అసెంబ్లీ ముట్టడికి యత్నం.. పలువురు జనసేన నేతల అరెస్ట్

TG: ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాద్‌లో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్‌తో పాటు పలువురు జనసేన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నేమూరి శంకర్ గౌడ్‌తో పాటు నాయకులను సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.

