జడ్చర్లలో రావణ దహనానికి సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాత్రి 7 గంటలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. B.R. డిగ్రీ కళాశాల మైదానంలో రావణ దహనం, డ్రోన్ షో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు నియోజకవర్గ ప్రజలు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.


