పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే కంప్లైంట్ చేయొచ్చు: మంత్రి

AP: పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే కంప్లైంట్ చేయొచ్చని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో ‘మీ పోలీస్.. మీ ఫ్రెండ్’ డిజిటల్ కంప్లైంట్ కియోస్క్‌ను ప్రారంభించారు. పోలీస్ సర్వీసులు ఈజీగా, ఫాస్ట్‌గా, పారదర్శకంగా అందించడమే లక్ష్యమని అన్నారు. ఈ కియోస్క్‌లో వాయిస్‌తో కంప్లైంట్ చేసే ఆప్షన్ ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. ప్రజలకు పోలీస్ సర్వీసులు ఈజీగా అందేలా ఈ సర్వీస్‌ను తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు.

