలతో పాటు ఇతర నాయకులు ఎంపికయ్యారు. వానలు లేక టమాటా, మామిడి పంటలు నష్టపోయిన రైతుల తరఫున పోరాడాలని నాయకులు అన్నారు. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.

నటి కంప్లైంట్‌తో డైరెక్టర్ 'పవన్ సాధినేని' అరెస్ట్
టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేనిపై ఓ నటి ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశారంటూ ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు పవన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరోవైపు, పవన్ ప్రస్తుతం మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా తీస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ అరెస్ట్ కావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

‘రాళ్లు కరిగే వేళ’ – కథల పుస్తకం
కన్నడ రచయిత, జర్నలిస్టు పి.లంకేశ్ రాసిన ‘కల్లు కరగువ సమయ’ పుస్తకాన్ని రంగనాథ రామచంద్రరావు ‘రాళ్లు కరిగే వేళ’ పేరుతో తెలుగులోకి అనువదించారు. దీన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. కర్ణాటకలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను ఈ కథలు చూపిస్తాయి. ఈ కథల్లోని స్త్రీ క్యారెక్టర్స్‌ని ఆయన చాలా బలంగా తీర్చిదిద్దారు. సమాజంలో ఉండే మోసాన్ని, మనసులో నలిగే నైతిక పోరాటాలను తట్టుకుంటూ ఆ పాత్రలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఇందులో చూడవచ్చు. పుస్తకం ధర రూ.100. కొనే <a href="https://www.logili.com/books/rallu-karige-vela-p-lankesh/p-7488847-66401946654-cat.html#variant_id=7488847-66401946654">లింక్</a>.

చేతివృత్తిదారుల సమస్యలు తీర్చాలి
AP : చిత్తూరు జిల్లా పలమనేరులో చేతివృత్తిదారుల సమస్యలపై CPI నాయకులు పి.రఘు, ఎస్.నాగరాజు కరపత్రాలు విడుదల చేశారు. ఆగస్టు 29న కలెక్టరేట్ వద్ద జరిగే నిరసనను సక్సెస్ చేయాలని కోరారు. చేతివృత్తిదారుల కోసం ప్రత్యేక మినిస్ట్రీ పెట్టాలని, బడ్జెట్‌లో ఫండ్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ.5 లక్షల లోన్‌పై 50% సబ్సిడీ ఇవ్వాలని, 50 ఏళ్లు దాటిన వారికి రూ.6 వేల పెన్షన్, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

23 రోజుల తర్వాత దొరికిన ఏడుగురు జాలర్లు!
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 23 రోజులుగా గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల(Fishermen) ఆచూకీ దొరికింది. ఈ నెల 3న ఓడరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు.. వెస్ట్ బెంగాల్‌లో సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. వారి బోటు కూడా అక్కడే లభ్యమైంది. 23 రోజుల తర్వాత సమాచారం రావడంతో ఫామిలీ మెంబెర్స్ ఊపిరి పీల్చుకున్నారు. రేపు సాయంత్రానికి మత్స్యకారులు ఓడరేవుకు చేరుకోనున్నారు.

✈️Flight లో పక్క సీటు చూసి మైండ్ బ్లాక్
అనుకోకుండా మన ఫేవరెట్ స్టార్ పక్కన కూర్చునే ఛాన్స్ వస్తే ఆ కిక్కే వేరు కదా! 'అల్లూరి', 'ఫంకీ' సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కయాదు లోహర్‌కి అలాంటి లక్ దొరికింది. రీసెంట్‌గా ఫ్లైట్ ఎక్కిన ఆమెకు, పక్క సీటులో సూపర్ స్టార్ రజినీకాంత్ ఉండడంతో షాక్ అయ్యింది. రజినీతో సెల్ఫీ దిగి 'నేను ఇంకా కలగంటున్నట్లే ఉంది! ఆయనను చూడగానే నా మైండ్‌లో 'సుందరి' పాట మోగడం స్టార్ట్ అయింది. ఫ్యూచర్‌లో ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తే ఇంకా బాగుంటుంది' అంటూ తన Instagramలో పోస్ట్ చేసింది.
తిరుపతిలో కుప్పకూలిన 4 అంతస్తుల బిల్డింగ్
AP: తిరుపతిలోని RC రోడ్డు వద్ద నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పక్కనే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం గుంతలు తవ్వుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. భవనం పైన ఉన్న సెల్ టవర్ కూడా కూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కరెంట్ పోల్స్ విరిగిపోగా, పక్కనే ఉన్న షాపులు డ్యామేజ్ అయ్యాయి. ఆ టైమ్‌లో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అధికారులు కారణాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

AI వల్ల భారీగా ఉద్యోగాల కోతలు? బిల్ గేట్స్ వార్నింగ్!
AI చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది ఇతర టెక్నాలజీ విప్లవాల కంటే పూర్తిగా డిఫరెంట్ టెక్నాలజీ అని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ హెచ్చరించారు. ప్రభుత్వాలు ఇప్పటి నుంచే అలర్ట్ కాకపోతే ఫ్యూచర్‌లో భారీ స్థాయిలో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా AI కోడింగ్ క్యాపబిలిటీస్ తనను షాక్‌కు గురిచేశాయని చెప్పారు. AIని కంట్రోల్ చేసేందుకు దేశాల మధ్య గ్లోబల్ అగ్రిమెంట్స్ అవసరమని సూచించారు.
నేపాల్‌లో భారీ Flash Floods.. 105 మంది ఇండియన్స్ మిస్సింగ్!
నేపాల్‌లోని రాసువా జిల్లాలో ఈరోజు ఒక్కసారిగా భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. టిబెట్ వైపు నుంచి వచ్చిన నీరు భోటేకోషి నదిలో ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలు, రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. ఈ వరదలలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా, 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. దీంతో బీహార్ బోర్డర్‌లోని జిల్లాలకు హైఅలెర్ట్ ప్రకటించారు.

సినిమా పేర్లలో కొత్త ట్రెండ్
టాలీవుడ్‌లో సినిమా టైటిల్స్ విషయంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. పెద్ద పెద్ద పేర్ల కంటే, కేవలం రెండు అక్షరాలు ఉండే ‘షార్ట్ అండ్ స్వీట్’ టైటిల్స్‌పైనే డైరెక్టర్లు, హీరోలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్న పేర్లు క్యాచీగా ఉండటంతో పాటు జనాలు, ముఖ్యంగా యూత్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్లకు కూడా ఇవి బాగా సెట్ అవుతున్నాయి. ఇటీవల చిన్న టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టడంతో, స్టార్ హీరోలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

కూతురు కోసం పోరాడే తల్లి
బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘గాంధారి’. ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో తాప్సీ కంటిచూపు లేని తల్లి పాత్రలో కనిపించనుంది. కిడ్నాప్‌కు గురైన తన కూతురిని కాపాడుకోవడానికి, చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాపై ఆ తల్లి ఎలాంటి పోరాటం చేసిందనేదే ఈ సినిమా కథ. ఇందులో ఇష్వాక్ సింగ్, జతిన్ సర్నా కీలక పాత్రల్లో నటించారు. దేవాశిష్ మఖీజా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం, సెప్టెంబర్ 3 నుంచి డైరెక్ట్‌గా Netflix లో స్ట్రీమింగ్ కానుంది.

కొత్తపేటలో మదర్ థెరీసా జయంతి
AP : కోనసీమ జిల్లా కొత్తపేట విద్యా బాల మందిర్ స్కూల్లో మదర్ థెరీసా 116వ జయంతి వేడుకలు జరిగాయి. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామోజు శేఖర్ థెరీసా అనాథలకు, రోగులకు చేసిన సేవల గురించి స్టూడెంట్స్‌కి వివరించారు. 10 క్లాస్ స్టూడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని 50 మంది పేషెంట్లకు పాలు, పండ్లు, బ్రెడ్ పంచారు. ఈ ప్రోగ్రామ్‌లో HM శివరత్నం, సుధాకర్, హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు.

స్మార్ట్ ఫోన్ సైబర్ సెక్యూరిటీపై రీసెర్చ్
హైదరాబాద్‌లోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లో CSE బ్రాంచ్ కి చెందిన కోక విజయ్ PHD సాధించారు. మనం ఫోన్‌లో యాప్స్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత జరిగే సైబర్ ఎటాక్స్‌ను ఎలా గుర్తించాలి? వాటి తీవ్రతను ఎలా తగ్గించాలి? అనే అంశంపై ఆయన స్టడీ చేసి తన రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశారు. స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీని పెంచేలా ఆయన చేసిన ఈ పరిశోధనకు గానూ డాక్టరేట్ లభించింది.

🎓 బాలికలకు ₹1.5 లక్షల స్కాలర్‌షిప్.. ఇదిగో ఛాన్స్!
చదువులో టాలెంట్ ఉండి, ఫీజుల విషయంలో ఇబ్బంది పడుతున్న అమ్మాయిలకు <a href="https://www.kotakeducationfoundation.org/kotak-kanya-scholarship">Kotak Kanya Scholarship</a> 2026-27 గుడ్ న్యూస్. 12వ తరగతిలో కనీసం 75 శాతం మార్కులు, ఫామిలీ Annual Income రూ. 6 లక్షల లోపు ఉండాలి. Engineering, MBBS, Architecture, Design, Integrated LLB వంటి కోర్సుల్లో ఫస్ట్ ఇయర్‌లో చేరిన వారికి ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. ఫీజులు, హాస్టల్, ల్యాప్‌టాప్, పుస్తకాలు వంటి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. <a href="https://www.kotakeducationfoundation.org/kotak-kanya-scholarship">అప్లికేషన్</a> లాస్ట్ డేట్ 15 అక్టోబర్ 2026. Govt., Private స్టూడెంట్స్ ఇద్దరూ అర్హులే.

2000 ఏళ్ల నాటి సీక్రెట్ హిస్టరీ
AP : అమరావతి తుళ్లూరు దగ్గరున్న వడ్డమాను 'పెద కొండ' ప్రజలను ఆకట్టుకుంటోంది. అక్కడ 2000 ఏళ్ల నాటి ఇటుకల కట్టడాలు ఇప్పటికీ టూరిస్టులను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. 40 ఏళ్ల క్రితమే ఇక్కడ ఆర్కియాలజీ తవ్వకాలు జరిపారు. అందులో అప్పటి బౌద్ధ స్తూపాలు, పిల్లర్స్, ప్రదక్షిణ రూట్స్, పాత కాయిన్స్, మట్టి పాత్రలు బయటపడ్డాయి. మన ప్రాచీన అమరావతి హిస్టరీకి ఇది ఒక మైలురాయి.

పెద్దవంగరలో యూత్ కాంగ్రెస్ కు సురేష్ నాయక్ దిశా నిర్దేశం
పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలంలో యువజన కాంగ్రెస్ మండల కార్యవర్గ సమావేశం హరి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్ హాజరై ఏం చేయాలో చెప్పారు. "కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేలా ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలి" అని డైరెక్ట్గా సూచించారు. గ్రామస్థాయి నుంచి యూత్ కాంగ్రెస్ను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం తోడ్పడుతుందనిఇక్కడి కార్యకర్తలు ఫీలవుతున్నారు.

ఫండ్స్ పక్కదారి..
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో రూ.1.50 లక్షల ఫండ్స్ పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ నరసింహారావు, స్టాఫ్ అసిస్టెంట్ కనకరాజు ఈ నిధులు దోచేశారని గ్రామస్తులు చెప్తున్నారు. ఫిర్యాదులు రావడంతో జిల్లా సహకార బ్యాంక్ అధికారులు స్పందించి వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. తప్పు రుజువైతే ముందుగా ఆ డబ్బును రికవరీ చేసి, ఆపై యాక్షన్ తీసుకోనున్నారు. ఈ ఘటనపై పూర్తి ఎంక్వైరీ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఏళ్లు గడిచినా కాంట్రాక్టే.. నల్లబ్యాడ్జీలతో నర్సుల నిరసన
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, బూరుగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్టు నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 🚨 వారి డిమాండ్ స్పష్టంగా ఉంది – ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలి. అంతవరకూ 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ⚕️ ఈ నెల 27 వరకు నల్లబ్యాడ్జీతోనే విధులు. అనంతరం విధుల బహిష్కరణకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు.<br>ఏళ్లు గడుస్తున్నాయి. కానీ కాంట్రాక్టులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి డిమాండ్లను పరిశీలించాలి.

క్లోరినేషన్ తర్వాతే నీటి సరఫరా.. కమిషనర్ స్పష్టం
AP: గుంటూరు జిల్లా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి రంగులో స్వల్ప మార్పు కనిపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గోదావరి జలాలు కృష్ణానదిలో కలవడం వల్ల నీటిరంగులో మార్పు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని క్లోరినేషన్ చేసి, శుద్ధిచేసిన అనంతరమే ప్రజలకు సరఫరా చేస్తున్నామని కమిషనర్ స్పష్టంచేశారు. మరోవైపు పలు ప్రాంతాల్లో పైపులైన్ లీకేజీలు కూడా నీటి నాణ్యతపై ప్రభావం చూపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు ముందుజాగ్రత్తగా నీటిని కాచి, చల్లార్చుకున్న తర్వాతే తాగాలని సూచించారు.