← Back to news

టైలర్లకు ఉచిత విద్యుత్.. మంత్రి లోకేష్ స్పందన!

By KUCHIPUDI BUJJIBABU· 1h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur
టైలర్లకు ఉచిత విద్యుత్.. మంత్రి లోకేష్ స్పందన!

ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి శుక్రవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. టైలర్ల ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలను వివరించారు. ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉన్న టైలరింగ్ సొసైటీల అర్హులైన సభ్యులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

More in Local