హిందీ స్పీచ్ తో సర్ ప్రైజ్ చేసిన ఇటలీ ప్రధాని !!

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధాని నరేంద్ర మోదీల జాయింట్ మీటింగ్ లో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది. ఇరు దేశాల సంబంధాల బలాన్ని వివరించడానికి మెలోని "పరిశ్రమే విజయానికి మూలం" (పరిశ్రమ్ హీ సఫలతా కీ కుంజీ హై) అనే హిందీ సామెతను ఉపయోగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మోదీ పర్యటనతో భారత్-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని, బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. మెలోనీ హిందీ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
