వ్యాన్‌లో ప్రత్యేక అరలు.. అక్రమ మద్యం రవాణా గుట్టురట్టు

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అక్రమంగా తరలిస్తున్న రూ.6.38 లక్షల విలువైన 70 బాక్సుల ఐబీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాద్రానగర్ హవేలీ నుంచి మద్యం తరలిస్తున్న వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు మహారాష్ట్ర భివాండీకి చెందిన ప్రధాన సరఫరాదారు ప్రవీణ్ సిరిగిరితో పాటు డ్రైవర్ ప్రదీప్ జైస్వాల్, అజయ్ భగవాన్‌ను అరెస్ట్ చేశారు. ఖాళీ వ్యాన్‌లో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి మద్యం రవాణా చేస్తుండగా ఎక్సైజ్ సీఐ రాథోడ్ బృందం తెల్లవారుజామున రూట్‌వాచ్ నిర్వహించి పట్టుకుంది.


