ఇంటి పనులు మహిళలకేనా?

మహిళలు ఇంటిని చూసుకుంటున్నట్లే, పురుషులు కూడా ఇంటి బాధ్యతలు తీసుకుంటే తప్పేంటని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ప్రశ్నించింది. తిరువణ్ణామలైకి చెందిన మెడికల్ కపుల్ విడాకుల కేసులో ఈ కామెంట్స్ చేసింది. మహిళలు జాబ్స్ చేయడానికి పెళ్లి అడ్డుగా మారకూడదని తెలిపింది. ఇంటి పనులు, బాధ్యతలను భర్తలు కూడా షేర్ చేసుకోవాలని తెలిపింది. స్త్రీ, పురుషులకు ఈక్వల్ రైట్స్ ఉండాలని చెప్పింది. 2కోట్ల 50 లక్షలు భరణం ఇచ్చేందుకు భర్త ఒప్పుకోవడంతో మ్యూచువల్ డివోర్స్‌ను హైకోర్టు ఆమోదించింది.

