కాళేశ్వరంపై KCR సమాధానం చెప్పాలి: వివేక్

TG: KCR అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందో సమాధానం చెప్పాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలన 1000 రోజులు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో నిర్వహించిన సంబరాల్లో మంత్రి పాల్గొని బైక్ ర్యాలీ చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని కేసీఆర్‌పై విమర్శలు చేశారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానన్నారు.



