SIRపై CM రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

కొడంగల్‌లోని తన ఇంట్లో కార్యకర్తలు, లోకల్ లీడర్స్‌తో CM రేవంత్ రెడ్డి మీట్ అయ్యారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే నేషనల్ లెవల్‌లో ఈ ప్రాంతానికి గుర్తింపు, గౌరవం వచ్చిందన్నారు. SIR పేరుతో కేంద్రం ఓట్ల డిలీట్ చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. BJP అధికారంలో లేని రాష్ట్రాలనే టార్గెట్ చేస్తున్నారని, బెంగాల్‌లో ఇదే జరిగిందన్నారు. కాంగ్రెస్ అనుకూల ఓట్లను, SC, ST, మైనారిటీ ఓట్లను డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నారని విమర్శించారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మండల నాయకులదేనన్నారు.



