ఆసియా ఖడ్గమృగాలకు ‘గుడ్ ఇయర్’!

ఆసియా ఖడ్గమృగాల సంరక్షణలో 2025 కీలక విజయాన్ని అందించింది. భారత్, నేపాల్, ఇండోనేషియాలో ఒక్క ఖడ్గమృగం కూడా వేటకు గురికాలేదని ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్(IRF) 2026 రిపోర్ట్‌లో వెల్లడించింది. భారత్లో గ్రేటర్ వన్-హార్మ్డ్ రైనోల సంఖ్య 4,075కు చేరింది. అసోంలోని కాజిరంగా, మానస్‌తో పాటు యూపీలోని దుధ్వా, పశ్చిమ బెంగాల్లోని జల్దాపారా, గోరుమారా ప్రాంతాల్లోనూ వాటి సంఖ్య పెరుగుతోంది. అయితే అడవుల నాశనం, ఆక్రమణ మొక్కల విస్తరణ ఇంకా పెద్ద ముప్పుగా ఉన్నాయని IRF హెచ్చరించింది.



