← Back to news

భోజనం లేట్ అయ్యిందని వదినపై దారుణం

By RK· 30 Jul 2026· Bihar
భోజనం లేట్ అయ్యిందని వదినపై దారుణం

బీహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో భర్త పొలానికి వెళ్లగా భార్య అన్షు దేవి(25) ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఆమె మరిది 'కునాల్' ఇంటికి వచ్చి భోజనం అడిగాడు. అన్నం పెట్టడం లేట్ అవ్వడంతో గొడ్డలి తీసుకొని వదిన తల నరికేశాడు. ఆ తలను ఇంటి ముందు ఉన్న చెట్టుకు వేలాడదీసి, పారిపోకుండా అక్కడే కూర్చున్నాడు. అక్కడి వాళ్లు పోలీసులకు చెప్పడంతో వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. కునాల్ ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో ఉండేవాడనీ ఊరివాళ్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 11h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.