← Back to news

బీసీ గురుకులంలో కనీస సౌకర్యాలు కరువు

By Narsimulu Ganapuram· 4d ago· Vikarabad
బీసీ గురుకులంలో కనీస సౌకర్యాలు కరువు

TG: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బీసీ బాలుర గురుకులంలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ గురుకులంలో సరిపడా బెంచీలు లేక 5వ నుంచి 7వ తరగతి విద్యార్థులు నేలపైనే కూర్చొని చదువుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆటస్థలం కూడా లేకపోవడంతో వారి మానసిక, శారీరక వికాసంపై ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More in Local