పాక్‌లో పెట్రోల్ మంట.. 5 రోజుల్లో 5 సార్లు పెంపు!

పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల ఫ్లక్చుయేషన్స్, కొత్త పెట్రోలియం ప్రైసింగ్ పాలసీతో కేవలం 5 రోజుల్లోనే 5 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్‌పై ఏకంగా 29.95 పాక్ రూపాయలు పెరిగి, రికార్డు స్థాయిలో 375.82 పాక్ రూపాయలకు చేరింది. పెరుగుతున్న ఫ్యూయల్ రేట్లతో ట్రాన్స్‌పోర్ట్, నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. తాజా రేట్లు 3 రోజులే అమల్లో ఉండటంతో మరోసారి పెంపు ఉంటుందేమోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు.


