బెంగాల్‌లోని SRFTIలో ఘర్షణ..!
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్(SRFTI)లో ఆదివారం ఘర్షణ జరిగింది. ఆల్ ఇండియా గ్రాహక్ పంచాయత్(ABGP) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోస్టర్లు, బ్యానర్లు చింపారనే ఆరోపణలు వచ్చాయి. ‘Go Back RSS’ నినాదాలు వినిపించాయని BJP నేతలు తెలిపారు. ఘటనలో పలువురు విద్యార్థులు, లెక్చరర్స్ గాయపడ్డారు.
