Latest

మంచి AI మోడల్ ఎవరికి దక్కుతోంది?
Technology· 26 Aug 2026

మంచి AI మోడల్ ఎవరికి దక్కుతోంది?

అందరికీ ఒకే AI మోడల్ అందుబాటులో ఉంటుందా? ఇప్పుడు ఈ ప్రశ్నపై పెద్ద చర్చ మొదలైంది. కొన్ని సంస్థలు తమ అత్యంత శక్తివంతమైన AI మోడళ్లను అందరికీ ఒకేలా ఇవ్వకుండా, కొన్ని రకాల పనులకు పాత లేదా తక్కువ శక్తి ఉన్న మోడల్‌కి మార్చుతున్నాయి. మరోవైపు, కొన్ని ప్రత్యేక భాగస్వాములు, పరిశోధకులకు మాత్రం ఎక్కువ సామర్థ్యాలతో కూడిన మోడళ్లకు యాక్సెస్ ఇస్తున్నారు. దీంతో AI భద్రత పేరుతో మంచి టెక్నాలజీ కొద్దిమందికే పరిమితం అవుతుందా? అనే ప్రశ్న వస్తోంది.

మన మెదడులోనే కంప్యూటర్!
National· 26 Aug 2026

మన మెదడులోనే కంప్యూటర్!

మన మెదడులోనే ఓ చిన్న కంప్యూటర్ ఉంటే ఎలా ఉంటుంది? ఇది సైన్స్ ఫిక్షన్‌లా అనిపించినా.. సైంటిస్టులు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మెదడులో అమర్చే చిన్న చిప్స్ ద్వారా మన ఆలోచనలతోనే కంప్యూటర్‌ను కంట్రోల్ చేసే టెక్నాలజీపై రీసెర్చ్ జరుగుతోంది. పక్షవాతం లేదా శరీరాన్ని కదపలేని వారికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడొచ్చు. అయితే ఇది సాధారణ మనుషుల కోసం వెంటనే అందుబాటులోకి రాదు. చిప్‌ను సురక్షితంగా అమర్చడం, శరీరం దాన్ని అంగీకరించడం, డేటా భద్రత వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి.

కొన్ని క్షణాల్లోనే అంతా కొట్టుకుపోయింది!
National· 26 Aug 2026

కొన్ని క్షణాల్లోనే అంతా కొట్టుకుపోయింది!

నేపాల్–టిబెట్ సరిహద్దులో ఒక్కసారిగా మట్టి, రాళ్లు, నీటితో భారీ వరద దూసుకురావడంతో తీవ్ర నష్టం జరిగింది. నేపాల్‌లో ఇప్పటివరకు 95 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు వందల మంది ఆచూకీ తెలియడం లేదు. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు వరదలో కొట్టుకుపోయాయి. కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు నదిలోకి జారిపడటంతో ఈ వరద మొదలై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్ల కారణంగా కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది.

Metaకి భారీ షాక్.. $17.1B సెటిల్‌మెంట్!
National· 26 Aug 2026

Metaకి భారీ షాక్.. $17.1B సెటిల్‌మెంట్!

Metaకి భారీ దెబ్బ తగిలింది! అమెరికాలోని 47 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ సహా ఇతర ప్రాంతాలు దాఖలు చేసిన కేసుల నుంచి బయటపడేందుకు Meta $17.1B వరకు చెల్లించేలా సెటిల్‌మెంట్‌కు ఒప్పుకుంది. Facebook, Instagramలో పిల్లలు, టీనేజర్లను ఎక్కువసేపు ఉండేలా చేసే ఫీచర్లు పెట్టారని, వాటి వల్ల యువతకు హాని జరుగుతుందని తెలిసినా సంస్థ చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. Meta మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని చెబుతోంది. ఈ ఒప్పందానికి కోర్టు ఆమోదం ఇంకా రావాల్సి ఉంది.

79లోనూ పని ఆపని వ్యక్తి కథ!
National· 26 Aug 2026

79లోనూ పని ఆపని వ్యక్తి కథ!

79 ఏళ్ల వయసులోనూ రోజూ సైకిల్‌పై పార్సల్స్ ఇస్తున్న ఓ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన సీకే ముఖర్జీ గత 33 ఏళ్లుగా కొరియర్ పని చేస్తున్నారు. ఎండైనా, వానైనా సైకిల్‌పై తిరుగుతూ పార్సల్స్ అందిస్తున్నారు. ఇంత వయసులోనూ ఇలా ఎలా పనిచేస్తున్నారని అడిగితే.. తనకు జనాలు ఇచ్చే ప్రేమ, గౌరవమే ముందుకు వెళ్లే బలమని చెప్పారు. ఇటీవల రెండు కళ్లకు ఆపరేషన్ జరిగినా పని ఆపలేదు. కుటుంబాన్ని చూసుకోవడానికి కూడా ఈ పని కొనసాగిస్తున్నానని చెప్పారు.

వయసు పెరిగేకొద్దీ మెదడులో ఏం మారుతోంది?
International· 26 Aug 2026

వయసు పెరిగేకొద్దీ మెదడులో ఏం మారుతోంది?

చిన్నప్పుడు మెదడులో కొత్త కణాలు తయారయ్యే వేగం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీన్నే న్యూరోజెనెసిస్ అంటారు. ముఖ్యంగా మెదడులోని హిప్పోకాంపస్‌లో కొత్త న్యూరాన్స్ తయారయ్యే విధానంపై సైంటిస్టులు చాలాకాలంగా రీసెర్చ్ చేస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ Neural Stem Cells సంఖ్య తగ్గడం దీనికి కారణంగా భావిస్తున్నారు. పెద్దవాళ్లలో కొత్త న్యూరాన్స్ నిజంగా తయారవుతాయా అనే విషయంలో ఇంకా చర్చ కొనసాగుతోంది. తాజా రీసెర్చ్ మాత్రం పెద్దవాళ్లలోనూ ఈ ప్రక్రియకు ఆధారాలు ఉన్నాయని సూచిస్తోంది.

అన్న మృతదేహానికి రాఖీ కట్టి సాగనంపిన చెల్లి
Local· 26 Aug 2026

అన్న మృతదేహానికి రాఖీ కట్టి సాగనంపిన చెల్లి

TG : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లి గ్రామంలో జమాల్పూర్ నవీన్ ఎలక్ట్రిక్ వర్క్ చేస్తూ కరెంట్ షాక్‌తో చనిపోయాడు. రాఖీ పౌర్ణమికి అన్నయ్యకు కడదామని చెల్లెలు పూజిత ముందే రాఖీ కొని పెట్టుకుంది. కానీ, పండుగకి రెండు రోజుల ముందే అన్న చనిపోవడంతో కుటుంబం చాలా బాధలో ఉన్నారు. అంతిమయాత్ర టైమ్‌లో ఆ చెల్లి తన అన్నయ్య శవానికి రాఖీ కట్టి, 'ఇదే నేను అన్నకి కట్టే లాస్ట్ రాఖీ' అని ఏడుస్తుంటే అక్కడ ఉన్నవాళ్లంతా కంటతడి పెట్టారు.

3,400 కిస్సులు.. ₹5,500 ఫైన్!
National· 26 Aug 2026

3,400 కిస్సులు.. ₹5,500 ఫైన్!

కిస్సులతో ప్రేమ చూపించాలనుకున్నారు.. చివరికి పోలీసులకు దొరికిపోయారు! మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్ కారుపై అతని గర్ల్‌ఫ్రెండ్ దాదాపు 3,400 లిప్‌స్టిక్ కిస్ మార్కులు వేసింది. ఈ పని కోసం నాలుగు గంటలు పట్టింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కారు నంబర్ ద్వారా గుర్తించారు. కార్ లుక్ మార్చడం, రోడ్ సేఫ్టీ రూల్స్‌కు విరుద్ధంగా ఉందని చెప్పి ₹5,500 ఫైన్ వేశారు. కిస్ మార్కులన్నీ తొలగించి కారును క్లీన్ చేయించారు. వైరల్ కావాలనుకున్న స్టంట్.. చివరికి ఫైన్‌తో ముగిసింది!

నికోబార్ ప్రాజెక్టులకు బ్రేక్ చెప్పిన UN కమిటీ!
National· 26 Aug 2026

నికోబార్ ప్రాజెక్టులకు బ్రేక్ చెప్పిన UN కమిటీ!

గ్రేట్ నికోబార్‌లో చేపట్టనున్న భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై యునైటెడ్ నేషన్స్ కమిటీ కీలక సూచనలు చేసింది. పర్యావరణం, ఆర్థిక, సామాజిక అంశాలపై పూర్తి స్థాయి డీటెయిల్డ్ స్టడీ పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులను టెంపరరీగా ఆపివేయాలని కోరింది. ఈ ప్రాజెక్టుల వల్ల అక్కడి దట్టమైన అడవులు, ఎకోసిస్టమ్, స్థానిక గిరిజన జీవనంపై ఎఫెక్ట్ పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి రిసెర్చ్ స్టడీస్ చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించింది.

నోట్లో గోల్డ్ Capsules.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో షాక్!
National· 26 Aug 2026

నోట్లో గోల్డ్ Capsules.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో షాక్!

బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో CISF సిబ్బంది 82 గ్రా. గోల్డ్‌ను సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు రెండు గోల్డ్ క్యాప్సూల్స్‌ను నోట్లో దాచుకుని, ఘజియాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సెక్యూరిటీ చెకింగ్‌లో అతడిపై అనుమానం రావడంతో CISF అధికారులు ఫ్రిస్కింగ్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో గోల్డ్‌ను సీజ్ చేసి, ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.

7 కేజీల గంజాయి దొరికింది
Local· 26 Aug 2026

7 కేజీల గంజాయి దొరికింది

AP : హుకుంపేట మండలం కొంతిలి జంక్షన్ వద్ద పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని చెక్ చేయగా 7 కేజీల గంజాయి దొరికింది. ఒడిశా రాష్ట్రం మాచ్ఖండ్ మండలం ఏనుగు గ్రామానికి చెందిన అజిత్ సీసాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గరున్న గంజాయి, ఒక స్మార్ట్‌ఫోన్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న పరశురాం ఖారా, రాముల కోసం పోలీసులు స్పెషల్ టీమ్స్‌తో వెతుకుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
Local· 26 Aug 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

AP : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ 516E నేషనల్ హైవేపై రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. విశాఖ నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్తున్న ఒక కార్, ముందు వెళ్తున్న బైక్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఆరేళ్ల నాగసూర్య అనే బాబు తలకి గాయం కావడంతో, అరకు ఏరియా హాస్పిటల్‌లో ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వెంటనే విశాఖ KGHకి షిఫ్ట్ చేశారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కార్‌లో ఉన్నవాళ్లను కస్టడీలోకి తీసుకుని కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

గంజాయి అమ్మినా, Minorsకి బైక్ ఇచ్చినా జైలుకే
Local· 26 Aug 2026

గంజాయి అమ్మినా, Minorsకి బైక్ ఇచ్చినా జైలుకే

AP : విజయనగరం జిల్లా పెద లింగాలవలస గ్రామంలో జరిగిన 'పల్లెనిద్ర' ప్రోగ్రామ్‌లో రాజాం రూరల్ CI ఉపేంద్ర రావు మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడినా, అమ్మినా, ట్రాన్స్‌పోర్ట్ చేసినా స్పాట్‌లో కేసులు పెట్టి జైలుకి పంపుతామని స్పష్టం చేశారు. అలాగే ఏజ్ నిండని మైనర్లకు బైక్‌లు ఇస్తే వాళ్ల పేరెంట్స్‌పై కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. విలేజ్‌లో ఉమెన్ సేఫ్టీ కోసం 'శక్తి యాప్' ఎంత హెల్ప్ అవుతుందో వివరించారు. రాబోయే లోకల్ ఎలక్షన్స్ టైమ్‌లో ఎలాంటి అనవసర గొడవలకు పోకుండా ఉండాలని ఊరి జనానికి సూచించారు.

పేద విద్యార్థికి అండగా మాజీ ఎమ్మెల్యే
Local· 26 Aug 2026

పేద విద్యార్థికి అండగా మాజీ ఎమ్మెల్యే

TG : నాగర్‌కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామానికి చెందిన రేవతి అనే అమ్మాయికి బి.పీ.ఎడ్‌ కోర్సులో సీటు వచ్చింది కానీ, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫీజు కట్టడం కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెంటనే రెస్పాండ్ అయ్యారు. రేవతి మొదటి సంవత్సరం ఫీజు కోసం తన సొంత నిధుల నుంచి రూ. 32,000 చెక్కును అందజేసి సపోర్ట్‌గా నిలిచారు. పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదని, రేవతి కోర్సు పూర్తయ్యే వరకు పూర్తి హెల్ప్ అందిస్తూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

అడవి పంది అటాక్.. 2 గంటలు పోరాడిన బాలుడు!
Viral· 26 Aug 2026

అడవి పంది అటాక్.. 2 గంటలు పోరాడిన బాలుడు!

ఒడిశా రాష్ట్రం కటక్ దగ్గరలో షాకింగ్ ఘటన జరిగింది. కెనాల్‌లో స్నానం చేస్తున్న 14 ఏళ్ల బాలుడిపై అడవి పంది సడన్‌గా అటాక్ చేసింది. భయపడకుండా బాలుడు 2 గం. పాటు దానితో పోరాడాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు దాని మెడను వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. చివరికి స్థానికులు అక్కడికి చేరుకుని బాలుడిని కాపాడారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బాలుడి ధైర్యానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మన DNAలోనే డేటా దాచుకోవచ్చా?
Technology· 26 Aug 2026

మన DNAలోనే డేటా దాచుకోవచ్చా?

సైంటిస్టులు సింథటిక్ DNAని సెమీకండక్టర్‌తో కలిపి చాలా తక్కువ పవర్‌తో పనిచేసే కొత్త మెమరీ డివైస్‌ను రూపొందించారు. ఇది డేటా స్టోర్ చేయడంతో పాటు ప్రాసెస్ చేసే అవకాశం చూపించింది. DNAకి ఎక్కువ డేటా డెన్సిటీ, ఎక్కువకాలం సమాచారాన్ని దాచే సామర్థ్యం ఉండటంతో ఇది ఫ్యూచర్ స్టోరేజ్‌కు ఆసక్తికరమైన మార్గంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడే మన ఫోన్ మెమరీ కార్డుకు ఇది రీప్లేస్‌మెంట్ కాదు. స్పీడ్, ఖర్చు, ఎర్రర్స్ వంటి సవాళ్లపై రీసెర్చ్ చేయాల్సి ఉంది. భారీ డేటాను తక్కువ పవర్‌తో దాచే మార్గం ఇది.

మంగళగిరి కొండపై ప్లాస్టిక్ క్లీనింగ్
Local· 26 Aug 2026

మంగళగిరి కొండపై ప్లాస్టిక్ క్లీనింగ్

AP :మంగళగిరి కొండ ప్రశాంతంగా, అందంగా ఉండాలి కానీ, అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లు, సిగరెట్ బాక్సులు, మందు సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడేసి కనిపించాయి. ఇది చూసిన ABVP-SFD విద్యార్థులు క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ రెస్పాన్సిబిలిటీగా ఉండాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి క్లాత్ బ్యాగ్స్ వాడాలని విద్యార్థులు కోరారు. కొండపైకి వచ్చి ప్రకృతిని ఆస్వాదించాలి తప్ప చెత్త పడేసి నాశనం చేయకూడదని, పరిసరాలను నీట్‌గా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని మెసేజ్ ఇచ్చారు.

స్కూల్ పిల్లల కోసం వాటర్ కాన్స్ Supply
Local· 26 Aug 2026

స్కూల్ పిల్లల కోసం వాటర్ కాన్స్ Supply

TG : ఖమ్మం జిల్లా మహాదేవపురం ZPHS, MPPS స్కూళ్ల విద్యార్థుల ఆరోగ్యం కోసం 'జంగాల యూత్' యువకులు రోజూ 10 నుండి 15 వాటర్ క్యాన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. చేజర్ల సాయి శివ, గంధం సాయి, కిన్నెర సాయి, పస్తం సురేష్, చేజర్ల సురేష్, పస్తం సాయి వర ప్రసాద్ ఈ మంచి పనికి ముందుండి నడిచారు. HM సాధు సమాధానం, లలిత కుమారి, టీచర్లు, స్టూడెంట్స్ వీరిని అభినందించారు.

తార్నాకలో డిఫెన్స్ లిక్కర్ పట్టివేత.. 67 బాటిళ్లు సీజ్!
TG· 26 Aug 2026

తార్నాకలో డిఫెన్స్ లిక్కర్ పట్టివేత.. 67 బాటిళ్లు సీజ్!

TG: హైదరాబాద్‌లోని తార్నాకలో ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ రైడ్స్ చేసి 67 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను సీజ్ చేసింది. వీటి Value దాదాపు రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఓ ఇంటిపై రైడ్ చేశారు. ముందుగా 10 బాటిళ్లు, తరువాత మరో 57 బాటిళ్లు బయటపడ్డాయి. ఈ లిక్కర్ కర్ణాటక, హర్యానాకు చెందినవిగా గుర్తించారు. పట్టుబడిన వ్యక్తిని సికింద్రాబాద్ Excise స్టేషన్‌కు అప్పగించారు. ఆ వ్యక్తి మాజీ సోల్జర్ కొడుకు మాధవన్‌గా గుర్తించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ తెలిపింది.

రక్తదానంలో రియల్ హీరో
Local· 26 Aug 2026

రక్తదానంలో రియల్ హీరో

TG : రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటం. మరి వేల ప్రాణాలను కాపాడిన వ్యక్తిని ఏమనాలి? రియల్ హీరో అనాలి కదా! కామారెడ్డికి చెందిన డాక్టర్ బాలు 2007 నుంచి సేవలు అందిస్తూ 84 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేషన్ సర్వీసెస్‌లో ఆయన చేసిన అద్భుత సేవలకు ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా 'వాసవి నవరత్న అవార్డు' అందుకున్నారు.

స్కూళ్లలో జంక్ ఫుడ్ బ్యాన్ చేయాలి
Local· 26 Aug 2026

స్కూళ్లలో జంక్ ఫుడ్ బ్యాన్ చేయాలి

AP : పిల్లల హెల్త్, కాన్సంట్రేషన్ కాపాడేందుకు స్కూళ్లలో జంక్ ఫుడ్‌ను బ్యాన్ చేయాలని ‘ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రభుత్వాన్ని కోరింది. స్కూల్ క్యాంటీన్లలో అన్‌హెల్దీ ఫుడ్‌ను బ్యాన్ చేసి, న్యూట్రిషన్ వివరాలు ఉండే లేబుల్స్ పెట్టాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలని, విలేజ్ స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంతో పాటు డిజిటల్ ప్రెజర్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.