మంత్రులకు అధికారుల ఘన స్వాగతం
TG: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వచ్చిన రాష్ట్ర మంత్రులు డాక్టర్ దనసరి సీతక్క, జూపల్లి కృష్ణారావుకు అధికారులు ఘన స్వాగతం పలికారు. పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి గేటు వద్ద రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రులకు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం తెలిపారు. అనంతరం మంత్రులు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.



