← Back to news

అక్కడ ఉదయం 10 నుంచే షాపులు బంద్

By aravinda nyayapati· 20 May 2026· Lucknow
అక్కడ ఉదయం 10 నుంచే షాపులు బంద్

యూపీలోని బండా జిల్లాలో ఎండల ధాటికి జనం నరకం చూస్తున్నారు. ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు నమోదు కావడంతో అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే షాపులన్నీ బంద్ అయిపోతున్నాయి. జనాలు బయటకి రాకపోవడంతో అప్రకటిత కర్ఫ్యూలా పరిస్థితి మారిపోయింది. కూలీలు రాత్రి పూట ఎల్‌ఈడీ లైట్ల వెలుతురులో పొలం పనులు చేసుకుంటున్నారు. ఎండ వేడికి ట్రాన్స్‌ఫార్మర్లు పేలకుండా నీళ్లు చల్లుతున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ విధ్వంసమే ఈ విపత్తుకు కారణం!

More in India