ఆఖరికి ఆ దేశంలోకీ దోమల ఎంట్రీ..!

ఐస్‌లాండ్ పేరు వింటే మనకు గుర్తొచ్చేది చల్లటి మంచు కొండలు. కానీ ఆ దేశానికి మరో పేరుంది.అదే దోమలు లేని దేశం. ఇప్పుడు ఆ స్టేటస్ అది కోల్పోయింది. ఐస్ లాండ్ లోకి కూడా ఇప్పుడు మస్కిటోలు ఎంట్రీ ఇచ్చేశాయి. వాతావరణ మార్పులతో అక్కడ మంచు కొండలు కరిగిపోయి చలి తగ్గిపోవడంతో దోమలు బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐస్‌లాండ్ వెళ్లే ప్లాన్ ఉంటే స్వెట్టర్లతో పాటు ఇకపై మస్కిటో కాయిల్స్ కూడా పట్టుకెళ్లాల్సిందేనేమో!



