నూతన రామాలయానికి ఘనంగా శంకుస్థాపన

AP: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గిడిజాం గ్రామంలో రామాలయ పునర్నిర్మాణానికి గ్రామస్థులు ఐక్యంగా శ్రీకారం చుట్టారు. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని నూతనంగా నిర్మించేందుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి యువత, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు గ్రామ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.



