వెంకటాపురంలో ఘనంగా Teachers Day

TG: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో Teachers Day వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హెడ్‌మాస్టర్ సుభాషిణి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అలరించారు.



