← Back to news

సిద్దిపేట వద్ద కొప్పుల ఈశ్వర్‌ను అడ్డుకున్న పోలీసులు

By Sunke Vinith· 1h ago
సిద్దిపేట వద్ద కొప్పుల ఈశ్వర్‌ను అడ్డుకున్న పోలీసులు

TG: కరీంనగర్‌లోని తన నివాసం నుంచి ఎర్రవెల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు బయల్దేరిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను సిద్దిపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను మార్కుక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొప్పుల ఈశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో BRS శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

More in Local