రెబెల్స్ కి బెర్తులు లేవ్- విజయ్ ప్రభుత్వం క్లారిటీ

తమిళనాడులో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలకు కేబినెట్ బెర్తులు ఇస్తారన్న వార్తల్లో నిజం లేదని టీవీకే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అన్నాడిఎంకే రెబెల్స్ కు గనక మినిస్ట్రీలిస్తే సపోర్ట్ విషయంపై మళ్లీ ఆలోచిస్తామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్చరించడంతో విజయ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇటు ఇతర మిత్రపక్షాలు కూడా సంకీర్ణ ధర్మానికి అది విరుద్ధం అని అబ్జెక్షన్ చెప్పాయి. దాంతో ప్రభుత్వంలో మంత్రి ఒకరితో విజయ్ క్లారిటీ ఇప్పించారు. అలాంటిదేమీ లేదని, అవన్నీ ఊహాగానాలేనని చెప్పారు.ఎట్టకేలకి ఈ ఇష్యూకి తెరపడినట్లయ్యింది.



