గుండె హెల్త్‌కి ‘దానిమ్మ’.. సైంటిస్టుల రిసెర్చ్ ❤️

కొంచెం నడవగానే అయాసం వచ్చి ఆగిపోతున్నారా? గుండె కండరాలు గట్టిపడటమే (డయాస్టొలిక్ హార్ట్ ఫెయిల్యూర్) దీనికి మెయిన్ రీజన్. దానిమ్మ గింజలతో ఈ ప్రాబ్లమ్‌కి 80శాతం చెక్ పెట్టొచ్చని యూకే కింగ్స్ కాలేజ్ సైంటిస్టులు చెప్తున్నారు. దానిమ్మ తింటే బాడీలో ‘యూరోలిథిన్-ఏ’ అనే కెమికల్ రిలీజ్ అయి, గట్టిపడిన గుండె నరాలను సాఫ్ట్‌గా మారుస్తుంది. దీనివల్ల బ్లడ్ పంపింగ్ ఈజీ అవుతుంది. దానిమ్మతో పాటు వాల్‌నట్స్, స్ట్రాబెర్రీలలో కూడా గుండె జబ్బులను తగ్గించే శక్తి ఉందని సైంటిస్టులు తెలిపారు.



