Latest

లారీ డ్రైవర్‌పై దాడిని ఖండిస్తూ భీమవరంలో ఆందోళన
AP: విశాఖపట్నంలో లారీ డ్రైవర్‌పై RTO అధికారులు చేసిన దాడిని ఖండిస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా అనుబంధ పరిశ్రమల వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. డ్రైవర్లపై అధికారులు దాడులకు పాల్పడటం సరికాదని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్లతో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

SBIలో 9,124 ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఈనెల 31
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులకు <a href="https://sbi.bank.in/webfiles/uploads/files_2627/08/JA_2026_Detailed_Advt_Eng.pdf">నోటిఫికేషన్ </a>విడుదలైంది. మొత్తం 9,124 పోస్టులు ఉండగా, 7,680 రెగ్యులర్ వేకెన్సీస్, 1,444 బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈనెల 11 నుంచి అప్లికేషన్స్ మొదలవగా, 31న ముగుస్తాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తిచేసిన వారు అర్హులు. 20 నుంచి 28 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జనరల్, OBC, EWS కాండిడేట్స్‌కు ఫీజు రూ.750 ఉంటుంది. SC/ST/PwBD వారికి ఎటువంటి ఫీజు లేదు. <a href="https://ibpsreg.ibps.in/sbijajul26/">Application Link</a>

రాష్ట్ర సంక్షేమ కమిటీ సభ్యురాలిగా ఎమ్కెల్యే రాగమయి
TG: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అసెంబ్లీలో ఆమె కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. కమిటీ చైర్‌పర్సన్‌గా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నియమితులయ్యారు. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై కమిటీ పనిచేయనుంది.
వెలిగొండ పనుల్లో స్పీడ్ పెంచాలి: మంత్రి నిమ్మల
AP: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద ఈ నెల 31న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో పనులు వేగం పుంజుకున్నాయి. ఫీడర్ కెనాల్‌లలో మిగిలిన పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. కెనాల్‌లలో ఏర్పాటు చేసిన నాలుగు గేట్లను పరిశీలించిన మంత్రి, సీఎం జలహారతి ఇచ్చే ప్రాంతంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవానికి రెండు రోజుల ముందుగానే పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

డ్యూటీలో మాత్రమే కుర్చీ.. ఇంటికి వెళ్తే మళ్లీ నేలే!
రాజస్థాన్‌లోని బాన్స్‌వారా జిల్లా గ్రామాల్లో మగవారు ఉన్న చోట మహిళలు కుర్చీ లేదా మంచంపై కూర్చోకూడదనే కట్టుబాటు ఇంకా ఉంది. ఎంత వయసొచ్చినా, ఆరోగ్య సమస్యలున్నా వీరు నేలపైనే కూర్చోవాలి. అయితే ఉపాధి హామీ పథకం ద్వారా సూపర్‌వైజర్లుగా మారిన మహిళలకు ప్రభుత్వం వర్క్ ప్లేస్‌లో అటెండెన్స్, రికార్డుల కోసం ఒక ప్లాస్టిక్ కుర్చీ కేటాయించింది. పని చేసే కొద్ది గంటలు వారు కుర్చీలో కూర్చుని పురుషులతో సమానంగా స్వేచ్ఛను అనుభవిస్తున్నా, సాయంత్రం ఇంటికి వెళ్లగానే మళ్లీ పాత పద్ధతిలోనే నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది.

మోతె చెరువులో మొసలి కలకలం
TG: జగిత్యాల పట్టణ శివారులోని మోతె చెరువులో మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువు వద్దకు వెళ్లిన స్థానికులకు నీటిలో మొసలి కనిపించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద నీటి ప్రవాహంతో మొసలి చెరువులోకి చేరి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం మొసలి చెరువులోనే సంచరిస్తుండటంతో చుట్టుపక్కల ప్రజలు అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారు. అటవీ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మొసలిని సురక్షితంగా పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

తమిళనాడుకు తరలిస్తున్న గంజాయి పట్టివేత
AP: ఒడిశాలోని పర్లాకిమిడి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 32.590 కిలోల గంజాయిని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 16 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ టి. భవాని తెలిపారు. మొత్తం నలుగురు నిందితుల్లో ఒకరిని CICL (Child in Conflict with the Law) గా గుర్తించారు. రూ.80 వేలకు గంజాయిని కొనుగోలు చేసి బస్సులో కాశీబుగ్గకు చేరుకున్నారు. అనంతరం పలాస రైల్వేస్టేషన్ వైపు వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
TG: హన్మకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మరిజె అనిత లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉందన్నారు. గ్రామంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

గన్నెల గ్రామంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
AP: ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామ సచివాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ, తాగునీరు, విద్యుత్, పింఛన్లు తదితర అంశాలపై మొత్తం 64అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని అధికారులు వెంటనే పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

ప్రవక్త బోధనలు ప్రతిఒక్కరికీ ఆదర్శం: ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
TG: మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, దయ, కరుణ, సోదరభావం ప్రతి ఒక్కరిలో ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహంగీర్‌పీర్ దర్గాలో ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ అందించిన మానవతా సందేశాలను ఎమ్మెల్సీ కొనియాడారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ప్రవక్త చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

వెలిజర్లలో అంగడి బజార్ ప్రారంభం
TG: రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో వారాంతపు అంగడి బజార్ ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ బాబు నాయక్ బుధవారం అంగడి బజార్‌ను ప్రారంభించారు. ఇకపై ప్రతి బుధవారం గ్రామంలో అంగడి బజార్ కొనసాగుతుందని తెలిపారు. రైతులు తమ పంటలు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా విక్రయాలు నిర్వహించడం వల్ల ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసరాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

చినుకు పడితే చిత్తడి.. ఆదివాసీలకు ఎంత కష్టమో!
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో 244 పంచాయతీలు, 3600 గ్రామాలు. కానీ నేటికీ 2 వేలకు పైగా గ్రామాల్లో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ అంటూ ఏదీ లేదు. 🏚️<br>వర్షం మొదలైతే చాలు – గ్రామాలు బురద మయం. ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు. ఇక ఆరోగ్య పరిస్థితి అంటే.. డయేరియా, మలేరియా, టైఫాయిడ్ – వర్షాకాలం వస్తే ఈ వ్యాధులు బహుమతిగా వస్తాయి. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ⚠️ ఐటిడిఏ "అభివృద్ధి పనులు చేస్తున్నాం" అంటోంది. కానీ ఆచరణలో అభివృద్ధి కనిపించడం లేదు. ఇప్పటికైనా మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
AP: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలో గిరిజన మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామంగా ఉన్న రోలుగుంటలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరాహ నదిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో తక్షణమే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. గ్రామంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని కోరారు.

ప్రైవేటీకరణ దిశగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ?
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మొత్తం CISF బలగాలను ఉపసంహరించాలన్న కేంద్ర హోంశాఖ <a href="https://www.theclearcutnews.com/n/j5nzAqU">నిర్ణయం</a> కలకలం రేపుతోంది. ప్లాంట్‌లోని సెక్యూరిటీ వింగ్‌లో 1,033 మంది, ఫైర్ వింగ్‌లో 298 మంది CISF సిబ్బందిని నవంబర్ 17, 2026 నాటికి ఉపసంహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉపసంహరణకు ముందు CISFకు చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించి నో-డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించింది. ఈ నిర్ణయం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగమేనని కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

భారత్ నుంచి ఫస్ట్ 100% దేశీ AK-203 ‘Sher’ రెడీ
భారత్ డిఫెన్స్ రంగంలో మరో బిగ్ అచీవ్‌మెంట్ సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ ఫ్యాక్టరీలో 100% భారతీయ భాగాలు, ముడి పదార్థాలతో తయారు చేసిన AK-203 ‘Sher’ రైఫిల్‌ను తొలిసారి టెస్ట్ ఫైర్ చేశారు. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ఈ రైఫిల్ తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. సెప్టెంబర్‌లో ఇండియన్ ఆర్మీ ట్రయల్స్ నిర్వహించనుంది. దీంతో డిఫెన్స్ తయారీలో ‘Make in India’కు మరింత బూస్ట్ లభించనుంది. ఇది పూర్తిగా స్వదేశీ తయారీ దశకు భారత్ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
AP: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ విశాఖపట్నం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవా అనుభవాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. టెట్ నిర్వహణ తప్పనిసరి చేస్తే అన్ని కేటగిరీలకు 40 శాతం మార్కులను ఉత్తీర్ణత ప్రమాణంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అలాగే పరీక్షను ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్ (ఓఎంఆర్) పద్ధతిలో నిర్వహించాలని కోరారు.

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
TG : హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై దొరకుంట (కోదాడ మండలం) దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినవారు. విజయవాడ పడమటి లంకకు చెందిన చెన్నకేశవులు నాగేంద్రబాబు, బేలిపోగు మేరీ కృష్ణతో పాటు తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని ప్రాణాలు కోల్పోయారు. మిగతా ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.

జడ్చర్లలో ఘనంగా ఈద్ మిలాద్ వేడుకలు
TG: ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి, ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, పరస్పర ప్రేమ వంటి సందేశాలను వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, ఐకమత్యంతో జీవించాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఈద్ మిలాద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

టెట్‌కు వ్యతిరేకంగా యూటీఎఫ్ పోరుబాట
AP TETను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం మండల శాఖల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై అదనపు పరీక్షల భారం మోపడం సరికాదని పేర్కొన్నారు. ఏపీ టెట్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తిరువూరులో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని పలు మస్జిద్‌లలో ప్రత్యేక నమాజ్, ప్రార్థనలు చేపట్టారు. జామియా మస్జిద్ మతగురువు రిజ్వీ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సౌభ్రాతృత్వం, మానవత్వ విలువలను వివరించారు. ప్రవక్త మహమ్మద్ చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ప్రేమ, సహనం, సోదరభావాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. మిలాద్ ఉన్ నబీ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

‘టాక్సిక్’ రివ్యూ: యష్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కేనా?
ఈరోజు యష్ ‘Toxic’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ స్వాతంత్ర్యం తర్వాతి గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. గ్యాంగ్‌స్టర్ రాయా(యష్) తన పవర్, డబ్బుతో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. అదే టైమ్‌లో ఫామిలీ, ప్రేమ, నమ్మకం, అతని జీవితాన్ని మరో మలుపు తిప్పుతాయి. యష్ డ్యూయల్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. యాక్షన్, విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ మూవీకు హైలైట్. అయితే స్టోరీ కొన్ని చోట్ల స్లోగా, Confusingగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇది కథ కంటే స్టైల్, యాక్షన్‌పై ఎక్కువగా డిపెండ్ అయిన సినిమా.