ఇండియాపై ఎటాక్‍కి ఒసామా బిన్ లాడెన్ ప్లాన్?

అమెరికా CIA రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం, 1998లో ఒసామా బిన్ లాడెన్, ఇండియా సహా అనేక దేశాలపై ఎటాక్స్ చెయ్యాలనుకున్నాడు. 1998 ఆగస్టు 28న మెమోలో అతను ఈజిప్ట్, కువైట్, సౌదీ అరేబియా, యెమెన్, భారత్, పాకిస్థాన్, ఉగాండా, నైజీరియాలో దాడులకు ప్లాన్ చేశాడు. అతని ప్రధాన లక్ష్యం అమెరికా నేల అనీ, పేలుడు పదార్థాలతో నింపిన విమానాన్ని అమెరికా నగరంపై ఢీకొట్టాలని ప్లాన్ చేసినట్లు 1998 సెప్టెంబర్ బ్రీఫ్ చెబుతోంది. ఈ పత్రాలు 9/11 కమిషన్ రిపోర్టును కన్ఫామ్ చేస్తున్నాయి.


