చిన్నపోర్ల గేట్ వద్ద విద్యార్థుల ధర్నా

TG: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపోర్ల గేట్ వద్ద బస్సుల సమయపాలన, అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బస్సులు నిర్ణీత సమయానికి రాకపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా చేరుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం వేళల్లో రద్దీ అధికంగా ఉండటంతో బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. విద్యార్థుల ధర్నాతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అ



