అత్యాచారం.. పోక్సో కేసు నమోదైనా చర్యల్లేవు..?

TG: ఖమ్మం పట్టణంలో 12ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసిన కామాంధుడు భవనం పైనుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన బాలికను హాస్పిటల్‌కు తరలించారు. బాలిక కుటుంబం నివాసం ఉంటున్న అపార్ట్మెంట్‌లో ఉంటున్న వ్యక్తే లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన ఈ నెల 6వ తేదీనే జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు.



