← Back to news

240 మందితో షిప్ మిస్సింగ్.. జావా సముద్రంలో సెర్చ్!

By Mahesh· 13h ago· Indiatimes· Indonesia
240 మందితో షిప్ మిస్సింగ్.. జావా సముద్రంలో సెర్చ్!

240 మందితో వెళ్తున్న ఇండోనేషియా ప్యాసింజర్ షిప్‌ జావా సముద్రంలో కాంటాక్ట్ కోల్పోయింది. ‘విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8’ సురబయా నుంచి సౌత్ కలిమంతన్‌లోని బంజార్మసిన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చివరిసారిగా బంజార్మసిన్‌కు 148 కి.మీ దూరంలో షిప్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 103 మందిని పైగా సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. మిగతావారి కోసం సెర్చ్ కొనసాగుతోంది. బ్యాడ్ వెదర్ వల్లే ఈ ఘటన జరిగినట్లు షిప్ ఆపరేటర్ తెలిపాడు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సమాచారం లేదు.

More in International